sunny effect
-
మండే ఎండలకు బండి పైలం.. నిర్లక్ష్యం అస్సలు వద్దు! ఈ జాగ్రత్తలు మీకోసమే..
విశాఖపట్నం: భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తామో.. వాహనాలను కూడా అలానే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసిపోతాయని, పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్ నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కో సారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి👉🏾బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన పెద్ద వాహనాలకు ఇలా.. ► కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ► రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. ► వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ► పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. ► ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► ఎండాకాలం పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ ద్విచక్ర వాహనాలకు రక్షణ ఇలా.. ► వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే.. చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి ఉంచాలి. ► అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. తరచూ గాలి తనిఖీ చేయించుకోవడం మంచిది. ► బైక్‌లు ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ► పెట్రోల్ ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంత మేర పెట్రోల్ ఆవిరి కాకుండా చూడవచ్చు. ► ఎండల వేడికి ఇంజిన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మంచిది. ► వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూయాలి. ► గాలి పట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. తద్వారా పెట్రోల్ ఎక్కువ ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ► వేసవి కాలంలో ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ► దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి, ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువులోపు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేయించకూడదు ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బైక్‌లకు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. రెండు లీటర్లు పెట్రోల్ వరకు వేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ బైక్ ఎండలో పెట్టాల్సిన అవసరం ఏర్పడితే ఏదైనా పొడవాటి క్లాత్‌ను ట్యాంక్‌పై కప్పి ఉంచితే సరిపోతుంది. లేదంటే ఎండలకు ఆయిల్ ట్యాంకర్ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. –అక్బర్, బైక్ మెకానిక్ ఎక్కువ దూరం ప్రయాణించొద్దు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బైక్ ఆయిల్ ట్యాంకులు పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ వేయించేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడడం, బైక్‌ను ఎండలో ఉంచడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్‌ను మధ్యాహ్నం సమయంలో నీడలో పార్కు చేయాలి. ఎండలో ఎక్కువ దూరం కూడా ప్రయాణించకపోవడం మంచిది. – త్రినాథరావు, మెకానిక్ -
మండేకాలం.. జాగ్రత్త సుమా..!
ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఉష్ణతాపం మొదలైంది. రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత తీవ్రతరం కానుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మున్ముందు వడగాల్పులకు ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రాణనష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఒక వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వారికి అవసరమైన అత్యవసర ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఒంగోలు అర్బన్: వేసవికాలం ఎండ తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాల్పులకు, వడదెబ్బలకు ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు శాఖలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ శాఖల ద్వారా భారీ ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే చలివేంద్రాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యూనియన్లు, ప్రజా సంఘాలు కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసేలా యంత్రాంగం కృషి చేస్తోంది. వడగాల్పులు, వడదెబ్బ, డీ హైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లలో అవసరమైన ఔషధాలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు విరివిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకోంటోంది. అంతేకాకుండా వడగాల్పులకు తిరిగి వడదెబ్బకు గురయ్యేకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించేలా ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదుకు ప్రణాళిక సిద్ధమైంది. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రజలు కూడా ఎండ, వేడి తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయంలో పనులను సడలింపు చేసుకోవాలని అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో బయట తిరగాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రజలకు సూచించారు. తాగునీటి సమస్యపై దృష్టి జిల్లాలో కొన్ని గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నీటి వనరులను గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో నీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో అవకాశం మేరకు బోర్లు వేయడం, పైప్‌లైన్ అవకాశం లేని గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేలా రంగం సిద్ధమైంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాల యాజమాన్యలకు విద్యార్థులకు వడదెబ్బ సోకుండా పాటించాల్సి విధివిధానాలను విద్యాశాఖ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల, కళాశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. వేసవి తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ డిపోలు, నగరంతో పాటు జిల్లాలో రహదారుల వద్ద ఉన్న బస్టాండ్లలతో ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో గృహాలు, పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది నీటిని నింపుకున్న వాహనాలతో నిరంతరం సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండేలా సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. వడగాల్పులకు ఇబ్బందులు లేకుండా అన్నీ తీసుకున్నాం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడగాల్పులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అందుబాటులో ఉంచడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వంటి వాటితో మరిన్ని చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా వడగాల్పుల పట్ల అవగాహనతో వడదెబ్బల పాలవకుండా, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా ప్రజలకు వడగాల్పులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకున్నాం. ప్రజలు సహకరించి వేసవిలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్త వహించాలి. – ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్ -
గర్తుతెలియని వృద్ధుడి మృతి
పాణ్యం: గోనవరం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ చిరంజీవి ఆదివారం రాత్రి తెలిపారు. గ్రామ పొలిమేరలో తెల్లటి దుస్తులు ధరించి, 60–65 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఎండల తీవ్రతతో మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశామన్నారు. -
నిరాశపరచిన ‘మామిడి’
♦ ఈ సారి కాపు 40 శాతం లోపే..! ♦ రాలిపోతున్న పూత, కాత ♦ కాసిన కొద్దిపాటి కాయలపై ఎండ ప్రభావం ♦ ఆందోళనలో రైతన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం మామిడి పంటపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవక తోటల్లో కాపు బాగా తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో నాటిన మామిడి మొక్కలు నీరులేక ఎండిపోతున్నాయి. కాసిన కొద్దిపాటి కాయలు సైతం ఎండల ప్రభావానికి వాడి నేల రాలుతున్నాయి. ఈ సారి కూడా మామిడి పంట నిరాశాజనకమేనని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనీసం 40 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల అయితే 20 శాతం పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. - పరిగి నియోజకవర్గంలో 3,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క పూడూరు మండలంలోనే అత్యధికంగా 2,200 పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు. జిల్లాలోనే పెద్ద మామిడి పళ్ల మార్కెట్‌గా పూడూరు మండలం మన్నేగూడకు పేరుంది. ప్రతి ఏడాది.. హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రదేశాలకు టన్నుల కొలది మామిడి పళ్లను, కాయలను ఇ క్కడి నుంచే ఎగుమతి చేస్తారు. కేవలం మన్నేగూడ ప్రాంతంలోనే ప్రతి ఏడాది రూ.2 కోట్ల నుంచి రూ. మూ డు కోట్ల వ్యాపారం జరుగుతుంది. అ యితే ఇప్పుడిప్పుడే మామిడి తోటల సాగుపై దృష్టి సారించిన రైతులు పలువురు.. ప్రస్తుత పరిస్థితిని చూసి మునుముందు వెనక్కి తగ్గుతారేమోనని హార్టికల్చర్ అధికారులు ఆందోళనలో ఉన్నా రు. కాగా.. వచ్చిన కొద్దిపాటి కాపైనా చే తికి వచ్చే వరకు చెట్టుపై నిలుస్తుందో లేదోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు. గణనీయంగా తగ్గనున్న మామిడి.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ఈ పరిస్థితుల్లో రైతులతో పాటు మామిడికాయలు, మామిడి పళ్ల వ్యాపారం పైనే ఆధారపడి బతికే వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఎ కరంలో సాగైన మామిడి తోటకు వ్యాపారులు రూ. 50 నుంచి రూ. 80 వేల వరకు గుత్తగా చెల్లించేవారు. ఈ ఏడాది ఎకరానికి రూ. 20 వెచ్చించినా గిట్టుబాటు కష్టమని వ్యాపారులు అంటున్నారు. రూ. లక్షలు వ్యాపారంలో కుమ్మరించి తరువాత చేతులు కాల్చుకునే క న్నా.. ఈ ఏడాది వ్యాపారానికి దూరం గా ఉంటే బాగుంటుందని పలువురు మిన్నకుండిపోయారు. ధరలు ఆకాశన్నంటనున్నాయి.. ఈసారి మామిడి కాపు గణనీయంగా పడిపోవడంతో మామిడికాయలతో పాటు మామిడి పళ్ల ధరలు ఆకాశన్నం టనున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. మామిడి పళ్ల ప్రియులకు కొనే స్తోమత తగ్గి.. తియ్యని పళ్లు చేదెక్కనున్నాయి. గతేడాది మామిడి పళ్లు పుష్కలంగా ఉండడంతో కిలో రూ. 25 నుంచి రూ. 80 చొప్పున విక్రయించగా ఈఏడాది కాస్త కిలో ధర రూ. 100 లోపు దొరకడం కష్టమేనని అంటున్నారు. ఈ ఏడాది పేదలు మామిడి పళ్లు తినడం కష్టమేనని ఉద్యానవన శాఖ అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. -
వడదెబ్బకు రాలిన ప్రాణాలు
మృతుల్లో ఇద్దరు రైతులు, ఒక ఉపాధి కూలీ, ఉపాధ్యాయుడు, వృద్ధుడు బాధిత కుటుంబాల్లో విషాదం వర్గల్/పాపన్నపేట/చిన్నకోడూరు/ తూప్రాన్ /ములుగు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన రైతు గడ్డం నర్సయ్య (68) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వరిని సాగు చేశాడు. బుధవారం మిషన్‌తో వరి కోయించాడు. అదేరోజు కొడుకు స్వామితో కలిసి పొలంలో వరిగడ్డిని కట్టలుగా కట్టి ఇంటికి తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి ఇంటికి చేరిన నర్సయ్య వడదెబ్బ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడు.గురువారం ఉదయం వరకు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యు లు అతడిని 108లో గజ్వేల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య యాదమ్మ, కుమారుడు స్వామిలు ఉన్నారు. పాపన్నపేట మండలం బాక్యా తండాకు చెందిన దేవసోత్ కిషన్ (56) వారం రోజులుగా గ్రామశివారులోని మాచిరెడ్డికుంటలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా పనులు హాజరయ్యాడు. అయితే మధ్యాహ్నం ఒ క్కసారిగా.. కిషన్ వడదె బ్బతో కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఇం టికి తీసుకువచ్చే సారికి అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య పెంటి, కు మార్తె చాంగును, కుమారులు మోహన్, వసంత్, శ్రీనివాస్‌లు ఉన్నా రు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన కొమ్మెర మల్లారెడ్డి (65) వ్యసాయ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉద యం పనులకు వెళ్లి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కు టుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమం లో మల్లారెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతవ్వ, కుమారుడు రవీం దర్‌రెడ్డిలు ఉన్నారు. మృతుడి కుటుం బాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పరకాల వజ్రమ్మ, ఎంపీటీసీ భూంరెడ్డిలు కోరారు. తూప్రాన్ పట్టణానికి చెందిన గడ్డం శ్రీనివాస్ (33) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం బంధువుల శుభ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఎండలో బాగా తిరిగి అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం ఉదయం బంధువులు ఇంటికెళ్లగా అక్కడ శ్రీనివాస్ విగతజీవుడై పడి ఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య అనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ములుగుకు చెందిన తీగుళ్ల కిష్టయ్య (60) ప్రతి రోజూ పశువులను మేతకు తిప్పుకువస్తుంటాడు. గురువారం కూ డా పశువులను మేతకు వెళ్లిన కిష్టయ్య ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య చం ద్రమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వడదెబ్బతో వివాహితకు అస్వస్థత రామాయంపేట మండలం కోనాపూర్ చిన్నతండాకు చెందిన సునీత గురువారం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. వివరాలిలా ఉన్నాయి.. వారం రోజులుగా సునీత వ్యవసాయ పనుల కు వెళుతోంది. ఇటీవల కాలంలో ఎండల ప్రభావం పెరగడంతో గురువారం వడదెబ్బకు గురైంది. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.