Sudden Strike
-
అమెరికా తర్వాతి టార్గెట్ అదేనా?
వాషింగ్టన్: సిరియాపై దాడికి పాల్పడిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఉత్తర కొరియాపై దృష్టి సారించింది. దుండుకు చర్యలతో తమకు పక్కలో బల్లెంలా తయారైన కొరియాకు కళ్లెం వేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు దిగుతోందన్న కారణంతో కొరియాపై అమెరికా దాడులకు సన్నమవుతున్నట్టు సమాచారం. ఉత్తర కొరియాపై సైనిక చర్య సహా ఆకస్మిక దాడులకు వెనుకాడరాదని ట్రంప్ యోచిస్తున్నారని వైట్ హౌస్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కొరియాను దారికితెచ్చే విషయంలో చైనా ముందడుగు వేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని శ్వేతసౌధ అధికారి తెలిపారు. కొరియా చర్యలపై ఎలా స్పందించాలన్న దానిపై అమెరికా జాతీయ భద్రతా బృందం ఇప్పటికే వ్యూహాలు రూపొందించినట్టు వెల్లడించారు. ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలం కావడంతో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఉత్తరకొరియా శనివారం వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శించి ప్రత్యర్థులకు గట్టి సందేశాలు పంపింది. కొరియా చర్యను అమెరికా తప్పుబట్టింది. కవ్వింపు, అస్థిరపరిచే చర్యలకు కొరియా దిగుతోందని అగ్రరాజ్యం పేర్కొంది. -
ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె
- అనంతపురం జిల్లాలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు అనంతపురం: జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కార్మికులు చేపట్టిన సమ్మె ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జిల్లాలోని 12 డిపోల్లో 250 బస్సులు కదలలేదు. వన్ మ్యాన్ సర్వీసులను రద్దుచేయాలని, అధికారుల వేధింపులు మానాలని, ఆర్ఎం మొండివైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, మిగిలిన కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు విధులకు హాజరయ్యారు. అయినా ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన కార్మికులు డిపోల వద్ద ధర్నా చేశారు. ఉదయం 7 గంటల వరకూ 250 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా సమ్మె ఆగదని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. చాలా బస్‌సర్వీసులు రద్దుకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెరుపు సమ్మె
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్: సింగరేణిలో బొగ్గు లారీల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. గనుల నుంచి ఉత్పత్తి బొగ్గును దూర ప్రాంతాల్లోని పరిశ్రమకు వీరు సరఫరా చేస్తుంటారు. రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సోమవారం మధ్యాహ్నం నుంచి సమ్మెకు దిగారు. శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లకు చెందిన లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. బెల్లంపల్లి డివిజన్లో కూడా నేడు లేదా రేపు మొదలయ్యే అవకాశం ఉంది. సమ్మె మూలంగా ఈ రెండు డివిజన్ల పరిధిలోని 800 లారీలు బుకింగ్ యార్డుల వద్దే నిలిచాయి. దీంతో బొగ్గు రవాణాపై ప్రభావం పడింది. సింగరేణి బొగ్గును ఈ యాక్షన్ ద్వారా కొనుగోలు చేసిన కంపెనీలకు ఇక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తోంది. రవాణా చేసే కంపెనీలకు, లారీ యజమానులకు మధ్య కోల్ట్రాన్స్పోర్టర్లు ఉంటారు. టన్ను బొగ్గు రవాణాకు దూరంను బట్టి ట్రాన్స్పోర్టర్లు కిరాయిని చెల్లిస్తారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా కి రాయి ఇవ్వడం లేదని కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ లారీల యాజమానులు సమ్మెకు దిగారు. రెండేళ్ల కిత్రం లీటరు డీజిల్ ధర రూ.41.45 పైసలు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు కిరాయి టన్నుకు రూ. 724 ఇచ్చే వారని ఇప్పుడు డీజిల్ ధర రూ.59.68 పైసలకు పెరిగినా కూడా అదే కిరాయి ఇవ్వడంతో గిట్టుబాటు కావడం లేదని లారీ యాజమానులు వాపోతున్నారు. ఇప్పుడున్న పాత కిరాయిపై 20 శాతం చార్జీ పెంచి టన్నుకు రూ.150 తగ్గకుండా కిరాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు లారీల విడిభాగాల ధరలు, లారీ డ్రైవర్ల, క్లీనర్ల జీతం పెరిగిందని, టోల్‌టాక్స్‌లు కూడా పెరిగాయని లారీ యజమానులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీలు పెంచాలని కోల్ట్రాన్స్పోర్టర్లను డిమాండ్ చేస్తున్నామని ఓనర్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, లారీల ద్వారా దూర ప్రాంతాలకు జరగాల్సిన బొగ్గు రవాణా ఆగిపోవడంతో అధికారులు పంపించాల్సిన బొగ్గును టిప్పర్ల ద్వారా సీఎస్పీకి తరలిస్తున్నారు. శ్రీరాంపూర్ డివిజన్లో రోజుకు 7 వేల టన్నులు, మందమర్రి డివిజన్లో రోజుకు సుమారు 1,800 టన్నుల బొగ్గు లారీల ద్వారా రవాణా అయ్యేది. ఇప్పుడు దాన్ని సీఎస్పీలో స్టాక్ చేస్తున్నారు. దీనిని వ్యాగన్ల ద్వారా పంపించే అవకాశం ఉంది. నష్టాలు వస్తున్నాయి. కిరాయి తక్కువగా ఉండటంతో నష్టాలు వస్తున్నాయి. రెండేళ్ల నుంచి బొగ్గు రవాణా చార్జీలు పెంచలేదు. దీంతో లారీల నిర్వాహణ భారం అయ్యింది. దీంతో లారీలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్పోర్టర్లు మా డిమాండ్లను తీర్చి రవాణా చార్జీ పెంచాలి. - బింగి రవీందర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీరాంపూర్ అన్నింటికి ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని రెండేళ్లలో అన్నింటికి ధరలు పెరిగాయి. వాటికి అనుగుణంగానే బొగ్గు రవాణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. నాకు 3 లారీలు ఉన్నాయి. సమ్మెతో రోజుకు రూ. 6వేల నష్టపోతున్నా. కిరాయి పెరిగేంత వరకు లారీలు నడపం. - పుప్పాల సత్తయ్య, లారీ ఓనర్ -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మె
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : బదిలీ అయిన ఉద్యోగుల బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ సబ్ డివిజన్ ఇంజినీర్ విభాగంలో కేవలం 37 శాతం మంది ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు. ఎల్లారెడ్డి,బోధన్,మోర్తాడ్,కిసాన్‌నగర్ సబ్ డివిజన్లకు ఇంజినీర్లు లేరన్నారు. అలాగే జిల్లాలో జేటీవోలు కేవలం 40 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న జేటీవోలు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వారి స్థానంలో మరొకరు రాకముందే పైరవీలు చేసి రిలీవ్ అవుతున్నారని ఆరోపించారు. దీంతో జిల్లాలో బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. మార్కెటింగ్ విభాగంలో పని చేసే జేటీవోలను జీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులు నియమించారన్నారు. అక్కడ జేటీవోలతో చిన్న చిన్న పనులను చేయిస్తున్నారని,దీంతో కస్టమర్ కేర్ సెంటర్లలో అనేక పనులు పెండింగ్‌లో పడుతున్నాయన్నా రు. సమ్మెలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం,ఉపాధ్యక్షుడు మధుసూదన్,సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ,మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి,బ్రాంచ్ కార్యదర్శి రఘనందన్,నాయకులు గంగాధర్,బాల గంగయ్య,సాయిలు తదితరులు పాల్గొన్నారు. కస్టమర్ కేర్ సెంటర్ల మూసివేత.. ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మె చేపట్టడంతో కస్టమర్ కేర్ సెంటర్లు మూసివేశారు. జిల్లా కేంద్రంలోని సెల్వన్ కార్యాలయం,వినాయక్‌నగర్,కంఠేశ్వర్‌లోని కస్టమర్ కేర్ సెంటర్లు మూసివేశారు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు ఆకస్మాత్తుగా సమ్మెకు దిగడం పలు అనుమానాలు తావి స్తోంది. సమ్మె, ధర్నాలు చేసేముందు ఉద్యోగులు త మ పైఅధికారులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి. కాని గురువారం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆకస్మాత్తుగా ధర్నాకు దిగడంపై ఉన్నతాధికారులు వీరిపై చర్యలకు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.