Tanning
-
AP: చర్మకారుల ఉపాధికి ఊతం
సాక్షి, అమరావతి: చర్మకారుల ఉపాధి, శిక్షణకు రాష్ట్రంలో 9 మినీ లెదర్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తారు. తొలి దశలో విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో దానికి రూ.4.37 కోట్ల నుంచి రూ.5.75 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (లిడ్కాప్)కు చెందిన భూమిని ఎకరం చొప్పున జిల్లాల్లో కేటాయించారు. అందులో భవనాన్ని నిర్మించి యంత్రాలు సమకూర్చుతారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు వీటిలో పాదరక్షల తయారీతో ఉపాధి పొందుతారు. చర్మకార కుటుంబాల్లోని వారికి వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇప్పటికే నిధుల మంజూరు, స్థలం కేటాయింపు, తదితరమైనవి పూర్తి కావడంతో భవన నిర్మాణం, యంత్రాల ఏర్పాటు పనులు చేపట్టాలని నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినీ లెదర్ పార్కులు ఇవే.. చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో ఒక్కొక్క చోట రూ.4.37 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రకాశం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి.కొండూరులో ఒక్కొక్క చోట రూ.5.75 కోట్లతో వీటిని నిర్మిస్తున్నారు. ఎడవల్లి, జి.కొండూరులో 150 మంది చొప్పున శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణకు సాంకేతిక సహకారానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (చెన్నై)తో లిడ్కాప్ ఒప్పందం చేసుకుంది. ఉపాధి ఇలా.. లిడ్కాప్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పాదరక్షల తయారీలో మూడు నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అనంతరం వారికి లెదర్ పార్కులోనే యంత్రాలను సమకూర్చి, మెటీరియల్ (ముడిసరుకు) ఇస్తారు. వారు తయారు చేసిన పాదరక్షల మార్కెటింగ్ కూడా లిడ్కాప్ చేపడుతుంది. ఇందుకోసం లబ్ధిదారులకు నెలవారీగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇస్తుంది. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కూడా వీటిలో పాదరక్షల తయారీ నేర్చుకొనే వెసులుబాటు కల్పిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా లెదర్పార్కులు: లిడ్కాప్ ఎండీ హర్షవర్థన్ రాష్ట్రంలో తొలిసారిగా మినీ లెదర్ పార్కుల ఏర్పాటు జరుగుతోంది. నాలుగింటికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి, నిర్మాణం, మౌలిక వసతులు, లబ్ధిదారుల ఎంపిక వంటివి చేస్తోంది. గతేడాది కరోనా తీవ్రత వల్ల వీటి ఏర్పాటు జరగలేదు. ఈసారి ప్రత్యేక అనుమతితో నాలుగు పార్కులను ఒకేసారి చేపట్టాం. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసి ఎస్సీల్లోని చర్మకారుల అభివృద్ధికి ఊతమిస్తాం. వారికి అవసరమైన శిక్షణ, ముడిసరుకు, మార్కెటింగ్ వంటి వాటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. -
టానింగ్కు ఉపయోగపడేది ఏది?
మాదిరి ప్రశ్నలు 1. పారమీషియం, అమీబా వంటి ఏక కణ జీవుల్లో విసర్జక విధానాన్ని తెలపండి. 2. టానిన్, రెజిన్ల గురించి వర్ణించండి. 3. మన శరీరంలో సమతుల్యత ఎలా సాధ్యమవుతుందో వివరించండి. 4.ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తి కాదో పేర్కొనండి. (1 మార్కు) జ.శరీరంలో నీరు తగ్గినప్పుడు వాసోప్రెస్సిన్ ఉత్పత్తి అయి నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువల్ల మూత్రం గాఢత చెందుతుంది. నీరు అధికంగా తాగినప్పుడు శరీరానికి సరిపడినంత నీరు ఉండటం వల్ల వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాదు. 5.మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం? (1 మార్కు) జ.యూరోక్రోం అనే వర్ణకం వల్ల మూత్రం పసుపు రంగులో ఉంటుంది. ప్రశ్నించడం, పరికల్పన (2 మార్కులు) 6.మూత్రపిండాల్లో నీటి పునఃశోషణ జరగకపోతే ఏమవుతుంది? జ.నీటి పునఃశోషణ జరగకపోతే మూత్రం ద్వారా అధిక నీరు విసర్జితమవుతుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో జీవనం కష్టమవుతుంది. జీవులు నీటి నష్టాన్ని తగ్గించడానికి నీటి పునఃశోషణ చేస్తాయి. 7.అవయవదానం గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ను కలిసే అవకాశం వస్తే ఏ ప్రశ్నలు అడుగుతావు? జ.) అవయవదానం ఎవరు చేయొచ్చు? 2) బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు? 3) అవయవదానం కోసం ఎవరిని సంప్రదించాలి? 4) పాము కాటు, విష ప్రయోగాల వల్ల చనిపోయిన వ్యక్తుల అవయవాలు దానం చేయొచ్చా? 5) జీవించి ఉన్న వ్యక్తులు ఏ అవయవాలను దానం చేయొచ్చు? మాదిరి ప్రశ్నలు 1.మూత్రపిండాల అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టును ఏయే ప్రశ్నలు అడుగుతావు? ప్రయోగాలు– క్షేత్ర పరిశీలనలు 1.మూత్రపిండ బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడానికి వాటి నిలువు కోత విధానం, పరిశీలనలు రాయండి. జ.ఉద్దేశం: మూత్రపిండం బాహ్య, అంతర లక్షణాలను పరిశీలించడం పరికరాలు: మేక/గొర్రె మూత్రపిండం, పదునైన బ్లేడు, ట్రే, నీరు, ఫోర్సెప్స్. ప్రయోగ విధానం: మేక/గొర్రె మూత్రపిండాన్ని సేకరించి నీటితో శుభ్రంగా కడగాలి. ట్రేలో పెట్టి బాహ్య లక్షణాలను పరిశీలించి నోట్బుక్లో నమోదు చేయాలి. పదునైన బ్లేడుతో మూత్రపిండాన్ని నిలువుగా కోసి అంతర్నిర్మాణాన్ని పరిశీలించాలి. పరిశీలనలు: 1. బాహ్య లక్షణాలు: మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. నొక్కు భాగంలో మూడు నాళాలు బయటకు వస్తాయి. దాని పైభాగంలో టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది. 2. అంతర లక్షణాలు: వెలుపల ముదురు గోధుమ వర్ణంలో వల్కలం, లోపల లేత వర్ణంలో దవ్వ ఉంటాయి. సమాచార సేకరణ నైపుణ్యాలు (4 మార్కులు) కింది సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1.మందుల తయారీకి ఉపయోగపడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి? జ.టానిన్లు, జిగుర్లను మందుల తయారీలో ఉపయోగిస్తారు. 2.పాము కాటు నుంచి రక్షణ పొందేందుకు వాడే రిసర్పిన్ను ఏ మొక్క నుంచి, అందులోని ఏ భాగం నుంచి సేకరిస్తారు? జ.రిసర్పిన్ను సర్పగంధి మొక్కలోని వేరు నుంచి సేకరిస్తారు. 3.టానింగ్కు ఉపయోగపడేది ఏది? జ.తోళ్లను పదునుపెట్టడాన్ని టానింగ్ అంటారు. దీనికి ఉపయోగపడేది టానిన్లు. 4.ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. జ.మొక్కల సాధారణ పెరుగుదల, అభివృద్ధి మినహా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అంటారు. ఉదా‘‘ టానిన్, రెసిన్, జిగుర్లు, లేటెక్స్, ఆల్కలాయిడ్లు.