తైక్వాండోలో తళుక్కు
వారికి రెండు కాళ్లు.. రెండు ఆయుధాల లాంటివి. రెప్పపాటు సమయంలో కాళ్లను వేగంగా తిప్పుతూ ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వినూత్న రీతిలో నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు. ఆత్మవిశ్వాసంతో పోటీల్లో నెగ్గుతూ పతకాలు సాధిస్తుంటారు. బాక్సింగ్ తరహాలో కనిపించే తైక్వాండో క్రీడలో రాణిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతున్న విద్యార్థులు, యువ క్రీడాకారులపై కథనం.
– వరంగల్ స్పోర్ట్స్
ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతోందనేది ఒకప్పటి మాట. అయితే కరాటేతోపాటు తైక్వాండోతో కూడా శత్రువుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు ఓరుగల్లుకు చెందిన పలువురు విద్యార్థులు, క్రీడాకారులు. చేతులను తక్కువగా ఉపయోగిస్తూ కాళ్లతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే సాహస క్రీడగా పేరొందిన తైక్వాండోలో వారు రాణిస్తూ జిల్లాకు పేరు తీసుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే..క్రీస్తు పూర్వం 37వ శతాబ్దంలో కొరియాలోని కుగుర్మో రాజవంశీయులు తైక్వాండో క్రీడకు రూపకల్పన చేసినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత సిల్లా వంశీయులు ఈ క్రీడ అభివృద్ధికి పాటుపడ్డారు. తైక్వాండోలో 90 శాతం కాళ్లు, 10 శాతం చేతులను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి ఆత్మరక్షణ పొందేందుకు నేర్చుకున్న ఆర్మీ అధికారులకు కొరియా దేశం ప్రోత్సాహం అందించింది.
1980లో ఇండియాలో గుర్తింపు
1973లో మొదటిసారిగా తైక్వాండోను జిమ్మి ఆర్ జగిత్యానిగామ అనే మాస్టర్ వియత్నాం నుంచి వచ్చి భారతదేశానికి Sపరిచయం చేశారు. 1980లో భారత ప్రభుత్వం తైక్వాండోకు అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. 1985లో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్‌లో గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎస్జీఎఫ్ఐ, ఆర్జీకేఏ, యూనివర్సిటీ స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆట విధానం
12 మీటర్ల దీర్ఘచతురస్రాకార బోట్లో తైక్వాండో పోటీలను నిర్వహిస్తుంటారు. జాతీయస్థాయి పోటీల్లో మూడు నిమిషాల కాలవ్యవధి.. మూడు రౌండ్లు, రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు నిమిషాలు.. రెండు రౌండ్లు, జిల్లాస్థాయి పోటీల్లో రెండు నిమిషాలు.. రెండు రౌండ్లు నిర్వహిస్తుంటారు. మ్యాచ్‌లో ముఖంపై తగిలిన కిక్కు మూడు పాయింట్లు, చాతిపై తగిలితే ఒక పాయింట్, రిబ్స్, పొట్టపై తగిలితే ఒక పాయింట్ ఇస్తారు. అలాగే ప్రత్యేకమైన కొన్ని కిక్‌లపై మూడు లేదా రెండు పాయింట్లు ఇస్తారు. తైక్వాండో పోటీలో ప్రత్యర్థిని గట్టిగా పట్టుకోవడం, నెట్టివేయడం, వెనకవైపు కిక్ చేయడం, ఎరీనా దాటడం లాంటివి చేస్తే మైనస్ పాయింట్లు ఇస్తారు.
అఖిల్.. అదర హో
యువ క్రీడాకారుడు అఖిల్ తైక్వాండోలో అదరగొడుతున్నాడు. కోచ్‌ల పర్యవేక్షణ లో కఠోర శిక్షణ పొందుతున్న ఆయన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. 2014లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17లో బ్రాంజ్, 2015లో హైదరాబాద్‌లో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన రీజినల్ పోటీల్లో కన్సొలేషన్ బహుమతి పొందాడు. వీటితోపాటు ఇప్పటివరకు మూడు రాష్ట్రస్థాయి, రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు.
పవన్.. మెరిసెన్
మానుకోటకు చెందిన పవన్ తైక్వాండో లో ప్రతిభ కనబరుస్తున్నాడు. పవన్ 2014లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో, 2015లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరి గిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గతంలో ౖహె దరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి, 2014లో ప్రకాశంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి పతకం సాధించాడు.
సత్తాచాటుతున్న సాత్విక
తొర్రూరుకు చెందిన సీహెచ్. సాత్వికారెడ్డి తైక్వాండోలో మూడేళ్లుగా శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. 2013లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీ ల్లో గోల్డ్ మెడల్, 2015లో పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన జాతీయస్థాయిలో బహుమతి సాధించింది. 2012లో కేరళలో పైకా నిర్వహించిన జాతీయస్థాయి, ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో 2013లో జరిగిన జాతీయస్థాయి అండర్–17, 2014లో మహబూబ్‌నగర్ లో జరిగిన అండర్–17 పైకా జాతీయస్థా యి, మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–19 జాతీయస్థాయి, 2015లో మహారాష్ట్రలో జరిగిన ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి పోటీలకు హాజరైంది.