sudheesh rambhatla
-
‘హరిప్రసాద్ తప్పుదోవ పట్టిస్తున్నారు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ నేత సుదీశ్ రాంబొట్ల విమర్శించారు. హైదరాబాద్‌లో సుదీశ్ రాంబొట్ల మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు దాడి చేసి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2009లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఈవీఎంలపై నెపం నెట్టారని, 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయని బాబు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈవీఎంలను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలను మేనిపులేట్ చేసే అవకాశం ఉంటే తాము మొన్న జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోతామని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తోన్న వ్యవహారంపై గవర్నర్‌ని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. బాబుపై దేశద్రోహి నేరం కింద కేసు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని.. అందులో భాగంగానే మోదీని కూడా తిడుతున్నారని బీజేపీ నేత విజయ్ బాబు విమర్శించారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ టెక్నీషియన్ హరిప్రసాద్‌ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మాండ్యలో చంద్రబాబు ప్రసంగంపై చాలా అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని వెల్లడించారు. -
‘చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ’
సాక్షి, అమరావతి : ప్యాకేజీకి రైట్ రైట్ అన్న చంద్రబాబు.. తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంభొట్ల అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీ దీక్ష కోసం రైల్వే శాఖకు జీవో విడుదల చేశారన్నారు. దీక్షలో పాల్గొనే తమ నాయకుల కోసం సిగ్గు లేకుండా ఏసీ హోటళ్లు బుక్ చేశారని మండిపడ్డారు. బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది వికృత రాజకీయ విన్యాస క్రీడ అని, కొత్త బూచిని చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి, చంద్రబాబు అదే మేలు అన్నారు ప్యాకేజీకి ఒప్పుకొన్న చంద్రబాబు ప్రస్తుతం హోదా రాగం పాడుతున్నారని సుదీశ్ రాంభొట్ల ఎద్దేవా చేశారు. ‘అప్పుడు నీతి ఆయోగ్ లో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని అదనపు బెనిఫిట్ ఇవ్వాలని ఆగష్టు 2016లో నీతి ఆయోగ్ చెప్పింది. ఆ సమయంలో ప్యాకేజీ మేలు అని సీఎం చంద్రబాబు, సుజనా చౌదరి అన్నారు. పైగా ప్యాకేజీకి మించింది ఏముంటుంది అన్నారు. ప్యాకేజీ చట్టబద్దత కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మాతో కలిసి ఉన్నపుడు ఇలా ఎన్నో ప్రకటనలు చేశారు. మాతో కలిసి ఉన్నప్పుడు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు’అని వ్యాఖ్యానించారు. -
'పవన్.. ప్రజలకు ఏం చెప్పదలచుకున్నావ్ ?'
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీని అవహేళన చేయడం మానుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబట్ల హితవు పలికారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సహాయం, కేంద్రం ఏ రాష్ట్రానికి చేయలేదని అన్నారు. గతంలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి చేసిన సహాయంపై టీడీపీ నాయకులు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన ప్రతిపైసాకు రాష్ట్రం లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పది సంవత్పరాల్లో ఇవ్వాల్సిన విద్యాసంస్థలను ఒకే ఏడాదిలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. అన్ని సక్రమంగా ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. తాము చెప్పిన లెక్కలు తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని అవహేళన చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. అసలు పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. జేఎఫ్‌సీలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారని, ఒకరు అవును అంటే మరొకరు కాదు అంటున్నారని విమర్శించారు. ముందు జేఎఫ్సీ విధివిధానాలు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని, ఆ తర్వాతే ఇతర విషయాలు అడగాలంటూ సూచించారు. -
'ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నిద్రపోయిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు రఘునాథబాబు, సుధీశ్ రాంభట్ల వ్యాఖ్యానించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తోంది వెంకయ్యనాయుడు మాత్రమేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలంటూ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రూ.63వేల కోట్లను ఏపీ అభివృద్ధికి కేటాయించిందని రఘునాథబాబు, సుధీశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.