ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘జీవితం ఒక ఉద్యమం’ ఆంగ్లానువాదం ‘లైఫ్ ఈజ్ ఎ మూవ్‌మెంట్’ ఆవిష్కరణ జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది. అనువాదం: స్వాతి శ్రీపాద. సంపాదకుడు: చింతపట్ల సుదర్శన్. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం.
‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు మహబూబ్‌నగర్‌లోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్ హాల్(తెలంగాణ చౌరస్తా – బోయపల్లి గేట్ దారిలో)లో జరగనుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. తొలి సెషన్లో జి.హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలమూరు అధ్యయన వేదిక. తంగిరాల సోని కవితాసంపుటి ‘బ్లాక్ వాయిస్’ ఆవిష్కరణ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ప్రచురణ: సామాజిక పరివర్తన కేంద్రం.
‘మొదటి పేజీ కథలు’ సంపుటానికిగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు ‘లక్ష రూపాయల’ నగదుతో ‘లక్ష్షీ్మనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కార (2019)’ ప్రదానం జనవరి 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. జాగృతి వారపత్రిక ఓ కార్టూన్ల పోటీ నిర్వహిస్తోంది. చక్కటి హాస్యం ఉండాలి. బ్లాక్ అండ్ వైట్‌లో ఒకరు ఎన్నైనా పంపవచ్చు. మూడు బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. 500 చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఉంటా యి. ఫిబ్రవరి 28లోగా పంపాలి. ఫోన్: 9959997204
రారండోయ్
Published Mon, Jan 28 2019 1:26 AM | Last Updated on Mon, Jan 28 2019 1:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment