survy
-
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ బలాలేంటి.. బలహీనతలేంటి?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. కాంగ్రెస్, బీజేపీ బలాలు, బలహీనతలు ఏంటో విశ్లేషిస్తే.. కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేశ్ బఘేల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వం సేకరించడంతో రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. దీంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోమ్‌గార్డులకు జీతభత్యాలు పెంచడంతో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాలు ప్రధానంగా గ్రామాలలో, విద్యావంతులలో పార్టీ పట్ల సానుకూలతను కలిగిస్తున్నాయి. వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్.సింగ్‌డియో, పీసీసీ చీఫ్ మోహన్ మార్కం మధ్య విభేదాలున్నాయి. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మైనింగ్ ఆరోపణలపై సీసీఎస్ అధికారి సౌమ్య చౌరాసియాను కేంద్ర ఈడీ అరెస్టు చేయడం రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే ఈ అవకతవకలలో ముఖ్యమంత్రి భూపేశ్ ప్రమేయం కంటే కొందరి మంత్రులు, అధికారుల హస్తం ఉందని ప్రజలు భావించడం వ్యక్తిగతంగా సీఎంకు సానుకూలాంశం. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది. బీజేపీ బలాలు, బలహీనతలు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ భూపేశ్ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని రాష్ట్ర బీజేపీ ‘మోర్ ఆవాజ్ మోర్ అధికార్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి ప్రజలకు చేరువయినట్లు పీపుల్స్ పల్స్ తమ సర్వేలో గమనించింది. బస్తార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనలు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఆ పార్టీ అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది. చదవండి: సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు? గతంలో పదిహేను సంవత్సరాలు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదని అసంతృప్తి ప్రజల్లో ఉండడం ఆ పార్టీకి నష్టం చేకూరనుందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. బీజేపీ జాతీయ అంశాలకు, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ సఫలీకృతులయ్యారు. పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈయన కాకుండా పార్టీలో ఇతర ప్రముఖ నేతలైన సరోజ్‌పాండే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు, మరోనేత బ్రిజ్మోహన్ అగర్వాల్ బనియా సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో రాష్ట్రంలో అధికంగా ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత లేదనే భావనను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. గిరిజన తెగకు చెందిన సీనియర్ నేత నంద్‌కుమార్ సాయి 2023 ఏప్రిల్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు. బీజేపీ 15 ఏండ్ల పాలనలో సబ్సీడీ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలకు పెద్ద ప్రాముఖ్యతివ్వలేదని, బీజేపీకి మూడుసార్లు అవకాశమిచ్చినట్లుగా కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు పీపుల్స్‌పల్స్ సర్వేలో తెలిపారు. -
ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: మధ్యాదాయ వర్గాల్లో 60 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. నైట్‌ఫ్రాంక్ నిర్వహించి న ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది 9 శాతం వరకు ధరలు పెరుగుతాయని భావిస్తుంటే.. 25 శాతం మంది 10–19 శాతం మధ్య ధరలు పెరగొచ్చని చెప్పారు. రేట్ల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చని 6 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు దారులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని ‘గ్లోబల్ బయ్యర్ సర్వే’లో భాగంగా నైట్‌ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోనూ 550మందికిపైగా అభిప్రాయాలు తెలుసుకుంది. రెండు భాగాలుగా నిర్వహించిన సర్వేలో అధిక ఆదాయం కలిగిన వారి నుంచి, మధ్యస్థ ఆదాయం కలిగిన వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. నివేదికలో ప్రస్తావించిన అంశాలు ♦ 26 శాతం మంది భారతీయులు కరోనా వచ్చిన తర్వాత తమ నివాసాలను మార్చేశారు. మరింత విశాల స్థలం కోసం ఈ పనిచేశారు. ♦ వచ్చే 12 నెలల్లో తమ నివాసాలను మార్చాలనుకుంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు. ♦ ఇళ్లు మారిపోవాలనుకుంటన్న వారిలో 87 శాతం మంది ప్రస్తుత పట్టణాల మధ్యలో ఉండడం కంటే.. పట్టణ పొరుగు ప్రాంతాల్లో ఉండేందుకు సుముఖత చూపిస్తున్నారు. ♦ 13 శాతం మంది అయితే ఇతర పట్టణాలకు మారిపోయే ఆలోచనలో ఉన్నారు. ♦ అన్ని నియంత్రణలు ఎత్తివేస్తే తిరిగి కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైనే చెప్పారు. ♦ 47 శాతం మంది వారంలో 2–4 రోజులు కార్యాలయాల నుంచి పనిచేయవచ్చని చెప్పారు. ♦ భవిష్యత్తులో పని విధానం అన్నది వాణిజ్య భవనాలే కాకుండా నివాస భవనాలపైనా గణనీయమైన ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే నివేదిక తేల్చింది. చదవండి : కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు -
జగనన్న విద్యా దీవెన: విద్యారంగంలో పెరిగిన చేరికల నిష్పత్తి
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యారంగంలో చేరికల నిష్పత్తి గణనీయంగా పెరిగింది. గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో)లో జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు రెట్టింపు స్థాయికి మించి ఉండటం గమనార్హం. ఏపీకి దరిదాపుల్లో కూడా ఇతర రాష్ట్రాలేవీ లేవు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ఉన్నత విద్య (ఏఐఎస్హెచ్ఈ) 2019 – 20 సర్వే గణాంకాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఐదేళ్ల గణాంకాలు చూస్తే... ఏఐఎస్హెచ్ఈ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 18 – 23 ఏళ్ల వయసున్న ప్రతి వంద మందిలో 2015–16లో గరిష్ట చేరికల నిష్పత్తి 24.5 ఉండగా 2019–20 నాటికి 27.1కి చేరుకుంది. ఐదేళ్లలో చేరికలు 10.61 శాతానికి పెరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో గణాంకాలు పరిశీలిస్తే 30.8 నుంచి నిష్పత్తి 35.2కి పెరిగింది. అంటే ఉన్నత విద్యనభ్యసించే వారు ఐదేళ్లలో 14.5 శాతం మేర పెరిగారు. చివరి రెండేళ్లలో ఉన్నత విద్యలో చేరికలను విశ్లేషిస్తే పెరుగుదల శాతం అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2018–19, 2019–20లలో జాతీయస్థాయిలో చేరికలు 3.04 శాతం కాగా ఏపీలో 8.6గా ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో 2016– 18 మధ్య ఉన్నత విద్యలో చేరికలు 4.85 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా.. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల గణాంకాలను పరిశీలిస్తే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2018–19, 2019–20లలో పెరుగుదల 5 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణలో చేరికల శాతం ఏకంగా మైనస్‌లోకి దిగజారింది. 2018–19, 2019–20 గణాంకాలు పరిశీలిస్తే తెలంగాణలో 1.6 శాతం మేర తగ్గుదల ఉంది. విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల... గత ఐదేళ్లుగా ఉన్నత విద్యారంగం గరిష్ట చేరికల్లో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో 2018–19లో విద్యార్థుల జీఈఆర్ 35.8 కాగా 2019–20లో 38.3గా నమోదైంది. అంతకు ముందు ఏడాది కన్నా 2019–20లో ఏడు శాతం మంది విద్యార్థులు అదనంగా ఉన్నత విద్యలో చేరినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏపీలో విద్యార్థినుల చేరికల నిష్పత్తి 2018–19లో 29.0 కాగా 2019–20లో 32.2గా ఉంది. రాష్ట్రంలో ఉన్నతవిద్యలో విద్యార్థినుల చేరికలు ఒక్క ఏడాదిలో 11.03 శాతానికి పెరగడం గమనార్హం. అదే జాతీయస్థాయి జీఈఆర్ గణాంకాలు చూస్తే విద్యార్థినుల చేరికల్లో పెరుగుదల 2.28 శాతమే ఉంది. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణల్లో 2018–19, 2019–20లలో విద్యార్థుల చేరికలు 4 శాతం లోపు, విద్యార్థినుల చేరికలు 6 శాతం లోపే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోనూ గణనీయ పురోగతి.. ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లోనూ ఏపీలో గణనీయ పురోగతి ఉన్నట్లు ఏఐఎస్హెచ్ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19, 2019–20లలో చేరికల గణాంకాలు చూస్తే ఎస్సీలు 7.5 శాతం పెరగ్గా ఎస్టీల చేరికలు 9.5 శాతానికి పెరిగాయి. అదే జాతీయ స్థాయిలో గత రెండేళ్లలో ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం మాత్రమే పెరుగుదల ఉండడం గమనార్హం. ఇదే సమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేరికల్లో తగ్గుదల కనిపిస్తోంది. పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో భరోసా.. ’గత రెండేళ్లలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల చేరికల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలే దీనికి ప్రధాన కారణం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుండగా వసతి దీవెన కింద వసతి, భోజనం, ఇతర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు నేరుగా అందిస్తోంది. దీంతో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు భరోసా నెలకొంది. ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యాకోర్సుల్లో చేరగలుగుతున్నారు. ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల నిష్పత్తి 2024 నాటికి 70కి పెంచడంతోపాటు 2035 నాటికి 90కి చేర్చాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలమనే నమ్మకం ఉంది’ – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
సర్వేలన్నీ మాకే అనుకూలం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీతో పాటు వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలన్నీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని సూచిస్తున్నాయని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్థులు ప్రయత్న లోపం లేకుండా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం చేసిన ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మెదక్, జహీరాబాద్ ఎంపీలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలను కేసీఆర్ నియోజకవర్గాల వారీగా చదివి వినిపించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని, అభ్యర్థులు ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలని ఉపదేశించారు. నవంబరు మొదటి వారంలో దుబ్బాకలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇతర నియోజకవర్గాల్లో సభలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమావేశం. సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పార్టీ అభ్యర్థులు పద్మా దేవేందర్ రెడ్డి, ఎస్.రామలింగారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సతీష్ కుమార్ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. -
పాగా వేయాలె..
సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలూ గెలుచుకోవాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తనకున్న సమాచారం మేరకు ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని, సమయాన్ని వృథా చేయకుండా.. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా.. ప్రతిఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి చెప్పాలని హితవు చేశారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: మంత్రులు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశనం చేశారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, పోలింగ్ రోజు వరకు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్న వారు ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు 60 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. నియోజకవర్గాల వారీగా వారి వివరాలను అభ్యర్థులకు సమావేశంలో అందజేశారు. కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లల్లో అభ్యర్థుల ప్రచార తీరు బాగుందని, జగిత్యాలలో కొంత పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణలో 54 సీట్లల్లో అధిక్యత దిశగా కొనసాగుతున్నామని, మెజార్టీ ఎంత అన్న విషయంపై దృష్టిసారించాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో విసృతంగా ప్రచారం నిర్వహించాలని, ప్రతిపక్షాలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వివరించారు. శాసనసభ రద్దు చేసిన నాటి నుంచి నేటి వరకు చేసిన సర్వేలలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని, అందరికీ 60 శాతంపైగానే ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. అభ్యర్థులు మరింత కష్టపడి ప్రజల మద్దతు కూడగట్టుకుంటే విజయం నల్లేరుమీదనడకే అని భరోసా ఇచ్చారు. 50 రోజుల్లో తెలంగాణలో 100 సభలు నిర్వహించాలని అనుకుంటున్నామని, నవంబర్ మొదటి వారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉంటుందని, అభ్యర్థులు, టీఆర్ఎస్ శ్రేణులు బహిరంగసభను విజయవంతం చేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా ఉత్తర తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పూర్తి చేసేందుకు పార్టీ కార్యాచరణ రూపొందించిందని, అభ్యర్థులు ప్రతి ఓటరు కలిసేలా ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో భారీ సభ.. నియోజకవర్గం కేంద్రాల్లో బ్యాక్ ఆఫీసులు.. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొందరు అభ్యర్థులకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రజల్లో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కోడ్ ఉంది జాగ్రత్త..! అంటూ అభ్యర్థులకు కేసీఆర్ హెచ్చరించినట్లు వినికిడి. అభ్యర్థులు ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. సమావేశంలో అభ్యర్థులకు ఆయన సూచనలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా పాక్షిక మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారి జాబితాను.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు కేసీఆర్ అందజేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను అధినేత కేసీఆర్ వివరించారు. నోటిఫికేషన్‌కు ముందు, తర్వాత సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పారు. సమయాన్ని వృథా చేసుకోవద్దని, ఒక్క రోజు కూడా విరామం తీసుకోవద్దని, ప్రతి ఓటర్ను కలిసి ప్రభుత్వ పథకాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు, బ్యాక్ ఆఫీసులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసమ్మతి అనేది పూర్తిగా తగ్గిపోయిందని, ఎక్కడైనా ఉంటే ఆ జిల్లా మంత్రులే చూసుకుంటారని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త అభ్యర్థులకు బీఫాం ఎలా ఫైల్చేయాలి? ఎన్నికల అఫిడవిట్, ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు ఎలా ఫైల్ చేయాలో కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, జగిత్యాల అభ్యర్థి సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా సమావేశం అయ్యారు. -
చాపకింద నీరులా కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. అవగాహనలేమితో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 96 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వ్యాధిగ్రస్తుల నిర్ధారణ కోసం వైద్యారోగ్య శాఖ లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకూ జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్‌లో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేటి నుంచి ఇంటింటా సర్వే చేపట్టనుంది. ఇందుకు గానూ 1062 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి వయస్సుతో సంబంధం లేకుండా ఒంటిపైన ఏవైన స్పర్శలేని మచ్చలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి సమాచారం అందించి వైద్య పరీక్షలు చేయిస్తారు. గతంలో కుష్ఠు వ్యాధికి సంబంధించి ప్రత్యేక వైద్యం కోసం కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం సాధారణ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయడంతో చాలా మంది పరీక్షలు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. పదివేల జనాభాలో ఒకరికంటే తక్కువ వ్యాధిగ్రస్తులు ఉంటే కుష్టు వ్యాధి అదుపులో ఉన్నట్లు. అయితే ప్రస్తుతం జిల్లాలో 1.37శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అవగాహన లేమితోనే.. కుష్ఠు వ్యాధిపై అవగాహన లేకపోవడంతోనే వ్యాధి ప్రబలుతుందని తెలుస్తోంది. అంటు వ్యాధి అని ప్రజల్లో అవగాహన కల్పిస్తే ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 60 మందికి కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాగా, ప్రస్తుతం ఈసారి 96 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా దాదాపు 500ల వరకూ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఉంటుందని భావిస్తున్నారు. కుష్ఠు వ్యాధి అంటే.. కుష్ఠు వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటా రు. దీని నివారణకు ఆరు నెలల వరకూ చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు సంవత్సరం వరకూ చికిత్స అందిస్తారు. ఈ వ్యాధి సోకిన తర్వాత 3 నుంచి 15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడతాయి. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకుని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధి ఉన్నట్లు నిర్ధారిస్తారు. జిల్లాలోని జైనథ్ మండలంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇది వరకూ చికిత్స పొందిన వారు దాదాపు 2వేలకు పైగా ఉన్నారని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ, గిమ్మ, మేడిగూడ, కౌట, దీపాయిగూడ, ఆనంద్‌పూర్, బేల మండలంలో దహెగాం, బాధి, సాంగిడి, తలమడుగు మండలంలో పల్లి(బి), పల్లి(కె), ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి), యాపల్‌గూడ, మామిడిగూడ, ఇచ్చోడ మండలంలో గేర్జం, ఉట్నూర్ మండల కేంద్రంలో, ఆదిలాబాద్ పట్టణ ంలోని ఖుర్షీద్‌నగర్, హమాలీవాడల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 36వేల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో 15వేల మంది ఉన్నారంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నేటి నుంచి ఇంటింటా సర్వే.. కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేది వరకూ కొనసాగుతుంది. ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఒంటిపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1062 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతిఒక్కరూ ఈ బృందం సభ్యులకు సహకరించాలి. జిల్లాలో ప్రస్తుతం 96 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. – శోభ పవార్, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ అధికారి -
కమలదళం కదన వ్యూహం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లే లక్ష్యంగా కమలదళం చాప కింద నీరులా దూసుకెళ్తోంది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా పని కానిచ్చేస్తోంది. పలు సర్వేల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో బీజేపీకి పార్టీకి ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి పట్టు పెంచుకోవడంతో పాటు గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీకి చెందిన అనుబంధ విభాగాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి. అంతేకాదు పక్కన ఉన్న కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే కర్ణాటక నుంచి భారీగా తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలను ఒక్కో నియోజకవర్గానికి అవసరాలకు అనుగునంగా 50 నుంచి 100 మందిని కేటాయిస్తున్నారు. వారంతా కూడా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక పార్టీ బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు సర్వేల నివేదికల ఆధారంగా బలమైన నేతల కోసం గాలం వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి పార్లమెంటరీ బోర్డుకు సమర్పించారు. ఈ జాబితా ప్రకటించడం నేడో, రేపో లాంఛనంగా ప్రకటించే అవకాశముంది. ఇక మహాకూటమి అభ్యర్థులు తేలాక టికెట్ దక్కని వారిని కూడా పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనతో వెళ్తోంది. పట్టు ఉన్న స్థానాలపై గురి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి ముందు నుంచి కాస్త పట్టు ఉంది. కొన్ని నియోజకవర్గాలలో పటిష్టమైన ఓటు బ్యాంకును కమల దళం కలిగిఉంది. ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి కాస్త భిన్నమైన శైలిని ప్రదర్శించి మరింత ఓటు బ్యాంకు సాధించి గెలుపు బావుటా ఎగురవేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాలపై గట్టి ఫోకస్ పెడుతోంది. వీటిలో కనీసం రెండు స్థానాలైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, వనపర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించింది. వీటిలో కనీసం రెండు స్థానాలైనా గెలుపొందాలని భావిస్తోంది. అలాగే, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాలపై దృష్టిపెట్టింది. వీటిలో ఇది వరకే మహబూబ్‌నగర్‌లో గెలుపొందిన చరిత్ర ఉండడం, మిగతా నారాయణపేట, మక్తల్‌లో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండటంతో గెలుపుపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు సర్వేలను ప్రామాణికం చేసుకొని ఎంపిక చేయాలని భావిస్తోంది. మహాకూటమి అభ్యర్థుల ప్రకటన కొలిక్కి వస్తే... అక్కడ ఉండే అసంతృప్తులకు సైతం గాలం వేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోపోటీలో ఒక్కరే ఉండగా.. మరికొన్ని నియోజకవర్గాలలో ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, అచ్చంపేట నుచి మల్లీశ్వర్తో పాటు గద్వాల నుంచి టికెట్ రేసులో ఉన్న రాజా వెంకటాద్రిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి నుంచి వెంకటాద్రిరెడ్డి పేరును ఖరారు చేసి పార్లమెంటరీ బోర్డుకు పంపించింది. అలంపూర్‌లో సైతం రజినీరెడ్డి పార్టీ ఆదేశాల మేరకు ప్రచారంలో నిమగ్నం కాగా.. వనపర్తి నుంచి వనపర్తిలో అమరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నారాయణపేట నుంచి రతంగ్ పాండురెడ్డి పేరు ఖరారు చేయగా.. దేవరకద్ర నుంచి ఎగ్గని నర్సింహులు, వర్కటం జగన్నాథరెడ్డి పోటీ పడినా అధిష్టానం నర్సింహులు వైపే మొగ్గు చూపి పేర్లను రాష్ట్ర పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపించింది. కాగా, కొడంగల్ నుంచి నాగూరావ్ నామాజీ బరిలో నిలపాలని భావిస్తున్నప్పటికీ మరోవైపు మక్తల్ నుంచి కూడా ఆయన పేరును పరిశీలించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, పడాకుల బాల్‌రాజు, పాండురంగారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక జడ్చర్ల నుంచి రామ్మోహన్, వీరబహ్మచారి, ఆర్.శ్రీనివాస్ రేసులో ఉన్నారు. భిన్నమైన ప్రచారశైలి ఈసారి తప్పనిసరిగా కొన్ని స్థానాలను ఖచ్చితంగా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ... కాస్త భిన్నమైన శైలితో ప్రచారంలో ముందుకెళ్తోంది. ఇప్పటికే పార్టీ అనుబంధంగా ఉండే సంఘాలు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాయి. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా కాస్త సీరియస్‌గా తీసుకొని నియోజకవర్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన శక్తి కేంద్రాల ద్వారా పోలింగ్ బూత్ స్థాయికి కేంద్రప్రభుత్వ పథకాలను తీసుకువెళ్తున్నారు. శక్తి కేంద్రాల్లో ఒక్కో వ్యక్తికి పది కుటుంబాలను కేటాయించారు. సదరు శక్తి కేంద్రంలోని సభ్యుడు సాధ్యమైనంత మేర ఓట్లను మళ్లించేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్న బీజేపీ కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులను పరిశీలకులుగా నియమించింది. ఫోకస్ పెట్టిన నియోజకవర్గానికి ఇద్దరేసి చొప్పున కన్నడ ఎమ్మెల్యేలను కేటాయిస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి భారీగా వస్తున్న కార్యకర్తలను కూడా ఒక్కో నియోజకవర్గానికి 50 నుంచి 100 మందిని కేటాయిస్తున్నారు. తద్వారా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఫలితాలను రాబట్టాలని భావిస్తోంది. -
కదులుతున్న వక్ఫ్‌భూముల డొంక
సరిహద్దుల నిర్ధారణలో సర్వే బృందాలు వివరాల కోసం మున్సిపాలిటీ, రిజిస్ట్రార్లకు వక్ఫ్‌బోర్డు లేఖలు ఆ భూముల నివాసితుల్లో ప్రకంపనలు అమలాపురం టౌ¯ŒS : అమలాపురం పట్టణం, రూరల్ మండలంలోని వక్ఫ్ భూముల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వక్ఫ్ బోర్డు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఆ భూముల డొంక కదులుతోంది. పట్టణంలోని వడ్డిగూడెంలో సర్వే నంబరు 455 లోని 27.95 ఎకరాలను, మండలంలోని భట్నవల్లి, సమనస, తాండవపల్లి, నడిపూడి, నల్లమిల్లి గ్రామాల్లోని దాదాపు 275 ఎకరాల భూములను వక్ఫ్ బోర్డు కాకినాడ ఇ¯ŒSస్పెక్టర్ సులేమా¯ŒS బాషా రెండురోజుల క్రితం పరిశీలించారు. అంతేగాకుండా అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, తహసీల్దార్ నక్కా చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఇ.లక్షి్మలతో ఇప్పటికే సులేమా¯ŒS విడివిడిగా చర్చించారు. ఈ పరిణామాలతో అమలాపురం వడ్డిగూడెంలోని వక్ఫ్ బోర్డు భూములుగా భావిస్తున్న 27.95 ఎకరాల్లో ఇప్పటికే భవంతులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు నిర్మించుకున్న వారు ఉత్కంఠలో ఉన్నారు. ఈ 27.95 ఎకరాల విలువ ప్రస్తుతం దాదాపు రూ.500 కోట్లు చేస్తుందని అంచనా. అంతటి విలువైన ప్రాంతంలో రూ.లక్షలు పెట్టి స్థలాలు కొని, ఇళ్లు, భవనాలు నిర్మించుకున్న వారు ఈ భూములను వక్ఫ్‌బోర్డు స్వా ధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరైతే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే రూరల్ మండలంలో గుర్తించిన 275 ఎకరాల్లోని యాజమానులకు వక్ఫ్ బోర్డు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ భూములు వక్ఫ్ బోర్డువని...వాటిని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరమని...తమకు స్వాధీనం చేయాలని ఈ నోటీసులో పేర్కొంది. రెండు రోజుల్లో సర్వేకు సన్నాహాలు అమలాపురంలో వక్ఫ్ బోర్డు ఆస్తులుగా మొత్తం 91.8 ఎకరాలను గుర్తించారు. అందులో తొలుత వడ్డిగూడెంలో వెలుగు చూసిన 27.95 ఎకరాలపై వక్ఫ్‌బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. పట్టణంలోని నల్ల వంతెన, కచేరీ చావిడి ప్రాంతాల్లో మిగిలిన వక్ఫ్ భూములను గుర్తించినట్టు తెలిసింది. వడ్డిగూడెంలోని భూముల్లో రెండు రోజుల్లో సర్వే నిర్వహించేందకు వక్ఫ్‌బోర్డు బృందాలను సిద్ధం చేస్తోంది. ఈ సర్వే బృందాల్లో వక్ఫ్ బోర్డు, రెవెన్యూ, మున్సిపల్ సర్వేయర్లతో పాటు మరికొందరు ఉద్యోగులు ఉంటారు. ఈ బృందాలు ఆ 27.95 ఎకరాల్లో సరిహద్దులను నిర్ధారించనున్నాయి. రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాలకు లేఖలు వక్ఫ్ భూముల వివాదం వెలుగు చూసిన వెంటనే స్థానిక రిజిస్ట్రేష¯ŒS కార్యాలయంలో ఆ భూముల క్రయ, విక్రయలను, రిజిస్ట్రేషన్లను అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వక్ఫ్‌బోర్డు అటు మున్సిపాలిటీకి.. ఇటు రిజిస్ట్రేష¯ŒS కార్యాలయానికి లేఖలు రాసింది. మున్సిపాలిటీ పరిధిలోని ఫలానా సర్వే నంబర్లలోని భూముల్లో ప్రస్తుతం ఎలాంటి కట్టడాలు ఉన్నాయి? ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి? భవనాలకు వాటి హక్కుదారులు చెల్లిస్తున్న పన్నుల వివరాలను తెలియజేయాలంటూ మున్సిపాలిటీని వక్ఫ్‌బోర్డు కోరింది. అలాగే ఫలానా సర్వే నంబరులో ఉన్న భూములకు ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను తెలియజేయాలని కూడా కోరింది. పట్టణం, రూరల్ మండలాల్లో గుర్తించిన దాదాపు 366 ఎకరాల వక్ఫ్ భూముల విలువ దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
250 పంచాయతీల్లో పింఛన్లకు అంతరాయం
స్మార్ట్ సర్వేలో చెడిపోయిన ట్యాబ్‌లు పింఛన్‌దారులకు ఇక్కట్లు రామచంద్రపురం : ప్రజా సాధికారిక సర్వే పింఛన్‌దారుల పాలిట శాపంలా మారింది. ప్రతినెలా ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా ఈ నెల లేకుండాపోయింది. జిల్లాలో శనివారం ప్రారంభమైన పింఛన్ల పంపిణీ 250 పంచాయతీల్లో నిలిచిపోయింది. జిల్లాలో 1069 పంచాయితీలున్నాయి. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 5వతేదీ వరకు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,73,673 పింఛన్లదారులకుగాను సుమారుగా రూ. 50.89 కోట్లు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. సుమారుగా 24 వేల మంది ఫించన్‌దారులు శనివారం పంచాయతీలకు వచ్చి ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోయారు. గత నెల నుంచే మరమ్మతులు... ప్రతి నెలా పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లు గత నెలలోనే మరమ్మతులకు గురయ్యాయి. పలుచోట్ల పించన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లను ప్రజా సాధికారిక సర్వేకు వినియోగించారు. ఈ సర్వేలో కొన్ని ట్యాబుల్లో డేటా డిలిట్ జరగ్గా, మరికొన్ని ట్యాబ్‌ల్లో మొత్తం చెడిపోయాయి. ఆయా ట్యాబ్‌లకు మరమ్మతులు చేయించేందుకు సుమారుగా రూ.30 లక్షల వరకు అవుతుందని అంచనా వేశారు. కానీ వాటికి తిరిగి మరమ్మతులు చేయటంలో అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. -
కరకట్ట పటిష్టతపై సర్వే
పెదకళ్లేపల్లి (మోపిదేవి): కృష్ణాకరకట్ట పటిష్టతపై సర్వే చేపట్టినట్లు క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ ఎంపీ రాజు తెలిపారు. మోపిదేవి వార్పు నుంచి పెదకళ్లేపల్లి కృష్ణానది కరకట్ట బలాన్ని పరిశీలించేందుకు గురువారం ఇంజనీరింగ్ అధికారులు మండలంలో పర్యటించారు. ఎస్ఈ మాట్లాడుతూ ఇటీవల కృష్ణానదికి వదిలిన 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునే సామర్థ్యం ఎంతవరకు కరకట్టకు ఉందనే విషయంపై సర్వేచేపట్టినట్లు తెలిపారు. గతంలో 2009లో కృష్ణానదికి అధిక మొత్తంలో వరదనీరు రావడంతో కరకట్ట తెగి గుంటూరు జిల్లాను ముంచెత్తినందున ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో 2009 నాటి వరద పునరావృత్తమైతే చేపట్టాల్సిన చర్యలతో పాటు పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు. ఈఈ ఉమామహేశ్వరావు, ఆర్సీ ఏఈ చలపతిరావు, ఎంపీటీసీ సభ్యులు యక్కటి హనుమాన్‌ప్రసాద్ ఉన్నారు. -
తిరుమలలో లిడార్ వాహనంతో సర్వే
తిరుమల: మొదటి, రెండో ఘాట్‌రోడ్లతోపాటు తిరుమలలోని రోడ్లు, వాటి సామర్థ్యం, తరచూ తలెత్తుతున్న లోటుపాట్లు, సురక్షితమైన వాహనాల ప్రయాణంపై బుధవారం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు లిడార్ వాహనంతో సర్వే నిర్వహించారు. ఘాట్‌రోడ్లలోని సమస్యలను తెలుసుకునేందుకు అత్యాధునిక పరికరాలతో ఈ సర్వే నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. జర్మనీ సంస్థ విక్టోరా జియో స్పెక్ట్రల్కు చెందిన అత్యాధునిక సాంకేతిక పరికరాలు కల్గిన లిడార్ వాహనాన్ని మంగళవారం రాత్రి తిరుమలకు తీసుకువచ్చారు. అధికారులు గంగోపాధ్యాయ, పూర్ణిమ పరిద, దేవేష్, రవిశంకర్ తదితర అధికారులు బుధవారం ఉదయం లేపాక్షి సర్కిల్ నుంచి సర్వేను ప్రారంభించారు. ప్రత్యేకించి మొదటి ఘాట్‌రోడ్డులో ఎక్కువగా ఉన్న మలుపులను తగ్గించి ప్రమాదాలు నివారించాలనే ముఖ్య లక్ష్యంతో వీరి బృందం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. అయితే వీరి బృందం నగదు తీసుకోకుండా స్వామికి ఉచితంగా సేవ చేయడం గమనార్హం.