suprabhat rao
-
వైఎస్ పాలనను జనం మరువరు
మెదక్ రూరల్: గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను ప్రజలు మరువలేక పోతున్నారని టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి సుప్రభాత్రావు పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని వాడి గ్రామంలో పలువురు చిన్నారుల సమక్షంలో సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరిపారు. అంతుకు ముందు వారు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రభాత్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు సురేందర్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరిమల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ హయాంలో రైతురుణమాఫీ చేపట్టి, కేవలం 10 రోజుల్లో తిరిగి రైతులకు రుణాలు అందేలా కృషి చేశారన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా తమ పార్టీ అధినేత సోనియాగాంధీ మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, వాడి సర్పంచ్ తౌర్య, మైనార్టీ జిల్లానాయకుడు హఫీజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఆదరణ
మెదక్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలవల్ల కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ముత్తాయికోటలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. నాడు ఆయన ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టడం వల్లే నేటికీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో ఊరూరా సభ్యత్వాలు రెట్టింపవుతున్నాయన్నారు. నవంబర్ మాసంలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనవరి 15 లోగా పూర్తిచేసి డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సిరిమల్లె శ్రీనివాస్, శంకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు మోహన్‌గౌడ్, నాయకులు హఫీజ్, తౌర్య, అశోక్‌రెడ్డి, యాదగౌడ్, అక్బర్, మొండి పద్మారావు, మర్కం సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.