వైఎస్ పాలనను జనం మరువరు | people do not forget the ysr ruling | Sakshi
Sakshi News home page

వైఎస్ పాలనను జనం మరువరు

Published Tue, Dec 9 2014 11:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వైఎస్ పాలనను జనం మరువరు - Sakshi

వైఎస్ పాలనను జనం మరువరు

మెదక్ రూరల్: గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను ప్రజలు మరువలేక పోతున్నారని టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి సుప్రభాత్‌రావు పేర్కొన్నారు.  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ  జన్మదినం సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని వాడి గ్రామంలో  పలువురు చిన్నారుల సమక్షంలో  సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరిపారు. అంతుకు ముందు వారు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్‌చేశారు.  

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రభాత్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్,  కాంగ్రెస్ జిల్లా నాయకుడు సురేందర్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరిమల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ   వైఎస్ హయాంలో  రైతురుణమాఫీ చేపట్టి, కేవలం 10 రోజుల్లో తిరిగి రైతులకు రుణాలు అందేలా కృషి చేశారన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా తమ పార్టీ అధినేత సోనియాగాంధీ మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, వాడి సర్పంచ్ తౌర్య, మైనార్టీ జిల్లానాయకుడు హఫీజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement