tarmaric
-
నిజామాబాద్ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న పసుపు రైతులు
-
నీళ్లు తాగి.. పసుపు తింటే తగ్గిపోతుంది
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిపై ప్రజలను గజిబిజి, గందరగోళానికి గురి చేస్తున్నాయి. అవాస్తవాలు, అర్థ సత్యాలతో కూడిన పోస్టింగ్‌ల కారణంగా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వైరస్ వ్యాపించకుండా అప్రమత్తమయ్యే పోస్టింగులే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టింగులు వైరల్ అవుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకు నీళ్లు తాగితే సరిపోతుందని, పసుపు తింటే తగ్గిపోతుందని వస్తున్న పోస్టింగుల్లో ఎలాంటి వాస్తవం లేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అర్థసత్యాలు, అవాస్తవాలు, వాటికి సమాధానాలు ఇస్తున్నాం. చదువుకోండి.... ప్రాక్టికల్‌గా ఉండి స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మరి దరికి చేరకుండా జాగ్రత్త పడండి. (జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?) సోషల్ మీడియా: నీళ్లు తాగితే చాలు వాస్తవం: ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగడం వల్ల గొంతు ద్వారా ఎలాంటి వైరస్ కూడా శరీరంలోని వెళ్లదని సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ చక్కర్లు కొడుతోంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. కానీ, తరచుగా నీళ్లు తాగడం మంచిదే. శ్వాస సంబంధిత వైరస్ల వ్యాప్తిని నిరోధిస్తుందనడంలో మాత్రం శాస్త్రీయత లేదు. సోషల్ మీడియా: పసుపు తింటే తగ్గిపోతుంది వాస్తవం: పసుపులో రోగనిరోధక శక్తి ఉంటుందని మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. పసుపు కరోనా వైరస్‌ను నియంత్రిస్తుందనడానికి కూడా ఎలాంటి ఆధారాల్లేవు. సాధారణంగా వైరస్‌లను ఫలానా పదార్థం నియంత్రిస్తుందన్నది ఇంతవరకు ఎక్కడా నిరూపించబడలేదు. సోషల్ మీడియా: మాస్కులు వైరస్‌ను నియంత్రించలేవు వాస్తవం: మాస్కులు 100శాతం వైరస్‌ను నిరోధించలేవు. కానీ, వైరస్ వ్యాప్తి చెందే అవయవాలను మాస్కులతో కప్పి ఉంచడం వల్ల తుమ్ములు, దగ్గుల ద్వారా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మాస్కులు ఉపయోగపడతాయి. ఇక, ఈ వైరస్ సోకిన వారు, తుమ్ములు, దగ్గులు వస్తున్న వారు మాస్కులు ధరించడమే ఉత్తమం. ఏదిఏమైనా ఎన్–95 లాంటి నాణ్యమైన మాస్కులను ధరించడం వల్ల ఎంతోకొంత ప్రయోజనమే కానీ నష్టమేమీ లేదు. సోషల్ మీడియా: ఉప్పు నీళ్లు పులకరిస్తే చాలు వాస్తవం: ఉప్పు నీళ్లు శ్వాస సంబంధిత వైరస్‌లను నియంత్రించలేవు. బ్లీచింగ్ పౌడర్, ఇథనాల్ లాంటివి పులకరించడంతో ప్రయోజనం ఉంటుంది అని వస్తున్న పోస్టింగుల్లో కూడా వాస్తవం లేదు. కానీ అది చాలా ప్రమాదకరం. అలాగే అతి చల్లని, అతి వేడి వాతావరణం కూడా వైరస్‌ను చంపేస్తుందనడం కూడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. సోషల్ మీడియా: వెండి పూత నిరోధిస్తుంది వాస్తవం: ఒక అమెరికన్ వెండిపూతను నీటిలో కలుపుకుని తాగడం వల్ల 12 గంటల్లో వైరస్ చనిపోతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తప్పుడు ప్రచారం వెలుగులోనికి తెచ్చాడు. ఐరన్, జింక్ లాగా మానవ శరీరంపై వెండి ఎలాంటి ప్రభావం చూపించలేదు. పైగా వెండి శరీరంలోకి వస్తే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సోషల్‌మీడియా: సాధారణ ఫ్లూ వైరస్ల కంటే ప్రమాదం కాదు వాస్తవం: ఈ వైరస్ సాధారణ ఫ్లూ వైరస్ల కన్నా పదిరెట్లు ప్రమాదకరం. సోషల్ మీడియా: మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది వాస్తవం: ఈ కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్ మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని, అయితే అవి జంతువులు, మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే దశలోనే ఉన్నాయని, మరో ఏడాది వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తొందరంగా వచ్చినట్టేనన్నది వారు చెపుతున్న మాట. సోషల్ మీడియా: పది సెకన్లు పాటు ఊపిరి బిగపట్టగలిగితే ప్రమాదం లేనట్టే వాస్తవం: దగ్గకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా 10 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టగలిగితే కరోనా వైరస్ నుంచి ఎలాంటి ప్రమాదం లేనట్టేనని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయాల్లో వాస్తవం లేదు. మీరు 10 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టగలిగినా మీకు కరోనా వైరస్ సోకదనడం సరైంది కాదు. ప్రాక్టికల్‌గా ఉండాలి. వీటితో పాటు చాలా మెస్సేజ్‌లు వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో స్థానికంగా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతున్న విషయాలు తప్ప మిగిలిన వాటిలో వాస్తవం పాళ్లు తక్కువ. అందుకే సోషల్ మీడియాపై పూర్తిగా ఆధారపడకుండా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం, అవసరమైతే హోం క్వారంటైన్ కావడం, టెస్టులు చేయించుకోవడమే ఉత్తమ మార్గం. ఇంకో విషయం ఏమిటంటే... కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేసినా చట్టపరంగా శిక్షార్హులు కూడా. (విదేశీ ప్రయాణమే కొంపముంచిందా?) -
పసుపు రైతులకు జనవరిలో శుభవార్త
సాక్షి న్యూఢిల్లీ: పసుపు రైతులకు జనవరిలో శుభవార్త వినిపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అరవింద్ గట్టి నెగోషియేటర్ అన్న విషయం నిరూపిస్తాను. పసుపు దిగుమతి నిలిపేయాలని కోరాం. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంటకాదు. అయినా సరే పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని హెచ్ఆర్డీ మంత్రిని కోరాం. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాం. తెలంగాణ బీజేపీదే అని ప్రధాని అన్నారు. తదుపరి తెలంగాణలో ఏర్పడేది బీజేపీ సర్కారే అని కేంద్ర నాయకత్వం నమ్ముతోంది. క్షేత్రస్థాయిలో సమాచారం లేకుండా మోదీ ఏదీ మాట్లాడరు. తెలంగాణలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు.’ అని అన్నారు. కాగా పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై ఎంపీ అరవింద్ ఇవాళ కేంద్రమంత్రులు అమిత్ షా, పియూష్ గోయల్‌ను కలిశారు. విదేశాల నుంచి పసుపు దిగుమతి నిలిపివేయాలని రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రులను కోరారు. -
నమ్మితే నిలువునా మోసం చేశారు
కోల్డ్‌స్టోరేజి ఎదుట 12రోజులుగా మహిళ పోరాటం పసుపు వ్యాపారం చేస్తూ చనిపోయిన భర్త రుణాలు చెల్లిస్తామని మోసగించిన పెద్దమనుషులు న్యాయం చేయాలంటూ రైతులతో కలిసి మహిళ ఆందోళన దుగ్గిరాల: పసుపు వ్యాపారం చేస్తున్న భర్త మృతిచెందడంతో ఆయనకు ఉన్న అప్పులు తీర్చేందుకు పెద్దమనుషులను నమ్మి మోసపోయిన మహిళ న్యాయం కోసం పోరాడుతోంది. తన పేరున ఉన్న భూమిని విక్రయించి రుణాలు తీర్చాలని, కోల్ట్‌స్టోరేజిలో పెట్టిన పసుపు బస్తాలను తీసి రైతులకు చెల్లించాలని ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు పెట్టిన ఆమె మోసపోయానని తెలుసుకుంది. కోల్డ్ స్టోరేజి యాజమాన్యంతో కలిసి పెద్దలు తమవరకు రావాల్సిన మొత్తం తీసుకుని రైతులకు చెల్లించలేదని ఆలస్యంగా తెలుసుకుని న్యాయం చేయాలంటూ కోల్స్టోరేజి ఎదుట పోరాడుతోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు... కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన బొంతు అశోక్‌రెడ్డి పసుపు వ్యాపారం నిర్వహించేవారు. అందులో భాగంగా మధ్యవర్తిగా ఉండి దుగ్గిరాలలోని ఓ కోల్డ్‌స్టోరేజిలో రైతులకు చెందిన సుమారు రూ. ఏడు కోట్ల విలువైన పసుపును నిల్వ ఉంచారు. గత ఏడాది అశోక్‌రెడ్డి అనారోగ్యంతో అకస్మికంగా మృతి చెందారు. విషాదంలో ఉన్న అశోక్‌రెడ్డి భార్య రమాదేవిని పలువురు పెద్దలు కలిసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి చెప్పగా.. తన భర్త ఎవరికి రుణం ఉండకూడదని చెప్పి తన పేరిట ఉన్న 11 ఎకరాల పొలం కాగితాలు ఇచ్చి, విక్రయించి అందరికి చెల్లించడంతో పాటు స్టోరేజిలో ఉన్న పసుపు రైతులకు అప్పగించాలని కోరింది. ఇదే అదనుగా కొందరు కోల్డ్ స్టోరేజి యాజమాన్యంతో కుమ్మక్కై 13500 పసుపు బస్తాలను 1350 బస్తాలుగా చిత్రీకరించి మోసం చేశారు. ఆచారం ప్రకారం గుడిలో నిద్ర చేస్తున్న మహిళ వద్దకు వెళ్లిన పెద్దలు సమస్య అంతా తీరిపోయిందని, ఒక్క స్టాంప్ పేపర్ మీద సంతకం చేస్తే చాలని చెప్పడంతో నిజమేనని నమ్మి సంతకం చేసింది. అంతా అయిపోయిందని తన రాత ఇంతవరకే ఉందనుకుని కుమార్తెను చదివించుకుంటూ జీవిస్తోంది. కోర్టు నోటీసులతో... అంతా సజావుగా ఉందనుకునే సమయంలో నెల రోజుల క్రితం కొందరు తమకు అశోక్‌రెడ్డి డబ్బులు ఇవ్వాలంటూ రమాదేవికి కోర్టు నోటీసులు పంపడంతో కంగారుపడ్డ ఆమె ఏం జరిగిందో తెలుసుకుని నివ్వెరపోయింది. కోల్డ్‌స్టోరేజి యాçజమాన్యం రైతుల పసుపు బస్తాలకు వారిపేరునే బాండ్లను తయారు చేసి గుంటూరులోని ఓ బ్యాంక్‌లో పెట్టి కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. అశోక్‌రెడ్డి మృతి చెందడంతో రైతులకు ఎగ్గొట్టేందుకు స్టోరేజి యాజమన్యం ఆయన భార్య రమాదేవి సంతకం చేసిన స్టాంప్ పేపర్లో స్టోరేజిలో ఉన్న పసుపును రైతులకు అప్పగించినట్టు రాసుకుని దానినే ఇప్పుడు రైతులకు చూపిస్తూ వారిని మోసగించేందుకు కుట్ర చేస్తున్నారు. రమాదేవి కోల్డ్ స్టోరేజి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పింది. దీంతో కోల్డ్ స్టోరేజి రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, రైతులకు అన్యాయం చేయవద్దని రమాదేవి రైతులతో కలిసి 12రోజులుగా స్టోరేజి వద్ద ఆందోళన చేస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని స్టోరేజిలో రికార్డులను పరిశీలించాలని కోరుతోంది.