జెలియాంగ్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాజభవన్లో జెలియాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అశ్వనీ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెలియాంగ్తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ఇప్పటి వరకు నాగాలాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్న నైపూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన నైపూ రియో 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే జెలియాంగ్కు భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.