నల్లగొండ : ఆయుధాలతో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం సీతారాంపేటలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంబడించారు. దీంతో నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సూర్యాపేట ఘటన మరవకముందే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నిందితులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బైక్ పై పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.