Sundarayya vijnanakendram
-
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్’ అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కె.రవిచారి, జి.భరత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను అడ్డుకున్నవారే పక్కనున్నారు
కేసీఆర్‌పై సీపీఎం కార్యదర్శి తమ్మినేని ధ్వజం... సాక్షి, హైదరాబాద్: గతంలో తెలంగాణను అడ్డుకున్నవారే ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు కుడి, ఎడమలుగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఆనాడు గట్టిగా వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను కే సీఆర్ కే బినెట్లోకి తీసుకుని అందలం ఎక్కించారన్నారు. సోమవారం నుంచి తమ పార్టీ మొదలుపెట్టనున్న మహాజన పాదయాత్రకు ఆదిలోనే ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడాన్ని ఆయన ఖండించారు. సీపీఎం తెలంగాణను కక్షపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఆ పార్టీ నేతల పాదయాత్రను అడ్డుకోవాలంటూ స్వయంగా కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లలో తమ పార్టీ పోటీ చేసిందని, మిగిలిన సీట్లలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్కే తాము మద్దతునిచ్చామన్నారు. సీపీఎం నిజాయితీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ అని తర్వాత కేసీఆర్ కితాబు కూడా ఇచ్చారని తమ్మినేని గుర్తు చేశారు. పార్టీ నాయకుడు జి.రాములు, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, పీఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి, గాలి వినోద్‌కుమార్ తదిత రులు సమావేశంలో పాల్గొన్నారు. -
బీజేపీ పాలనలో 156 మత ఘర్షణలు
కేంద్రంలో భారతీయ జనతా పార్ట్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 156 మత ఘర్షణలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటి వరకూ ఒక్క మతఘర్షణ నమోదు కాని.. దాద్రిలో ఘోర ఘటన చోటుచేసుకుందని ఆయన అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు వ్యతిరేకంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 'భారత రాజకీయాలు, బీఫ్ తినడం పట్ల అభ్యంతరాలు' పేరిట రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అన్నారు. ప్రజలు ఏం తినాలో.. ఎలాంటి బట్టలు కట్టుకోవాలో.. ఏ పుస్తకం చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశం అనే సంగతి పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు.