Syamalamma
-
గిరిజనుడిపై పోలీసుల దాష్టీకం
- తన కళ్లెదుటే బూట్ కాళ్లతో తొక్కిపెట్టి.. - కొట్టారని బాధితుడి భార్య ఆరోపణ గూడూరు: కట్టుకథ చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి ఓ గిరిజనుడిని పోలీసులు చితకబాది మంచానపడేలా చేసిన సంఘటన గూడూరు రూరల్ పరిధిలోని నెల్లటూరు గిరిజనకాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు గూడూరు రూరల్ మండలం నెల్లటూరు గిరిజనకాలనీకి చెందిన నిడిగంటి శ్రీనివాసులు, అతని భార్య శ్యామలలను సోమవారం రాత్రి గూడూరు రూరల్ పోలీసులు ఓ కట్టుకథ చెప్పి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంతకీ పోలీసులు చెప్పిన కట్టు కథేంటంటే శ్రీనివాసులు భార్య శ్యామల చిన్నాన నాగార్జున ఎవరిదో ఉంగరం దొంగిలించాడని, దాన్ని తీసుకొచ్చి వారి చేతికిచ్చాడంటూ క«థ అల్లారు. ఆ కథ చెప్పి గిరిజన దంపతులను రాత్రి 9 గంటల ప్రాంతంలో రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీరా స్టేషన్‌కు తీసుకొచ్చాక శ్రీనివాసులు భార్య శ్యామలది చిల్లకూరు కావడంతో ఆమె తండ్రి అయిన గడ్డం లక్ష్మయ్య ఏదో కేసులో నిందితుడని, అతనెక్కడున్నాడంటూ శ్యామలను గదమాయించారు. శ్రీనివాసులును కింద పడుకోబెట్టి కానిస్టేబుళ్లు బూటు కాళ్లతో తొక్కిపెట్టగా ఎస్సై అతి దారుణంగా తన కళ్లెదుటే లాఠీతో కాళ్లు పగిలేలా చితకబాదారని శ్యామల కంటతడిపెట్టింది. తన తండ్రి కేసులో ఉంటే పోలీసులు చిల్లకూరుకు వెళ్లి వాళ్లను విచారించాలే గానీ, ఎలాంటి సంబంధం లేని తన భర్తను కిరాతకంగా కొట్టి హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ దెబ్బలకు తన భర్త కనీసం నడిచే స్థితిలో కూడా లేడని ఆమె రోధించింది. తన భర్త కూలిపనులకెళ్తేనే తాము బతకాలని, ఏ పాపం తెలీని తన భర్తను అన్యాయంగా చితకబాదారని కన్నీరుమున్నీరయింది. ఈ విషయం తమ గ్రామపెద్ద భాస్కర్‌రెడ్డికి చెప్పానని, ఆయన చెప్పినా కూడా వినకుండా మీ మామ ఎక్కుడున్నాడురా.. నీకు తెలుసంటూ మళ్లీ కొడుతూనే ఉన్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. తమను అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి పంపారని వాపోయింది. ఈ విషయంపై రూరల్ ఎస్సై బాబీని వివరణ కోరగా ఓ కేసులో నిందితుడైన శ్రీనివాసులు మామ ఆచూకీ కోసం అతన్ని తీసుకొచ్చామని, అతన్ని చూపించడంతో తిరిగి పంపేశామని తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
ధర్మవరం రూరల్ : మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన వివాహిత శ్యామలమ్మ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల సమాచారం మేరకు.. తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్న జయరాజ్, శ్యామలమ్మలు దంపతులు. వీరికి నలుగురు కూతుర్లు. కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు అంటున్నారు. శనివారం కూడా భార్యభర్తల మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు అంటున్నారు. ఇంట్లో ఆమె ఆర్తనాదాలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. సంఘటన జరిగిన సమయంలో భర్త పరారీలో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించాడా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
కుమార్తెలను వేధిస్తున్న యువకుడిపై చర్యల్లేవని తల్లి బలవన్మరణం
మదనపల్లె మండలం తట్లివారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు తన కుమార్తెలను ప్రేమపేరుతో వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారు చర్యలు తీసుకోలేదనీ, గ్రామ పెద్దలకు చెబితే పంచాయతీ పెట్టి వదిలేశారని దీంతో శ్యామలమ్మ మానసిక ఆందోళనకు గురై పురుగుల మంది తాగి బలవన్మరణానికి పాల్పడింది. -
జగన్‌తో రాజకీయ సంచలనం
=తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి =వెయ్యి మందితో పార్టీలో చేరిన శ్యామలమ్మ సాక్షి, తిరుపతి: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్.జగన్ మోహన్‌రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకురాలు సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్లగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంతోషమ్మ కోడలు శ్యామలమ్మ వైఎస్ఆర్ సీపీలోకి రావడం ముదావహమని అన్నారు. జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడని, రాజకీయం రంగంలో సంచలనం సృష్టించారని తెలిపారు. వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ ఊడలు పీకారని తెలిపారు. వైఎస్ పాలనలో గ్యాస్, కరెంట్, బస్సు చార్జీలు పెరగలేదని గుర్తు చేశారు. తిరుపతిలోనే 25 వేల తెల్ల రేషన్ కార్డులు, 23 వేల మందికి పింఛన్లు తీసేశారని అన్నారు. ప్రజలకు ఒక్క మేలు కూడా చేయని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. నాలుగు నెలల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, ఆయన అధికారంలోకి రాగానే రూ.200 పింఛన్లు 700కు పెంచుతారని, వికలాంగులకు అందజేసే రూ.500 వెయ్యి చేస్తారని అన్నారు. ఓటర్లు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. పార్టీలో చేరిన శ్యామలమ్మ మాట్లాడుతూ తాను వైఎస్ అభిమానిగా పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పలు సంక్షేమ పథకాలు వస్తాయని అన్నారు. నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, నగర మహిళా కన్వీనర్ కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, పార్టీ నాయకులు ఎంవీఎస్. మణి, పుల్లయ్య, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, చెంచయ్య యాదవ్, సాకం ప్రభాకర్ పాల్గొన్నారు.