మాట్లాడుతున్న పార్టీ అధినేత కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీతో పాటు వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలన్నీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని సూచిస్తున్నాయని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్థులు ప్రయత్న లోపం లేకుండా ప్రచార పర్వంలో దూసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం చేసిన ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులతో పాటు మెదక్, జహీరాబాద్ ఎంపీలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలను కేసీఆర్ నియోజకవర్గాల వారీగా చదివి వినిపించారు.
అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని, అభ్యర్థులు ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలని ఉపదేశించారు. నవంబరు మొదటి వారంలో దుబ్బాకలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇతర నియోజకవర్గాల్లో సభలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమావేశం. సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పార్టీ అభ్యర్థులు పద్మా దేవేందర్ రెడ్డి, ఎస్.రామలింగారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, సతీష్ కుమార్ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment