అద్భుత రాతి కట్టడం మక్కా మసీదు
మక్కా మసీదు నిర్మాణంలో మట్టి వాడలే, చార్మినార్ కట్టడంలో రాయి వాడలే. ఈ పత్యేకత ఎప్పుడైనాగమనించారా? ఈసారి వెళ్ళినప్పుడు తప్పక పరిశీలించండి!! మన దేశంలోని అతి పెద్ద పురాతన, చారితక విశిష్టత గల మసీదుల్లో మక్కా మసీదు ప్రధానమైంది. మక్కా మసీదు నిర్మాణానికి 1617లో శంస్థాపన జరిగింది.
కులీ కుబ్షా రాజు, సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా మక్కా మసీదు కోసం శంస్థాపన చేశాడు. కుతుబ్షాల పాలన అంతమయ్యాక మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పాలనలో, 1694 నాటికి ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి. ఔరంగజేబు ఈ మసీదును ప్రారంభించాడు. ఈ బృహత్తర మసీదు నిర్మాణం 77 సంవత్సరాలు కొనసాగింది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల మక్కా మసీదు నిర్మాణ వైశిష్ట్యం చూసిన వారు నేటికీ అబ్బురపడతారు. మహ్మద్ పవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్ళు, మట్టి తీకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడారని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అందుకనే ఈ మసీదుకు ‘మక్కా మసీదు’ అనే పేరు వచ్చిందని చెబుతారు. మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టి వాడలే. రాళ్ళూ-రాతి పొడిని మాత్రమే ఉపయోగించారు.
మహబ్నగర్ జిల్లా షాద్‌నగర్‌కు దగ్గర్లోలోని ఒక పెద్ద రాతికొండ తొలచి, అక్కడ్నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద బండరాళ్ళతో మసీదు నిర్మాణం చేపట్టారు. ఈ కొండ నుంచి 170 అడుల పొడవు గల ఏకశిలలు 1400 జతల ఎడ్ల బండ్లపై ఎంతో శమకోర్చి ఇక్కడకు రవాణా చేశారని, ఆనాడు తన కళ్లారా చూసిన విదేశీ పర్యాటకుడు టావెర్నియర్ రాతల వల్ల తెలుస్తోంది. చార్మినార్ ఎత్తు 180 అడుగులు. కాగా, మక్కా మసీదు ఎత్తు 170 అడుగులు ఉండేలా నిర్మించారు. మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తు గల విశాలమైన ప్రార్థనా హాలు ఉంది. సుమారు 3 వేలమంది ఒకేసారి కూర్చుని పార్థ్ధన జరుపుకొనే వీలుంది. ప్రార్థనా హాలుకు వెలుపల మరో పది వేలమంది ఏక కాలంలో కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రధాన పార్థనా మందిరం 20 పిల్లర్ల సపోర్టుతో ఉంది. మసీదు నిర్మాణంలో 12 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు వరకు పునాదులు తీసారని స్థానిక అధికారి చెప్పారు. ప్రధాన మసీదు ప్రాంగణానికి దక్షిణాన అసఫ్‌జాహీ రాజు, వారి కుటుంబ సభ్యుల సమాధులు మొత్తం 14 ఉన్నాయి.
మసీదు శంకుస్థాపన
1617లో మక్కా మసీ శంస్థాపన కార్యకమాన్ని సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. ముస్లిం పెద్దలు, ఉలేమా, ఇతరులు అనేక మందిని అనేక దేశాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యకమానికి ఆహ్వానించారు. శంకుస్థాపన కార్యకమానికి హాజరైన పెద్దలందరినీ ఉద్దేశించి ‘రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తున్న వారెవరైనా ఉంటే వారే ముందుగా శంకుస్థాపన కార్యకమంలో పాల్గొనాలని కుతుబ్ షా ఆహ్వానించాడు. వేలాదిమంది ఆనాడు హాజరయినా, వాళ్ళలో ఒక్కరైనా దీనికి ముందుకు రాలే. దాంతో కులీకుతుబ్ షా లేచి తాను పన్నెండేళ్ల వయస్సు నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేస్తున్నానని, కాబట్టి మసీదు శంస్థాపనకు తానే అన్నివిధాలా అర్హుడనని గర్వంగా ప్రకటించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాడు.
సుల్తాన్ తన ఆస్థానంలో పనిచేస్తున్న డారోగా మీర్ ఫయజుల్లా బేగ్, చౌదరి రంగయ్యలకు మసీదు నిర్మాణ పనుల పర్యవేక్షణ భాద్యత అప్పగించాడు. ఇందుకోసం తొలివిడతగా ఎనిమిది లక్షలు ఖజానా నుంచి మంజూరు చేశాడు. సుమారు 8000 మంది కార్మికులు రాత్రింపగళ్ళు ఈ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. అయితే, సుల్తాన్ మహ్మద్ కుత్బ్షా 1626లో అస్వస్థతకు గురై మరణించాడు. అప్పటికి ఆయన వయ్స కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. మసీదు నిర్మాణానికి తొమ్మిదేళ్లు ఆటంకం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత సింహాసనం అధిష్టించిన కుతుబ్‌షాహీ రాజు మసీదు నిర్మాణ పనులను ఆపకుండా కొనసాగించాడు. ఆ దరిమలా ఏడున్నర దశాబ్దాలు నిరంతరాయంగా కొనసాగిన ఈ చరిత్రాత్మక మసీదులో ప్రతిరోజూ మహ్మదీయ సోదరులు ఐదుసార్లు నమాజు పార్థన జపుకునే ఏర్పాటు చేశారు. మసీదు ప్రాంగణంలో ఒక పక్కగా నల్లని రాతితో చేసిన డబుల్‌కాట్ సైజులోని రాతి మంచం ఒకటి ఉంది. దీన్ని ఆనాటి ఇరాన్ దేశపు రాజు ఔరంగజేబుకు బహుమతిగా ఇచ్చాడని స్థానికులు చెబుతారు.
రాతి మంచంపై కూర్చుని కొద్దిసేపు సేద తీరితే మక్కా మసీదును తిరిగి సందర్శించే అవకాశం కలుగుతుందని, అలాగే మన్సలో కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు. మసీదు లోపల అతి పురాతన గడియారం వుంది. నమాజు చేయాల్సిన సమయాన్ని సూచించే ఐదు రకాల ప్రత్యేక గడియారాలు వున్నాయి. ఇవి కాకుండా మసీ ప్రాంగణంలో గడియారాల కనుగొనక పూర్వం ఔరంగజేబు కాలంనాటి టైం కొలిచే ‘‘కాలమానచక్రాన్ని’’ మక్కామసీదు సందర్శకులు తప్పక చూడాలి. రంజాన్ పండుగ సమయంలో ఈద్ కంటె ముదుంగా వచ్చే శుక్రవారం మసీదు పాంగణమంతా మహ్మదీయ సోదరులతో నిండిపోంది. మసీదు ప్రాంగణంలో వందల కొలది పావురాలున్నాయి. ఎలాంటి భయం బెరుకూ లేకుండా కన్పించే ఆ పావురాల గుంపు సందర్శకులకు ఒక పత్యేక ఆకర్షణ. ఈ అద్భు రాతి కట్టడం వైభవాన్ని ఆనాటి శిల్పకళాకాడు తన ఉలి కదలికలతో చేసిన అద్భుత కళావిన్యాసాన్ని ప్రతి ఒక్కరు తప్పక చూసి తీరాలి.