Tamil Nadu - Karnataka
-
ఏకమయ్యారు
డ్యాంలను అడ్డుకునేందుకు ఒకే వేదికపైకి రంగంలోకి విజయకాంత్ కరుణ, ఈవీకేఎస్, తమిళిసై, వాసన్‌లతో భేటీ మద్దతు ప్రకటించిన నేతలు నేడు ఢిల్లీకి పయనం రాష్ర్టంలోని ప్రతి పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఇది ఎన్నికల కూటమి కానప్పటికీ, అన్నదాతల సంక్షేమార్థం, జాలర్ల భద్రత లక్ష్యంగా, శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఒకే పక్షంగా నిలిచాయి. ఈ జట్టుకు ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని పార్టీల ప్రతినిధులతో ‘మేఘదాతు’లో డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకుందామన్న నినాదంతో సోమవారం ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాక్షి, చె న్నై : తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి వివాదం కొత్తేమి కాదు. తాజాగా తమిళనాడులోకి చుక్క నీరు కూడా రానివ్వకుండా చేయడం లక్ష్యంగా మేఘదాతులో రెండు డ్యాంల నిర్మాణానికి కర్ణాటక పాలకులు కసరత్తుల్లో మునిగారు. తమిళనాడు ప్రభుత్వం యథాప్రకారం చోద్యం చూస్తూ, చివరిక్షణంలో రంగంలోకి దిగి పనిలో పడింది. ఓ వైపు రాష్ర్టంలో అన్నదాతలు పోరు బాట పట్టినా, అఖిల పక్షంగా ఢిల్లీ వెళ్దామని ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం చడీ చప్పుడు కాకుండా శనివారం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఓ వినతి పత్రం అందజేసి మేఘాదాతులో డ్యాంల నిర్మాణం అడ్డుకోండని విన్నవించి నమ అనిపించేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతి పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది. రంగంలోకి విజయకాంత్: అన్ని పార్టీలను వెంట బెట్టుకు వెళ్లి ప్రధానిని కలవకుండా, కేవలం స్వలాభా పేక్షతోసీఎం పన్నీరు సెల్వం ఢిల్లీ వెళ్లడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ప్రధాన ప్రతి పక్ష నేత హోదాతో తన మార్కు రాజతంత్రాన్ని ప్రయోగించేందుకు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల్ని ఏకం చేసి తన నేతృత్వంలో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం అన్ని పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద ఆదివారం ు బిజీ బిజీగా గడిపి ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. నేతలతో భేటీ : కేవలం మేఘదాతులో డ్యాం నిర్మాణం అడ్డుకట్ట అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, మరో నాలుగు అంశాలను తెరమీదకు విజయకాంత్ తీసుకొచ్చారు. డ్యాంల నిర్మాణం అడ్డుకట్టను ప్రధాన అంశంగా చేసుకుని జాలర్లకు కడలిలో భద్రత, తమిళ కూలీలను పొట్టన పెట్టుకున్న శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసగా, భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా, ముల్లై పెరియార్ డ్యాం హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ప్రధాని మోదీని కలుద్దాం..! అన్న పిలుపుతో నేతలతో విజయకాంత్ భేటీ అయ్యారు. తొలుత గోపాలపురంలోని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇంటికి వెళ్లారు. పార్టీ యువజన నేత సుదీష్, ఎమ్మెల్యేలతో కలసి ఆ ఇంట్లో అడుగు పెట్టిన విజయకాంత్ నేరుగా కరుణానిధిని కలుసుకుని దుశ్శాలువ కప్పి సత్కరించారు. స్టాలిన్‌తో కలసి కరుణానిధితో అరగంట పాటుగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా సత్యమూర్తి భవన్ చేరుకుని మద్దతు సేకరించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భులతో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి ఆళ్వార్ పేటలోని తమాకా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్‌తో భేటీ అయ్యారు. అలాగే, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్లతోనూ సమావేశమైన విజయకాంత్ వామపక్ష నేతలతో ఫోన్లో మాట్లాడి మద్దతు కూడ గట్టుకున్నారు. అన్ని పార్టీలు ఒకే వేదిక మీదుగా ప్రధాని మోదీని కలుసుకునేందుకు సిద్ధం అయ్యాయి. మొత్తం పది పార్టీలకు చెందిన 25 మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఒకే వేదికగా నేడు ఢిల్లీకి: విజయకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలు, జాలర్లు, కూలీలకు అండగా నిలబడే విధంగా అందర్నీ వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం పన్నీరు సెల్వం కేవలం స్వలాభాపేక్షతో కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. వాళ్లు స్వలాభం కోసం ప్రాకులాడడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా అన్ని పార్టీలను ఏకం చేసి ఢిల్లీకి సోమవారం పయనం అవుతున్నామన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పేర్కొంటూ, విజయకాంత్ విజ్ఞప్తి మేరకు తమ పార్టీ తరపున ఎంపిలు కనిమొళి, తిరుచ్చి శివ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలిపారు. ఈవీకేఎస్ పేర్కొంటూ, విజయకాంత్‌తో కలిసి తమ ప్రతినిధిని ఢిల్లీకి పంపించనున్నామన్నారు. తమిళిసై సౌందరరాజన్ పేర్కొంటూ, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ తాజాగా స్పందించిన తీరు అభినందనీయమన్నారు. ఆయనతో కలసి తమ ప్రతినిధి ఢిల్లీకి వెళ్తారని, ప్రధానికి డిమాండ్లను విన్నవిస్తామన్నారు. విజయకాంత్‌తో కలసి స్వయంగా తానే ఢిల్లీ వెళ్లనున్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ పేర్కొన్నారు. అన్ని పార్టీలను ఏకం చేయడంలో తమ నేత విజయకాంత్ సఫలీకృతుడు కావడాన్ని ఆ పార్టీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు రోజుల్లో ఈ భేటీలు ‘కూటమి’కి అనుకూలతను సృష్టిస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే. -
‘కర్ణాటక’కు అనుమతి లేదు
సాక్షి, చెన్నై:కావేరి తీరంలో కొత్త డ్యాముల నిర్మాణానికి కర్ణాటకకు అనుమతులు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమిళనాడుకు ఆటంకాలు కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని అన్నదాతలకు హామీ ఇచ్చారు. కావేరి నదీ జలాలే రాష్ట్రంలోని డెల్టా జిల్లాల అన్నదాతలకు ప్రధాన వరం. తాగు, సాగుబడికి ఆ నీళ్లు అందాల్సిందే. అయితే, ఆ నీటిని అడ్డుకునే రీతిలో కర్ణాటక పాలకులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. తమిళనాడుకు వాటాగా ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వడంలో ఆడ్డంకులు సృష్టిస్తూ వచ్చిన కర్ణాటక కొత్త కుట్రకు ఒడిగట్టే పనిలో పడింది. తమిళనాడు - కర్ణాటక సరిహద్దులోని మేఘ దాతు వద్ద రెండు జలాశయాల్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. తమ రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్, కబని డ్యాంలు నిండిన పక్షంలో ఉబరి నీళ్లు తమిళనాడులోకి పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండడాన్ని కర్ణాటక సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ఉబరి నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించకుండా నాలుగేసి చొప్పున టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే విధంగా రెండు డ్యాంల నిర్మాణాలకు కసరత్తుల్ని వేగవంతం చేసింది. ఈ సమాచారం డెల్టా జిల్లా అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. కర్ణాటక చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేశారు. అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నా, అఖిల పక్షానికి ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నా, రాష్ట్రంలోని సీఎం పన్నీరు సెల్వం సర్కారు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలతో కాలయాపన చేసే పనిలో పడింది. అనుమతి లేదు : కర్ణాటక చర్యలను అడ్డుకోవాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి మేనేజ్మెంట్ బోర్డు, కావేరి జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ ఏకమయ్యాయి. అన్ని సంఘాలు కలసి కట్టుగా ఢిల్లీకి వెళ్లాయి. ప్రధాని నరేంద్ర మోదీ అనుమతిని కోరాయి. ఇందుకు మోదీ అంగీకరించారు. దీంతో మంగళవారం రైతు సంఘాల నాయకులు మాసిలా మణి, తంబు స్వామి, మోహన్, సేతురామన్, కుమరేషన్లతో పాటుగా సీపీఐ ఎంపీ డి రాజా, సీపీఎం ఎంపీ రంగరాజన్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటక కుట్రల్ని వివరిస్తూ, వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌చేస్తూ ఓ వినతి పత్రాన్ని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మరో వినతి పత్రాన్ని అందజేశారు. డెల్టా జిల్లాలోని కావేరి నదీ తీరంలో మీథైన్ తవ్వకాలను నిలుపుదల చేయాలని మరో వినతి పత్రం అందజేశారు. వీటిని పరిశీలించినానంతరం తమిళ అన్నదాతలకు భరోసా ఇచ్చే రీతిలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ విషయమై అన్నదాతలు మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో డ్యాంల నిర్మాణానికి కేంద్రం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని, ఇవ్వబోదని మోదీ తమకు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తమిళనాడుకు ఇబ్బందులు, ఆటంకాలు కలగని రీతిలో కావేరి జలాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటామని మోదీ భరోసా ఇచ్చారని వివరించారు. మీథైన్ తవ్వకాల వ్యవహారాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తమకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. -
కావేరి రగడ
సాక్షి, చెన్నై: తమిళనాడు - కర్ణాటకల మధ్య వివాదాలకు కొదవ లేదు. ఇందులో ప్రధానమైనది కావేరి జల వివాదం. నదీ జలాల హక్కుల మేరకు తమిళనాడుకు కేటాయించాల్సిన వాటాను కర్ణాటక తుంగలో తొక్కుతోంది. మూడేళ్లుగా నీటి కోసం ఓవైపు కోర్టులో, మరో వైపు రోడ్డెక్కి గళం విప్పాల్సి వస్తున్నది. రెండేళ్ల క్రితం నెలకొన్న పరిస్థితి గత ఏడాది కూడా పునరావృతం అయ్యే అవకాశాలు కన్పించినా, చివరి క్షణంలో రుతు పవనాల కరుణతో జలాశయాలు పొంగి పొర్లాయి. చివరకు తమిళనాడు వైపుగా కావేరిలోకి నీళ్లు విడుదల చేయక తప్పలేదు. అయితే, ఈ ఏడాది రావాల్సిన వాటా ఇంత వరకు కానరాని దృష్ట్యా, మళ్లీ నీటి కోసం సమరం చేయాల్సిన పరిస్థితి రాష్ర్ట ప్రభుత్వానికి ఏర్పడి ఉంది. అదే సమయంలో ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి జల పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే, యూపీఏ సర్కారు దాట వేత ధోరణిలతో కాలయాపన చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారం మారడంతో, మళ్లీ అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణా కమిటీ నినాదం తెరపైకి వచ్చింది. ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ భగ్గుమనే పరిస్థితులను కల్పిస్తోంది.అప్రమత్తం: పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లి కావేరి వివాదాన్ని మోడీ దృష్టికి తెచ్చి, బోర్డు, కమిటీ ఏర్పాటుకు విన్నవించారు. అందుకు తగ్గ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టుగా సంకేతాలు వెలువడంతో కర్ణాటక సర్కారు మేల్కొంది. అఖిల పక్షాన్ని వెంట బెట్టుకెళ్లి ప్రధాని మోడీని కలిసింది. బోర్డు, కమిటీకి వ్యతిరేకంగా విజ్ఞప్తులు చేశారు. అదే సమయంలో ఇంత వరకు బోర్డు, కమిటీ ఏర్పాటుకు ఎలాంటి పనులను తాము చేపట్టలేదంటూ కేంద్రం వివరణ ఇచ్చినట్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మేల్కొన్నారు. లేఖాస్త్రాలు : బోర్డు, కమిటీ ఏర్పాటులో జాప్యం నెలకొనడం, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను, డెల్టా అన్నదాతల కన్నీటి గోడును వివరిస్తూ, కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కులు, తమకు అనుకూలంగా ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆ లేఖలో వివరించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం ఇదే విషయంగా ప్రధాని మోడీకి లేఖాస్త్రం సంధించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ జల వివాదం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆచితూచి.. : బోర్డు, కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పట్టుబడుతుంటే, బీజేపీ నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్న ప్రకటనలిస్తున్నారు. కావేరి జలవివాదాన్ని త్వరితగతిన సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆ పార్టీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేషన్లు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు.