వేగంగా వెళ్లే రైలు కిందపడినా..  | Man survives in Asangaon railway station | Sakshi
Sakshi News home page

వేగంగా వెళ్లే రైలు కిందపడినా.. 

Published Fri, Jun 28 2019 12:49 PM | Last Updated on Fri, Jun 28 2019 1:03 PM

Man survives in Asangaon railway station - Sakshi

ముంబై : చావు నోట్లో తల పెట్టి బయటపడటం అంటే ఇదేనేమో. ప్రమాదవశాత్తూ వేగంగా వెళ్లే రైలు కిందపడినా చిన్నగాయంకూడా లేకుండా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలోని అసన్‌గాన్‌ రైల్వేస్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలగుండా రైల్వే ప్లాట్‌ఫామ్‌ దాటడానికి ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ రైల్వేస్టేషన్‌లో స్టాప్‌లేని ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌కు పట్టాలకు మధ్యలో ఉన్న చిన్న స్థలంలో పడుకున్నాడు. కనీసం బ్రేకులు కూడా వేయకుండా ట్రైన్‌ అదే స్పీడుతో వెళ్లిపోయింది.

స్టేషన్‌లో ఉన్న వారందరూ ఇక అతని పని అయిపోయిందని భావించారు. కానీ, ట్రైన్‌ వెళ్లాక నిధానంగా ఆ వ్యక్తి లేచి ఎంచక్కా పట్టాలు దాటుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement