Talashila Raghuram
-
వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు రక్షణ
సాక్షి,అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో తమకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌లపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.దర్యాప్తునకు సహకరించాలని అప్పిరెడ్డి తదితరులను ఆదేశించింది. 48 గంటల్లో పిటిషనర్లందరూ తమ పాస్‌పోర్ట్‌లను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ తమ తమ వాదనలను వినిపించారు. జోగి రమేష్‌పైనా కఠిన చర్యలొద్దుఅలాగే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు సైతం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రమేష్‌పై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో ఉన్న పామూరు బస్‌స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. -
ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక గ్యాలరీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చేయనున్న పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమాన్ని సామాన్యులు సైతం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులతోపాటు ప్రజలు, కార్యకర్తలు కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దాదాపు 30వేల మంది వీక్షించే విధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సూచన మేరకు ప్రజలు కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమం నిమిత్తం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓ స్టేజిపై ప్రమాణ స్వీకార అధికార కార్యక్రమం, మరోదానిపై గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఉంటారని తలశిల రఘురాం వెల్లడించారు. అలాగే ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఓ గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా మైదానం ప్రాంగణంలోనూ, బయట కూడా ప్రజలు వీక్షించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాన్యులు, కార్యకర్తలంతా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించవచ్చునని ఆయన ప్రకటించారు. -
వైఎస్ జగన్ ప్రమాణం: సామాన్యులు సైతం వీక్షించేలా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయనున్న పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమాన్ని సామాన్యులు సైతం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులతోపాటు ప్రజలు, కార్యకర్తలు కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దాదాపు 40వేల మంది వీక్షించేవిధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. మైదానం ప్రాంగణంలోనూ, బయట కూడా ప్రజలు వీక్షించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాన్యులు, కార్యకర్తలంతా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించవచ్చునని ఆయన వెల్లడించారు. -
నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, సాయంత్రం 6 గంటలకు గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉదయం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోనూ, సాయంత్రం 5 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోనూ జరిగే సభల్లో ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 2న ఆయన ఇడుపులపాయలో జరిగే రెండో ప్రజాప్రస్థానం(ప్లీనరీ)కుహాజరవుతారని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. చిత్తూరులో 26 రోజులపాటు యాత్ర: చిత్తూరు జిల్లాలో 26 రోజుల పాటు సాగిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర గురువారంతో ముగిసింది. జిల్లాలో 2013 నవంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు విడతలుగా సాగింది. మొత్తం 26 రోజుల పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 24 మందికి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తిరుపతి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చాల్సి ఉన్నప్పటికీ అక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో ప్రస్తుతానికి మినహాయించారు. త్వరలో అక్కడ కూడా పర్యటిస్తారని రఘురామ్ తెలిపారు.