వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఆదరణ
మెదక్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలవల్ల కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ముత్తాయికోటలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు.
నాడు ఆయన ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టడం వల్లే నేటికీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో ఊరూరా సభ్యత్వాలు రెట్టింపవుతున్నాయన్నారు. నవంబర్ మాసంలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనవరి 15 లోగా పూర్తిచేసి డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సిరిమల్లె శ్రీనివాస్, శంకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు మోహన్‌గౌడ్, నాయకులు హఫీజ్, తౌర్య, అశోక్‌రెడ్డి, యాదగౌడ్, అక్బర్, మొండి పద్మారావు, మర్కం సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.