suryapet firing
-
'తెలంగాణ పోలీసులకు సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధం'
హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటన దిగ్బ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్ఐలను వెంకయ్యనాయుడు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్యనాయుడు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. 72 గంటలు గడిస్తేకాని ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారన్నారు. ధైర్యంగా పోరాడిన పోలీసులకు కేంద్రం తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. శత్రువుల వద్ద ఆయుధాలున్నప్పటికీ పోలీసులు ధైర్యంగా పోరాడారన్నారు. తెలంగాణ పోలీసులకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్య తెలిపారు. ఎన్ఐఏ సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి వెంకయ్యనాయుడు సూచించారు. -
'తెలంగాణ పోలీసులకు సహాయానికి కేంద్రం సిద్ధం'
-
కాల్పుల నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్...?
అరవపల్లి : నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో పోలీసులపై కాల్పులు జరిగి మూడు రోజులు కాకముందే.. జిల్లాలోని అరవపల్లిలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ఘటన నిందితులే, అరవపల్లి కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు కాల్పుల జరిపిన తీరును గమనిస్తే వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. శనివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితులు ఓ వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను తీసుకుని పారిపోయారని సమాచారం. నిందితులు వరంగల్ జిల్లా జనగాం వైపు పారిపోయారని తెలుస్తోంది. సూర్యాపేట ఘటనతో పోలీసులు నిందితుల గాలింపు కోసం సుమారు 15 టీం లను జిల్లాకు పంపించారు. దాంతో దుండగులు జిల్లా దాటి వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికీ నిందితుల ఊహాచిత్రాలు కూడా గీయించలేక పోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ కి చెందిన ముఠా సభ్యులపనేనని పోలీసులు భావిస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం
నల్లగొండ : ఆయుధాలతో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం సీతారాంపేటలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంబడించారు. దీంతో నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సూర్యాపేట ఘటన మరవకముందే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నిందితులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బైక్ పై పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.