Swami Narayan
-
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్‌తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
భావి విద్యకు బాటలు
రాజ్‌కోట్: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి. ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు. -
పదమూడు రోజుల్లో...థేమ్స్ టు ఆల్ప్స్
పాఠక పర్యటన విస్మయపరిచే ప్రపంచ వింతలు... అబ్బురపరిచే ప్రకృతి సోయగాలు... లండన్‌లోని థేమ్స్ నది నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు ఏ ఒక్కదానినీ మరచి పోలేక పోతున్నాం అంటున్నారు హైదరాబాద్ వాస్తవ్యురాలైన అనితా సమర్థ్. యూరప్‌లోని తొమ్మిది దేశాలలో 13 రోజుల పాటు జరిపిన పర్యటన తమ మదిలో పదిలంగా ఉండి పోయిందంటూ ఆ విశేషాల మాలికను ఇలా మన ముందు ఉంచుతున్నారు... ప్రకృతి అందాలు, మానవుడు నిర్మించిన అద్భుత కట్టడాలు మన దేశంలోనే ఉన్నాయని నమ్మేదాన్ని. అలాంటి నేను, మా అక్కయ్యతో కలసి సెలవుల్లో యూరప్ యాత్రకు బయలుదేరాను. మొత్తం తొమ్మిది దేశాలు 13 రోజులు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకొని, బయల్దేరాం. లండన్‌లో మన శిల్పకళ రాజసం ఉట్టిపడే లండన్‌ని చేరేసరికి సాయంత్రం అయ్యింది. మరు సటి రోజు ఉదయాన్నే ముందుగా స్వామి నారాయణ్ దేవాలయానికి వెళ్లాం. లండన్ దేవాలయంపై మన శిల్పకళ అందాలను చూసి అమితాశ్చర్యం కలిగింది. స్వామి నారాయణ్ విగ్రహం, ఇతర దేవతా విగ్రహాలలో ప్రాణం ఉట్టిపడే తేజస్సు కళ్లకు కట్టింది. అక్కడి నుంచి అల్బర్ట్ మెమోరియల్ విగ్ర హం, ఎలిజబెత్ మహారాణి నివసించే బకింగ్‌హామ్ ప్యాలస్‌ని సందర్శించాం. ఆ తర్వాత బిగ్‌బెన్ లండన్, ఇంపీరియల్ యూనివర్సిటీ, పార్లమెంట్ హౌస్.. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ థేమ్స్ నది చేరుకున్నాం. నదిపై లండన్ బ్రిడ్జ్ అందాలు మాటల్లో వర్ణించలేం. పెద్ద ఓడలు వచ్చినపుడు లండన్ బ్రిడ్జ్ తెరచుకునే విధానం చూసి ఆశ్చర్యపోవాల్సిందే! ఈ వంతెన నిర్మాణంలో ఇంజినీర్ల పనితనం అబ్బురపరుస్తుంది. అక్కడి నుంచి మేడమ్ టుస్సాడ్స్ వైపుగా కదిలాం. అది ఒక మైనపు ప్రపంచం. ఇక్కడ మైనపు శిల్పాలు నిజరూపాలకు పోటీ పడుతున్నట్టు ఉన్నాయి. ఆమ్స్టర్లో బొమ్మల పార్క్ ఆ రోజు రాత్రే స్టెనా అనే పెద్ద నౌకలో సముద్ర ప్రయాణం చేశాం. అక్కడే రాత్రి భోజ నం విడిది. సముద్రపు అందాలలో మైమరచిపోతూ సైబీరియన్ పక్షుల కిలకిల రావాలతో ఆమ్స్టర్ డామ్ చేరుకున్నాం. ఇక్కడ ప్రపంచంలోని అద్భుత కట్టడాలన్నీ సూక్ష్మరూపంలో దర్శనమిచ్చే మినియేచర్పార్క్ అబ్బురపరిచిం ది. బొమ్మల కొలువు పెట్టినట్టు విశాలమైన మైదానంలో చిన్న చిన్న కట్టడాలు.. వాటికి తగ్గట్టు అదే పరిమాణంలో పెంచిన చిన్ని చెట్లు ముద్దుగా అనిపించాయి. పిల్లలైతే అక్కడి నుంచి బయటికి రావటానికే ఇష్టపడరు. అలా ఆమ్స్టర్ డామ్ మీదుగా బెల్జియమ్ చేరుకున్నాం. డామ్, రాయల్ ప్యాలస్ చూస్తూ మెక్సికన్ బాయ్ శిల్పానికి చేరుకున్నాం. అదే రోజు ‘సింబల్ ఆఫ్ బెల్జియమ్’గా పేరొందిన ప్రాంతాన్నీ సందర్శించి, స్విట్జర్లాండ్ చేరుకున్నాం. భూతల స్వర్గం స్విట్జర్లాండ్ తర్వాతి రోజు రహదారికి ఇరువైపుల ఆకుపచ్చని తివాచీ పరచినట్టు, భూతలస్వర్గంలా అనిపించే దారి గుండా ప్యారిస్ నుండీ స్విట్జర్లాండ్ చేరుకున్నాం. ఆ తర్వాత రోజు జంగ్ఫ్రూ అనబడే యూరప్‌లోనే అతి ఎత్తై మంచు పర్వతానికి చేరుకున్నాం. అక్కడి మంచుకొండలు, ప్రకృతి అందాలు చూసి జీవితం ధన్యమైనదనే భావనలో ముందుకు సాగిపోయాం. అక్కడే మంచులోయలో మంచుపై చెక్కిన జంతువుల, మనషుల శిల్పాలు వింతగా తోచాయి. తర్వాతరోజు ‘తితిలీస్’ అనబడే పర్వతాలపైకి కేబుల్ కార్లో వెళ్లాం. ఆ తర్వాత ప్రపంచంలోనే మొదటిదైన ‘రివాల్వింగ్ కేబుల్‌కార్‌లో 3,020 మీటర్ల ఎత్తుపై ఉన్న ‘ఆల్ప్స్’ పర్వత శ్రేణులను చేరుకున్నాం. ఈ అత్యద్భుతాలు చూసే అవకాశం రావడం ఓ వరంగా భావించాం. మరుసటి రోజు రోమ్‌లోని కొలోజియం స్టేడియం సందర్శించాం. ప్రపంచంలోనే అతి ప్రాచీన, అతిపెద్ద స్టేడియం ఇది. ఇక్కడే గ్లాడియేటర్ ఫైట్స్ జరిగాయట. పోప్ సందేశం.. వాటికన్... ఆ తర్వాత అతి చిన్న దేశమైన ‘వాటికన్ సిటీ’ చేరుకున్నాం. క్రిస్ట్మస్ రోజు పోప్ ఇచ్చే సందేశం వినటం కోసం వేలాది మంది ఇక్కడకు చేరుకుంటారు. అదే సెయింట్ పీటర్స్ చర్చ్ ఆఫ్ బ్యాసిలికా. ఈ చర్చి చూడటానికి రెండు కళ్ళు చాలవు. చర్చి లోపల అద్భుతమైన మేరిమాత విగ్రహం, మైకలాంజిలో చిత్రాలు, జీసస్ శిల్పాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలు. ఆ తర్వాత రోజు అందమైన ద్వీపంగా పేరుగాంచిన వెన్నీస్కి పడవ ప్రయాణం ద్వారా చేరుకున్నాం. నగరమంతా నీటిలోనే ఉంటుంది. చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ వారు జీవనం కొనసాగిస్తారు. ఇక్కడే అతి ప్రాచీనమైన సెయింట్ మార్క్స్ చర్చి, గాజు కర్మాగారం సందర్శించాం. గాజుతో అందమైన బొమ్మలు, వివిధ రూపాలు ఎంతో అందంగా చేతితో మలచబడటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాం. అలా మా ప్రయాణం తర్వాతి రోజు ఆస్ట్రియాలోని క్రిస్టల్ షోరూమ్ సర్వోస్కి సందర్శనతో ముగిసింది. ఇటలీలో పీసా టవర్... ఆల్ప్స్ పర్వతాల నుంచి మా ప్రయాణం ఇటలీ వైపుగా సాగింది. ప్రపంచపు అద్భుతాలలో ఒకటైన ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ చూసి మంత్ర ముగ్ధులమైపోయాం. 1174 లో నిర్మించబడ్డ ఈ టవర్ మొదట మెత్తటి మట్టితో కట్టడం ఆరంభించడం వలన ఒక వైపుకి వంగి పోయిందని చెప్పారు. తర్వాత కట్టడం ఆపేసి, 1201లో మళ్ళీ దానిని పునర్మించారు. 1940లో 30 మిలియన్ డాలర్లతో దీనిని పటిష్టం చేశారట. దీనిని ‘స్క్వేర్ ఆఫ్ మిరాకిల్స్’ అని కూడా అంటారు. ఇక్కడ మైకలాంజిలో చెక్కిన డేవిడ్ శిల్పంతో పాటు ఇంకా ఎన్నో శిల్పాల ప్రదర్శన అబ్బురపరుస్తుంది. అందానికి మారుపేరు ప్యారిస్ ప్రపంచ ఏడు అద్భుతాలలో ఒక్కటైన ఈఫిల్ టవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అద్భుత కట్టడం 325 మీటర్ల ఎత్తుతో నాటి ఇంజినీర్ల పనితనపు గొప్పదనాన్ని చాటుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత నెపోలియన్, అతని సైనికుల సమాధులతో పాటు 3,500 ఏళ్ల పురాతనమైన స్తంభాన్ని సందర్శించాం. అనంతరం రాత్రి ప్యారిస్‌లో ప్రఖ్యాతి గాంచిన ‘లిడో షో’ కి వెళ్లాం. అక్కడ నృత్యకారుల వస్త్రాలంకరణ, వేదిక అలంకరణ, అదీ క్షణాలలో మారిపోవడం.. సమయం కూడా గుర్తు రాలేదు. తర్వాత రోజు పిల్లల ప్రపంచమైన డిస్నీవరల్డ్‌ను చుట్టొచ్చాం. అక్కడ పూలతో చేసిన అలంకరణలు, బొమ్మలు, ఊయలలు చూసి పిల్లలు మైమరచి పోయారు. అదేరోజు సాయంత్రం ప్యారిస్‌లోని సెయింట్ నదిలో పడవ ప్రయాణం... ఒక బ్రిడ్జి మరొక బ్రిడ్జి ని పోలి ఉండకపోవడమే ఇక్కడి ప్రత్యేకత. ప్రేమ జంటలు ఇక్కడ ఒక బ్రిడ్జిపై తాళాలు కడతారు. అలా చేయడం వల్ల ఎప్పటికీ విడిపోరని వారి నమ్మకం.