సుధాకర్ అరెస్టుపై డీఎస్పీ విచారణ
కొత్తూరు,న్యూస్‌లైన్: అక్రమంగా అరెస్టు చేశారం టూ.. ఐజీ ఐజీ ద్వారకా తిరుమలరావుకు అందిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఎన్ఎన్ కాలనీకి చెందిన జి.సుధాకర గంజాయి తరలిస్తున్నాడంటూ.. ఈ నెల ఏడో తేదీన స్థానిక పోలీసులు అరెస్టు చేసి, కోర్టుకు పంపారు. అయితే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారంటూ.. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఐజీ ద్వారకా తిరుమలరావు దృష్టికి పలువురు విలేకరులు తీసుకెళ్లారు. స్పందించిన ఐజీ విచారణ జరపాలని డీఎస్పీని ఆదేశించారు.
దీంతో పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో బుధవారం విచారణ జరిపారు. సుధాకర్ నివాసం ఉంటున్న ఎన్ఎన్ కాలనీకి చేరుకుని, సుధాకర్ వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యం తదితర వివరాలు తెలుసుకున్నారు. అతనితో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న సహోపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే..ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో ఉన్న పాన్‌షాపు యజమాని భాస్కరరావు పాత్రో నుంచి సమాచారం సేకరించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి..సుధాకర్ అరెస్టుకు సంబంధించిన సమయం, పట్టుకున్న తీరు..తదితర వివరాలపై ఆరా తీశారు. విచారణ పూర్తి చేసి, నివేదికను ఎస్పీకి అందజేస్తామని డీఎస్పీ చెప్పారు. ఆయనతో పాటు సీఐ ఎన్.సాయి ఉన్నారు.