sv satyanarayana
-
బొమ్మగాని ధర్మభిక్షం నేటితరానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ధర్మభిక్షం మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించడంలో ఆదర్శప్రాయులని కొనియాడారు. ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ‘మహాసంకల్పం’పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థ ఏర్పడని సమయంలోనే ధర్మభిక్షం విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఉంటూ ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేగా, ఎంపీగా ఐదుసార్లు చట్టసభలకు వెళ్లిన ధర్మభిక్షం, సాధారణ జీవితాన్ని గడిపారన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేటలో మహా సంకల్పం పుస్తక చర్చను నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ధర్మభిక్షం శతజయంతి సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రొఫె సర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ధర్మభిక్షం అచ్చమైన ప్రజల మనిషి అని కొనియాడారు. ధర్మభిక్షం అంటేనే పోరాటం.. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ, మహాసంకల్పం పుస్తకం చదివితే ధర్మభిక్షం గురించి నేటి తరానికి తెలుస్తుందన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ, ధర్మభిక్షం, బండ్రు నరసింహులు గురించి మాట్లాడడం అంటేనే ప్రజా పోరాటాల గురించి మాట్లాడడమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ, ధర్మభిక్షం మానవతా ఉద్యమతార అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంలాగా ‘మహా సంకల్పం’పుస్తకం ఒక రూపాన్ని నిర్మించిందన్నారు. కార్యక్రమంలో పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, సినీ దర్శకుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘మహాసంకల్పం’పుస్తక ముద్రణకు సహకరించిన బూర మల్సూర్ గౌడ్‌ను జ్ఞాపికతో సత్కరించారు. -
రారండోయ్
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘జీవితం ఒక ఉద్యమం’ ఆంగ్లానువాదం ‘లైఫ్ ఈజ్ ఎ మూవ్మెంట్’ ఆవిష్కరణ జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది. అనువాదం: స్వాతి శ్రీపాద. సంపాదకుడు: చింతపట్ల సుదర్శన్. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం. ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు మహబూబ్‌నగర్‌లోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్ హాల్(తెలంగాణ చౌరస్తా – బోయపల్లి గేట్ దారిలో)లో జరగనుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. తొలి సెషన్లో జి.హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలమూరు అధ్యయన వేదిక. తంగిరాల సోని కవితాసంపుటి ‘బ్లాక్ వాయిస్’ ఆవిష్కరణ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ప్రచురణ: సామాజిక పరివర్తన కేంద్రం. ‘మొదటి పేజీ కథలు’ సంపుటానికిగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు ‘లక్ష రూపాయల’ నగదుతో ‘లక్ష్షీ్మనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కార (2019)’ ప్రదానం జనవరి 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. జాగృతి వారపత్రిక ఓ కార్టూన్ల పోటీ నిర్వహిస్తోంది. చక్కటి హాస్యం ఉండాలి. బ్లాక్ అండ్ వైట్‌లో ఒకరు ఎన్నైనా పంపవచ్చు. మూడు బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. 500 చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఉంటా యి. ఫిబ్రవరి 28లోగా పంపాలి. ఫోన్: 9959997204 -
9 వర్సిటీలకు వీసీల నియామకం
హైదరాబాద్: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డిని జేఎన్ టీయూ వీసీగా నియమించింది. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్ వీ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సాంబశివరావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఉస్మానియ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం నియమితులయ్యారు.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగగా ప్రవీణ్ రావులను నియమించారు.