Surendranath
-
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏపీ ముందంజ
సాక్షి, విశాఖపట్నం: మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యుల ఐఐపీఏ బృందం రెండో రోజు విశాఖలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, సంబంధిత శాఖల అధికారులతో సురేంద్రనాథ్ త్రిపాఠి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరి కంటే ఎక్కువగా ఏపీ సద్వినియోగం చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, గ్రామ, వార్డు వలంటీర్లు ద్వారా గ్రామస్థాయిలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల సేవలు సరికొత్త సేవా విప్లవానికి నాంది పలికినట్లుగా ఉన్నాయన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. డీబీటీ ద్వారా ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం వల్ల.. ఏపీ ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని తమ క్షేత్ర స్థాయి పర్యటనలో వెల్లడైందని డీజీ త్రిపాఠి వివరించారు. స్వచ్ఛత విషయంలో విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.వీఎన్ అలోక్, ఐఐపీఏ అడిషనల్ డైరెక్టర్ కుసుమ్లతతో పాటు త్రివిధ దళ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: సకల వసతులు: రూ.3,364 కోట్లతో సంక్షేమ హాస్టళ్ల ఆధునీకరణ -
మహోజ్వల భారతి: సరెండర్ నాట్ బెనర్జీ
సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ ఇండియా భారత రాజకీయాలలో ముఖ్య నాయకులు. ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ స్థాపకులు. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బెనర్జీ బెంగాల్ ప్రావిన్స్‌లోని కలకత్తాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండి దుర్గా చరణ్ బెనర్జీ వైద్యులు, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు గలవారు. బెనర్జీపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత బెనర్జీ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను రాయడానికి ఇంగ్లండ్ వెళ్లారు. పరీక్షల్లో విజయం సాధించి సిల్హెట్లో (నేటి బంగ్లాదేశ్) అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌గా నియామకం పొందారు. 1905లో బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన ముఖ్య ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉన్నారు. మితవాద రాజకీయ నాయకుల ప్రజాదరణ క్షీణించడం భారత రాజకీయాల్లో బెనర్జీ పాత్రను ప్రభావితం చేసింది. 1909 లో మింటో–మార్లే సంస్కరణలకు బెనర్జీ మద్దతు ఇచ్చారు. భారతీయ ప్రజా, జాతీయవాద రాజకీయ నాయకులలో చాలామందికి అది ఆగ్రహం కలిగించింది. అంతేకాదు, మహాత్మాగాంధీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని బెనర్జీ విమర్శించడం, తర్వాత్తర్వాత బెంగాల్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని అంగీకరించడం అనేకమంది జాతీయవాదులకు కోపం తెప్పించింది. అయినప్పటికీ భారత రాజకీయాల మార్గదర్శక నాయకుడిగా మొదట భారత రాజకీయ సాధికారత కోసం మార్గం నడపడం వల్ల బెనర్జీ చరిత్రలో గొప్ప నేతగా నిలిచిపోయారు. ‘సర్’ అనే బ్రిటిష్ హోదాకు అర్హులయ్యారు. బెనర్జీ చివరి రోజులలో బ్రిటిష్‌వారు ఆయన్ని ఆయన దృఢత్వానికి చిహ్నంగా ‘సరెండర్ నాట్’ బెనర్జీగా గౌరవించారు. బెనర్జీ తన 76 ఏళ్ల వయసులో 1925 ఆగస్టు 6న కన్నుమూశారు. -
మంత్రి పేరు లేకుండా ఫిర్యాదు ఇమ్మంటున్నారు
ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేరు వద్దని పోలీసుల ఒత్తిడి దుండగుల దాడిలో గాయపడిన ‘సాక్షి’ విలేకరి సురేంద్ర ఆవేదన చికిత్స పొందుతున్న బాధితుడు గుంటూరు (పట్నంబజారు): మంత్రి ప్రత్తిపాటి దంపతుల పేర్లు లేకుండా ఫిర్యాదు ఇమ్మని పోలీ సులు ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు జిల్లా చిలకలూరి పేట ‘సాక్షి’ విలేకరి సురేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన సురేంద్ర శుక్రవారం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కర్రలతో తీవ్రంగా గాయపరచడంతో తీవ్ర మైన నొప్పులతో ఆయన బాధపడుతున్నారు. బంధువుల సహాయంతో గుంటూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర మీడియాతో మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రి గోల్డ్ భూ ములు, రాజధానిలో కొనుగోలు చే సిన భూముల గురించి వార్తలు రాయడంతోనే తనపై ఆయన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. గతంలోనూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వార్తలు రాసిన నేపథ్యంలో మంత్రి భార్య ఆదేశాల మేరకే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వాపోయారు. తనపై దాడి జరిగిన అనంతరం యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే సంబంధిత స్టేషన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు.. ఫిర్యాదులో మంత్రి ప్రత్తిపాటి, ఆయన భార్య పేర్లు లేకుండా తిరిగి ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై రౌడీషీటు కూడా తెరిపించారని, మంత్రి ప్రత్తిపాటి ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారని వాపోయారు. సురేంద్రనాథ్‌పై దాడిని ఎంపీటీసీ సభ్యుడు వి.శ్రీనుబాబు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చింతారావు ఖండించారు. -
మార్కెట్లోకి కెప్టెన్ సిరీస్ టిప్పర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేల్యాండ్ తాజాగా కెప్టెన్ సిరీస్ టిప్పర్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కెప్టెన్ 2523, 2518 మోడల్ టిప్పర్లను కంపెనీ ఎండీవీ ట్రక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎం సురేంద్రనాథ్ గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వీటిలో కొత్త తరహా క్యాబిన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ రెండింటిలోనూ 9-హై స్పీడ్ గేర్ బాక్సులు ఉంటాయని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయని సురేంద్రనాథ్ పేర్కొన్నారు. కెప్టెన్ సిరీస్ టిప్పర్లపై మూడు సంవత్సరాలు లేదా 5,000 గంటల వారంటీ ఇస్తున్నట్లు ఆయన వివరించారు.