survives
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూర్యుడి ‘కరోనా’ను తాకింది...
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి. మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్‌హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్‌ను పార్కర్‌పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది. -
ద.కొరియా అధ్యక్షుడికి ఉపశమనం
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటిస్తూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీగండం కొద్దిలో తప్పింది. ఎమర్జెన్సీ(మార్షల్ లా) విధిస్తూ నిర్ణయం తీసుకుని దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారని ఆరోపిస్తూ ఆయనపై విపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యులు అంటే కనీసం 200 మంది మద్దతు పలకాల్సి ఉంటుంది. శనివారం చేపట్టిన ఓటింగ్‌లో అభిశంసనను సమర్థిస్తూ కేవలం 192 ఓట్లు పడ్డాయి. యూన్‌కు చెందిన పీపుల్స్ పవర్ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్లో మరోమారు అభిశంసన తీర్మానాన్ని పెట్టాలని విపక్ష పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అంతకుముందు యూన్ మార్షల్ లా విధించడం తప్పేనంటూ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. -
విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?
కరాచీ: తీవ్ర విషాదాన్ని నింపిన పాకిస్తాన్ విమాన ప్రమాదంలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ అనేది పాకిస్తాక్‌కు చెందిన బ్యాంక్. ఇది లాహోర్‌లో ఉంది. అటు ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం) Deeply saddened by the loss of life due to a plane crash in Pakistan. Our condolences to the families of the deceased, and wishing speedy recovery to those injured. — Narendra Modi (@narendramodi) May 22, 2020 పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళాలు వెంటనే రంగంలోకి సహాయక చర్యల్ని చేపట్టాయి. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన విమాన ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సిబ్బందితోపాటు 99 మంది ప్రయాణికులు మొత్తం 106 మంది బతికి వుండే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్లో లాక్డౌన్ ఆంక్షలతో ఈద్ కారణంగా ప్రత్యేక పీఏఐ ఎయిర్‌బస్ ఎ 320 విమానం లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరింది. ల్యాండిగ్‌కు ఒక నిమిషం ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం కరాచీ విమానాశ్రయానికి అర కిలోమీటర్ దూరంలో జనసాంద్రత గల జిన్నా గార్డెన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. కాగా, 2016 డిసెంబరు 7 తరవాత పాకిస్తాన్లో చోటు చేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ (ఫైల్ ఫోటో) Shocked & saddened by the PIA crash. Am in touch with PIA CEO Arshad Malik, who has left for Karachi & with the rescue & relief teams on ground as this is the priority right now. Immediate inquiry will be instituted. Prayers & condolences go to families of the deceased. — Imran Khan (@ImranKhanPTI) May 22, 2020 -
తొలి సెట్ కోల్పోయినా..
లండన్: సంచలన ఫలితాలతో మొదలైన వింబుల్డన్ రెండో రోజు కూడా అలానే కొనసాగుతుందా అనే రీతిలో సాగింది. 9వ టైటిల్‌పై కన్నేసిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మ్యాచే దీనికి కారణం. తన కెరీర్లోనే మొదటిసారి వింబుల్డన్ ఆడుతోన్న దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల లాయిడ్ హారీస్ చేతిలో కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను ఫెడరర్ కోల్పోయాడు. దీంతో రెండో రోజు కూడా అతి పెద్ద సంచలనం నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అయితే రెండో సెట్ నుంచి తన అసలైన గ్రాస్ కోర్టు ఆటను హారీస్‌కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెడరర్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 6–3, 1–6, 2–6, 2–6తో హారిస్‌ను ఓడించాడు. నాదల్ విజయం రెండు సార్లు వింబుల్డన్ విజేత స్పెయిన్ బుల్ నాదల్ 6–3, 6–1, 6–3తో సుగిటా(జపాన్)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకోగా...సెరెనా విలియమ్స్ 6–2, 7–5తో గులియా గుట్టో(ఇటలీ)ను ఓడించి ముందంజ వేసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ తొలి రౌండ్‌తోనే తన కథను ముగించాడు. అమెరికా అన్‌సీడెడ్ ఆటగాడు కొరి చేతిలో 7–6, 6–7, 3–6, 0–6 చేతిలో ఓటమి చెందాడు. మహిళల మొదటి రౌండ్ మ్యాచ్‌లో షరపోవా(రష్యా) గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగింది. పౌలిన్ పరమెన్టైర్(ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో ఇరువురు చెరో సెట్‌ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్లో 0–5తో వెనుకబడిన సమయంలో షరపోవా మణికట్టు గాయంతో తప్పుకుంది. బార్టీ అలవోకగా.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ప్రస్తుత నంబర్ 1 క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్లో 6–4, 6–2తో జెంగ్(చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇతర మ్యాచ్‌లలో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్(జర్మనీ) 6–4, 6–3తో తన దేశానికే చెందిన మరియాపై, 2017 యూఎస్ ఓపెన్ విన్నర్ స్లోన్ స్టీఫెన్(అమెరికా) 6–2, 6–4తో టిమియా బాసిన్స్కీపై గెలుపొందారు. -
వేగంగా వెళ్లే రైలు కిందపడినా..
-
వేగంగా వెళ్లే రైలు కిందపడినా..
ముంబై : చావు నోట్లో తల పెట్టి బయటపడటం అంటే ఇదేనేమో. ప్రమాదవశాత్తూ వేగంగా వెళ్లే రైలు కిందపడినా చిన్నగాయంకూడా లేకుండా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలోని అసన్గాన్ రైల్వేస్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలగుండా రైల్వే ప్లాట్‌ఫామ్ దాటడానికి ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ రైల్వేస్టేషన్లో స్టాప్లేని ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌కు పట్టాలకు మధ్యలో ఉన్న చిన్న స్థలంలో పడుకున్నాడు. కనీసం బ్రేకులు కూడా వేయకుండా ట్రైన్ అదే స్పీడుతో వెళ్లిపోయింది. స్టేషన్లో ఉన్న వారందరూ ఇక అతని పని అయిపోయిందని భావించారు. కానీ, ట్రైన్ వెళ్లాక నిధానంగా ఆ వ్యక్తి లేచి ఎంచక్కా పట్టాలు దాటుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
బేబీ విదిశ.. ఓ అద్భుతం..
ముంబై: నిజంగా ఈ పాప మిరాకిల్ బేబీనే.. ఎందుకంటే.. పుట్టుకతోనే మేజర్ హార్ట్ ప్రోబ్లమ్.12గంటల నిరంతరాయమైన ఆపరేషన్.. ఆరుసార్లు గుండెపోటు. అయినా వైద్యశాస్త్రాన్నే అబ్బురపరుస్తూ అద్భుతంగా కోలుకుంది. పూర్తి ఆరోగ్యంతో మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కానుంది. వివరాల్లోకి వెళితే కల్యాణ్‌కు చెందిన విశాక, వినోద్ ల మొదటి సంతానం విదిశ. ఆ పాప 45 రోజుల వయసులో ఉన్నపుడు తల్లి పాలు తాగి వాంతి చేసుకుంది. అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బిడ్డను వెంటనే బిడ్డను స్థానిక నర్సింగ్ హోమ్‌కు తరలించారు. వారు ముంబైలోని బీజే వాడియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పాప అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ట్రాన్స్‌పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు. డా. బిశ్వా పాండా గుర్తించారు. ఇందుకు 12 గంటల సర్జరీ అవసరమని తేల్చారు. మార్చి 14న ఆపరేషన్ జరిగింది. కానీ ఇంతలోనే మరో కొత్త సమస్య మొదలైంది. గుండె పనితీరు మెరుగైనా.. బలహీనంగా ఉన్న ఆమె ఊపిరితిత్తులు ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి కేసుల్లో పుట్టగానే గుండెకు సర్జరీ నిర్వహించాలనీ, అలా చేయకపోవడం వల్ల ఇంతకుముందు వ్యవస్థకే ఊపిరితిత్తులు అలవాటు పడ్డాయని డా. పాండా గుర్తించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి హఠాత్తుగా పడిపోయేది. కార్బన్ డైఆక్సైడ్ మూడు రెట్లు పెరిగేది. ఫలితంగా విదిశకు ఆరుసార్లు గుండెపోటు వచ్చింది. హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ సాయంతో ఆమెకు చికిత్స అందించారు. 51 రోజుల పాటు ఆ చిన్నారి ఐసీయూలోనే ఉంది. మొత్తానికి రెండు నెలల తర్వాత ఆ పాప కోలుకుంది. దీంతో ఇపుడు మిరాకిల్ బేబీగా నిలిచింది. అంతేకాదు విదిశ తల్లిదండ్రులు పేదవాళ్లు. కేవలం రూ.25వేల ఫీజు మాత్రమే చెల్లించే స్థితిలో వారున్నారు. అయితే మొత్తం రూ.5 లక్షల బిల్లును ఆసుపత్రిలోని పలు దాతలు చెల్లించడం విశేషం. కాగా బి.జె.వాడియా హాస్పిటల్ సిఇఓ డాక్టర్ మిన్నీ బోదాన్వాలా మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి కార్డియాక్ సర్జరీ విభాగానికి మూడు సంవత్సరాలపాటు తాము కృషి చేస్తున్నామని, తమ లక్ష్యం ఇప్పటికి నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
నెలపాటు ఆమె మంచుకొండల్లోనే..
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లోని ఓ రిమోట్ పర్వత క్యాబిన్లో నెలపాటు ఒంటరిగా జీవించి విస్మయ పరిచింది ఓ మహిళ. తనతో పాటు పర్వత అధిరోహణకు వెళ్లిన భాగస్వామి మరణించినప్పటికీ ఆమె ఈ పర్వతంపైనే ఒంటరిగా జీవించడం విశేషంగా నిలిచింది. దక్షిణ ద్వీపంలోని ఫియర్డ్లాండ్ జాతీయ పార్క్ పర్వతాల్లో ఓ గుడిసెలో బుధవారం మహిళను గుర్తించినట్టు గార్డియన్ రిపోర్టు చేసింది. పోలీసుల రిపోర్టు ప్రకారం జూలై 24న ఈ జంట పర్వతాధిరోహణ ప్రారంభించారు. ఆమె భాగస్వామి జూలై 28న పర్వతం ఎక్కే క్రమంలో నిటారుగా ఉన్న వాలు నుంచి పట్టుజారి పడిపోయి మరణించాడు. అప్పటినుంచి తను ఒక్కతే లేక్ మెకెంజీ హట్లో నివసించినట్టు ఆ మహిళ పేర్కొంది. అత్యంత క్లిష్టమైన శీతాకాల పరిస్థితుల్లో కూడా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. పర్వతారోహణకు వెళ్లిన వారినుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో మహిళను గుర్తించామని వెల్లడించారు. గురువారం వాతావరణ పరిస్థితులు మెరుగైతే ఆమె భాగస్వామి మృతదేహ సెర్చింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.