Support for political parties
-
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది. జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ, అలాగే ఆయన ఎన్నిక కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు గాను ఇప్పటికే లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. దిగువ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉండటం, అంతేగాక యూపీఏ పక్షాలు సైతం బిర్లాకే మద్దతు ప్రకటించడంతో స్పీకర్‌గా ఆయన ఎన్నిక ఇక లాంఛనం మాత్రమే. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. కాగా కాంగ్రెస్‌తో పాటు మిగతా యూపీఏ పక్షాలు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మంగళవారం చెప్పారు. సాయంత్రం జరిగిన యూపీఏ పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ అంశంపై మాత్రం ఆయన మౌనం వహించారు. కాంగ్రెస్, విపక్షాలు దీనిపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. మోదీ చాయిస్! స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పదవి విషయంలో సీనియర్ నేతలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మొదటిసారిగా లేదా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైనా మురళీ మనోహర్ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ బిర్లాను బీజేపీ స్పీకర్ పదవికి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యకరమేనని చెప్పాలి. వరసగా రెండోసారి అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు మరోసారి తమ మార్క్ ప్రదర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పార్టీలో కానీ, చట్టసభల్లో కానీ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలు 17వ లోక్‌సభకు స్పీకర్‌గా బిర్లాను ఎంపిక చేయడం ద్వారా బలంగా పంపారని అంటున్నారు. అలాగే పైకి కన్పించకపోయినా క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసేవారికి పార్టీ ప్రాధాన్యమిస్తుందనడానికి కూడా ఇది సంకేతమని చెబుతున్నారు. రెండుసార్లు ఎంపీ రాజస్తాన్‌లోని కోట–బూందీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల బిర్లా మొత్తం మీద రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్పీకర్‌గా ఎన్నికైతే ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన సుమిత్రా మహాజన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బిర్లా బీజీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందినవారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనియన్ నాయకుడిగా ఉండగానే ఆయనలో తెలివితేటలు, సృజనాత్మకత బీజేపీ పెద్దలకి అర్థమయ్యాయి. 2003లో మొట్టమొదటిసారిగా కోట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చురుకైన నేతగా, అప్పగించిన పని కంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియమ నిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. స్పీకర్ పదవికి బిర్లా అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నినాదాలు .. వాగ్వాదాలు రెండోరోజు సోనియా, ములాయం ప్రమాణం లోక్‌సభ సమావేశాల రెండోరోజు మంగళవారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ తదితరులు సభ్యులుగా ప్రమాణంచేశారు. సభ్యుల ప్రమాణం సందర్భంగా అధికార, విపక్షాల సభ్యులు పెద్దయెత్తున నినాదాలతో పోటీపడ్డారు. సోనియా హిందీలో ప్రమాణం చేస్తుండగా విపక్ష బెంచీల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తూ కన్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే.. మరోవైపు బీజేపీ సభ్యులు సోనియా హిందీలో ప్రమాణం చేసినందుకు అభినందించడం విన్పించింది. ఆ తర్వాత వెంటనే బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ప్రమాణం చేయగా సోనియా, మేనక ఇద్దరూ ముకుళిత హస్తాలతో ఒకరినొకరు పలుకరించుకున్నారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ తోడురాగా అస్వస్థత కారణంగా వీల్ చైర్లో సభలోకి వచ్చిన 79 ఏళ్ల ములాయంను ఆయన సీట్లోనుంచే ప్రమాణం చేసేందుకు అనుమతించారు. కాగా ఓం బిర్లా సభలో ప్రవేశించినప్పుడు, ఆయన ప్రమాణం చేసేందుకు లేచినప్పుడు చప్పట్లు మార్మోగాయి. కొత్తగా ఎన్నికైనా సభ్యులు కొందరు చేసిన నినాదాలు సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీశాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు నినదించడంతో.. నినాదాలేవీ రికార్డుల్లోకి వెళ్లవని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. విపక్షాల సభ్యులు ముఖ్యంగా టీఎంసీ ఎంపీలు ప్రమాణ స్వీకారానికి లేచినప్పుడు బీజేపీ సభ్యులు ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’అంటూ నినదించారు. ఇందుకు ప్రతిగా టీఎంసీ నేతలు ‘జై మా దుర్గ’, ‘జై బెంగాల్’, ‘జై మమత’, ‘జై హింద్’అంటూ నినాదాలు చేశారు. ఒకదశలో రాహుల్ ‘మరొక్కసారి’, ‘మరొక్కసారి’అని బీజేపీ సభ్యులనుద్దేశించి అన్నారు. కాగా నటుడు, మొదటిసారి ఎంపీ సన్నీ డియోల్ ప్రమాణంలోని ‘అప్హోల్డ్’పదాన్ని ‘విత్‌హోల్డ్’గా చదివి ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. ఒవైసీ ‘జై భీమ్ .. అల్లాహు అక్బర్’ అధికార పక్ష సభ్యులు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’అంటూ నినదించడంతో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్ అల్లాహు అక్బర్, జై హింద్’అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’అంటూ నినదించి అధికార పక్ష సభ్యులతో వాదులాటకు దిగారు. ఎంపీగా ప్రమాణం చేస్తున్న సోనియాగాంధీ -
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పలు ప్రజా సంఘాలు, సీపీఐ రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చాయి. దీనికి అధికారపక్షం మినహా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛం దంగా సెలవు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార సంస్థల్ని మూసి వేస్తామని ఆయా వర్గాల సంఘాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆచితూచి వ్యవహరిస్తోంది. మొదటి రెండు గంటల్లో బంద్ ప్రభావాన్ని అంచనా వేసి బస్సుల్ని తిప్పాలా వద్దా? అనేది నిర్ణయిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బంద్‌కు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ, పది వామపక్ష పార్టీలు, ఆంధ్రా మేథావుల ఫోరం, దళిత, బహుజన, విద్యార్థి, యువజన సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. బంద్‌ను జయప్రదం చేసి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటికి నివాళులర్పించాలని కాంగ్రెస్ కోరగా, ప్రత్యేక హోదా సాధనలో ఇది తొలిమెట్టు మాత్రమేనని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. జగన్ మద్దతు తెలిపారు : రామకృష్ణ ప్రత్యేక హోదా సాధనకై దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ధర్నాలో ఉన్నప్పుడే జగన్ తనకు ఫోన్ చేసి ప్రజల ఆకాంక్ష మేరకు జరిగే ఏ ఉద్యమానికై నా తమ మద్దతు ఉంటుందని చెప్పారన్నారు. రేషన్ డీలర్ల సంఘం మద్దతు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా నేడు రేషన్ షాపులు మూసివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుగతా వెంకటేశ్వరరావు, దివి లీలామాధవరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రత్యేక హోదాకై నేడు రాష్ట్ర బంద్