Tax reforms
-
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
ట్యాక్స్‌పేయర్లకు కొంత ఊరట..
న్యూఢిల్లీ: ఆదాయం రూ. 7 లక్షలకన్నా స్వల్పంగా ఎక్కువుండి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేవారికి కొంత ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 7 లక్షల పరిమితిని దాటిన మొత్తానికి మాత్రమే పన్ను విధించేలా ఆర్థిక బిల్లును సవరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం ప్రకారం రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం ఉండదు. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) కానీ రూ. 7,00,100 ఉంటే మాత్రం రూ. 25,010 మేర పన్ను కట్టాల్సిరానుంది. అంటే రూ. 100 ఆదాయానికి రూ. 25,010 పన్ను భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిమితికన్నా ఆదాయం కాస్త ఎక్కువ ఉంటే, దానికి మించి పన్ను భారం ఉండరాదంటూ స్వల్ప ఊరటను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఎంత మేర అధిక ఆదాయానికి ఇది వర్తిస్తుందనేది ప్రభుత్వం నిర్దిష్టంగా వివరించలేదు. సుమారు రూ. 7,27,700 వరకు ఆదాయం ఉన్న వారికి దీనితో ప్రయోజనం ఉండగలదని నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత -
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
శతమానం భారతి: సరళీకరణ
ఆర్థికంగా పురోగమిస్తున్న భారత్ వ్యాపారాలను సరళీకృతం చేయడం ద్వారా అత్యున్నత భారత్‌గా శతవర్ష స్వాతంత్య్రం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యాపారానికి అవరోధంగా తయారైన చట్టాలు లేదా నిబంధనలు 2,875 దాకా ఉన్నాయని గుర్తించిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటిల్లో 2007 చట్టాలను, లేదా నిబంధనలు పూర్తిగా రద్దు చేసింది! అదేవిధంగా దీర్ఘకాలిక పరిష్కార అన్వేషణలో భాగంగా 20 వేల వరకు అనవసర ప్రక్రిల తొలగింపునకు వినూత్న చర్యలు తీసుకుంది. వ్యాపారాలలోకి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పెట్టుబడిదారుల కోసం ఏక గవాక్ష అనుమతుల విధానం ప్రవేశపెట్టింది. వ్యాపారానికి అవసరమైన ఆమోద, అనుమతుల సంఖ్య 14 నుంచి 3కు తగ్గించింది! వ్యాపార ఆర్థిక సంస్కరణల విషయానికి వస్తే జి.ఎస్.టి. అమలు భారత్ సాధించిన పెద్ద ముందడుగు. ఒకప్పుడు వస్తువు ఒకటే అయినా దాని ధర రాష్ట్రానికో రకంగా మారిపోయేది! ఐదేళ్ల క్రిందట జి.ఎస్.టి. అమలులోకి రావడంతో దేశం ఏకీకృత పన్ను విధానంలోకి పాదం మోపింది. ‘ఆక్ట్రాయ్’, ‘నాకా’ల రద్దుతో వ్యాపారులకు పన్ను పత్రాల దాఖలు సులభమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపైన కూడా ప్రభుత్వం నిబంధనలను గణనీయంగా సంస్కరించింది. వాణిజ్య సౌలభ్యం విషయంలో 2014 నాటికి 142వ స్థానంలో ఉన్న భారతదేశం 2020 నాటికల్లా 63వ స్థానానికి దూసుకెళ్లింది. ఇదే దూకుడును ఇకముందు మరింతగా కొనసాగించాలని ఈ అమృతోత్సవాల సందర్భంగా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. చదవండి: ఇండియా@75: భారత్‌కు తొలి మహిళా రాష్ట్రపతి -
పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తెచ్చాం
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం పన్ను సంస్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. పన్ను వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా డిజిటల్ మార్గంలో వాటి పరిష్కారం, అలాగే పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు కేంద్రం సాధించిన విజయాలని అన్నారు. పన్నుల విభాగం ‘టెర్రరిజం నుంచి ట్రాన్స్పరెన్సీ’కి మారినట్లు మోదీ అభివర్ణించారు. కోల్‌కతాల్లో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► పన్ను చెల్లింపుదారు–వసూలుదారు మధ్య విశ్వాస రాహిత్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నించింది. పన్ను నిబంధనలు, నిర్వహణా వ్యవహారాలను సులభతరం చేసింది. ► కార్పొరేట్ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది. సత్వర వృద్ధి, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం సృష్టి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కంపెనీలు ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతాయి. కొత్త తయారీ సంస్థలకు పన్నులు 15% వరకూ తగ్గించాలన్న నిర్ణయం స్వావలంబన దిశగా దేశాన్ని నడిపిస్తుంది. ► వివాదాస్పద పన్ను మొత్తం అధికంగా ఉంటేనే అప్పీల్స్‌కు వెళ్లాలన్న సూచనలను కేంద్రం చేస్తోంది. ఐటీఏటీ అలాగే సుప్రీంకోర్టుల్లో పన్నుల శాఖ అప్పీల్ ఫైల్ చేయడానికి కనీస వివాదాస్పద పన్ను మొత్తాలను వరుసగా రూ.50 లక్షలు, రూ.2 కోట్లకు పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ► డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును తొలగించింది.ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగాలన్నదే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఇక రిఫండ్స్ సత్వరం జరిగేలా చూస్తోంది. కేవలం కొద్ది వారాల్లోనే రిఫండ్స్ జరుగుతున్నాయి. మొత్తం పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సరళతను తీసుకువచ్చింది. ► గత ప్రభుత్వాల కాలంలో పన్నుల వ్యవస్థ అంటే భయంకలిగే పరిస్థితి ఉండేది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులూ వచ్చేవి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు దారుడు మధ్య ‘దోపిడీదారు–దోపిడీకి గురయ్యేవాడు’ తరహా పరిస్థితిని తొలగించడానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దగా ప్రయత్నం జరగలేదు. అయితే ఈ వ్యవస్థను మనం పూర్తిగా తొలగించగలిగాం. వ్యవస్థను పారదర్శకతలోకి నడిపించాము. ఇప్పుడు పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తోంది. ► నియమ నిబంధనలను సంస్కరించి సరళతరం చేయడంతోపాటు, సాంకేతికత వినియోగంలో ముందడుగు మంచి ఫలితాలను అందిస్తోంది. ► పన్ను పాలనా యంత్రాంగం ధోరణి పూర్తిగా పాదర్శకతలోకి మార్చాలన్న ప్రధాన ధ్యేయంతో కేంద్రం పనిచేస్తోంది. ► రూ.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు దిగువ మధ్య తరగతి యువతకు ఎంతో ప్రయోజనం కల్పిస్తోంది. ► కేంద్రం తీసుకున్న పలు పన్ను సంబంధ నిర్ణయాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరం అవుతోంది. పలు సంస్థలకు న్యాయపరమైన అవరోధాలు ఎదురుకావడం లేదు. ► పన్ను వసూళ్ల విషయంలో సామాన్యుడు ఎటువంటి వేధింపులకూ గురికాకూడదన్న విషయాన్ని పన్నుల అధికారులు గుర్తుంచుకోవాలి. అలాగే వసూలయిన పన్ను మొత్తాలు పూర్తిగా వినియోమవుతున్నాయన్న అభిప్రాయాన్ని పన్ను చెల్లింపుదారుడు కలిగి ఉండేలా చర్యలు ఉండాలి. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు క్రోడీకరించిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు అధి కారి మధ్య పరస్పన విశ్వాసం, పారద్శకతను పెంపొందించడంలో ఇది కీలకం. సంపద సృష్టి కర్తలు ఎప్పుడూ గౌరవం పొందాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. వారి సమస్యల పరిష్కారం ఆర్థిక పురోగతికీ దోహదపడుతుంది. ► ఇప్పుడు 99.75% ఆదాయప పన్ను రిటర్న్స్ అవరోధం లేకుండా ఆమోదం పొందుతున్నాయి. తన పన్ను చెల్లింపుదారులపట్ల ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. కేవలం 0.25% కేసుల్లో మాత్రమే పరిశీలన జరుగుతోంది. ► పలు పన్ను విభాగాల్లో క్లిష్టతను జీఎస్టీ తగ్గించింది. పలు రంగాల్లో పన్ను రేట్లను తగ్గించడానికి ఈ విధానం దోహదపడింది. -
పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ
-
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి లబ్ధి : మోదీ
సాక్షి, ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టంబర్ 25 నుంచి ఫేస్‌లెస్ అప్పీల్ సేవలను ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు. -
పన్ను అరాచకత్వం అంతం
-
పన్ను అరాచకత్వం అంతం
జీఎస్టీ ఆమోదం ప్రజాస్వామ్య విజయం ♦ అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట ♦ జీఎస్టీ బిల్లుపై చర్చలో మోదీ ♦ బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం ♦ సభలోని 443 మంది అనుకూలంగా ఓటు ♦ అన్నాడీఎంకే వాకౌట్ న్యూఢిల్లీ: ఎంతోకాలంగా వేచిచూస్తోన్న జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఎట్టకేలకు సోమవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్‌సభలో 6 గంటల చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతవారం రాజ్యసభలో చేసిన మార్పులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఓటింగ్ సమయంలో సభలో ఉన్న 443 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా అన్నాడీఎంకే సభ్యులు మాత్రం వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. చర్చలో ప్రధాని మాట్లాడుతూ... ‘పన్ను అరాచకం నుంచి విముక్తి దిశగా ఆగస్టు 8 వ తేదీ చరిత్రలో నిలుస్తుంది. స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి 1942లో ఇదే రోజున మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. అధిక పన్ను వసూలుతో పాటు అవినీతి, నల్లధనాన్ని అంతం చేయడంలో జీఎస్టీ కీలకమైన ముందడుగు. పరోక్ష పన్ను విధానంలోని నూతన శకంలో ఇక వినియోగదారుడే రాజు’ అని మోదీ అభివర్ణించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఏ ఒక్క పార్టీ, ప్రభుత్వం విజయం కాదని, ప్రతి ఒక్కరి గెలుపని, ప్రజాస్వామ్య స్ఫూర్తి విజయమని కొనియాడారు. వెనకబడ్డ రాష్ట్రాలకు లబ్ధి ‘జీఎస్టీతో 7 నుంచి 13 పన్నులు రద్దవుతాయి. వర్తకులు సరైన బిల్లులు ఇవ్వాల్సి ఉండడంతో అవినీతి అంతానికి ఉపయోగపడుతుంది. చిన్న వర్తకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరడం వల్ల ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. ఏవైతే వెన కబడ్డ రాష్ట్రాలు ఉన్నాయో వాటికి జీఎస్టీ బిల్లుతో ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధిలో అసమతుల్యతకు పరిష్కారం చూపిస్తుంది. ఉత్పత్తి రాష్ట్రాలు బిల్లుతో నష్టపోయినా, కేంద్రం పరిహారం చెల్లిస్తుంది. రాజకీయాల కంటే జాతీయ విధానమే విజయం సాధించింది. అన్ని రాజకీయ పార్టీలకు, వివిధ పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. లోక్‌సభ, రాజ్యసభ, 29 రాష్ట్రాలు, వాటి ప్రతినిధులు, 90 రాజకీయ పార్టీలతో సంప్రదింపుల అనంతరం మనం ఈ స్థితికి చేరుకున్నాం. తుది నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తున్నాం. కొత్త పన్ను విధానానికి మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకుంటున్నాం’ అంటూ ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీకి కొత్త నిర్వచనమిస్తూ... ‘గ్రేట్ స్టెప్ బై టీమిండియా, గ్రేట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్స్పరెన్సీ’గా అభివర్ణించారు. బిల్లు ఆమోదంలో అందరి సమష్టి కృషి జీఎస్టీ బిల్లు తమ ఆలోచనే అన్న కాంగ్రెస్ వాదనపై మాట్లాడుతూ... అన్ని రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వాల పాత్ర ఈ బిల్లు ఆమోదంలో ఉందన్నారు. ‘ఎవరో జన్మనిస్తారు. మరెవరో ఆలనాపాలనా చూస్తారు... కృష్ణుడికి ఎవరు జన్మనిచ్చారు. ఎవరు పెంచారు?’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బిల్లును ఎందుకు వ్యతిరేకించారన్న కాంగ్రెస్ ప్రశ్నకు స్పందిస్తూ... ‘ఆ సమయంలో జీఎస్టీపై అనేక ఆందోళనలు ఉండేవి. అందుకే అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని పలుమార్లు కలిశాను. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం జీఎస్టీపై ఆందోళనల్ని పరిష్కరించడంలో సాయపడింది, లోపాల్ని తొలగించడానికి కూడా ఉపయోగపడింది’ అంటూ సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం కీలకం నష్టాల్ని కేంద్రం చెల్లిస్తుందన్న అంశంలో రాష్ట్రాలకున్న ఆందోళనల నేపథ్యంలో నమ్మకం పెంపొందించాల్సిన అవసరముందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అంకెలపైనే ఆధారపడి ఉండదు. ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపైనా ముందుకు సాగుతుంది. అంకెల కారణంగా రాజ్యసభలో బిల్లుపై ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది ఏకాభిప్రాయంతో కూడిన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి’ అని సూచించారు. పేద ప్రజలపై జీఎస్టీ ప్రభావంపై మాట్లాడుతూ... ‘పేద ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు, మందులతో సహా కొత్త పన్ను పరిధి వెలుపలే ఉంటాయి’ అని చెప్పారు. ‘చిన్న వర్తకులు లబ్ధి పొందుతారు, చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు జీఎస్టీ భద్రత కల్పిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపిస్తుంది. బిల్లు ఆమోదం అనంతరం మోదీ... విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని దేవగౌడ వద్దకు వెళ్లి కరచాలనం చేసి వారితో మాట్లాడారు. ద్రవ్యోల్బణంపై అప్రమత్తంగా ఉండాలి: కాంగ్రెస్ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ తరఫున వీరప్పమొయిలీ ప్రసంగిస్తూ... జీఎస్టీ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం ఉండి ఉంటే ఇంకా ముందుగానే ఆమోదం పొందేదన్నారు. బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, అయితే ద్రవ్యోల్బణంపై జీఎస్టీ ప్రభావం గురించి లోతుగా అధ్యయనం చేయాలని మొయిలీ హెచ్చరించారు. జీఎస్టీతో ఉత్పత్తి రాష్ట్రమైన తమిళనాడు నష్టపోతుందని ఆ పార్టీ ఎంపీ పి.వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాల ఆదాయాల్ని పరిరక్షిస్తూ పన్ను రేట్లు తక్కువ ఉండేలా చూడాలన్నారు. బిల్లుపై చర్చలో తథాగత సత్తపతి(బీజేడీ), ఆనందరావ్ అద్సల్(శివసేన), పి.కరుణాకరణ్(సీపీఎం), తారిఖ్ అన్వర్(ఎన్సీపీ), ధర్మేంద్ర యాదవ్(ఎస్పీ), ప్రేమ్ సింగ్ చండూమజ్రా(శిరోమణి అకాళీదళ్), ప్రకాశ్ నారాయణ్ యాదవ్(ఆర్జేడీ), సిరాజుద్దీన్ అజ్మల్(ఏఐయూడీఎఫ్)లు మాట్లాడారు. జీఎస్టీ బిల్లు ఆమోదం దేశానికి శుభ పరిణామమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ వెలుపల పేర్కొన్నారు. జీఎస్టీలో విలీనమయ్యే పన్నులు న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక పన్నులు రద్దు కానున్నాయి. చాలా పన్నులు జీఎస్టీలో కలిసిపోనున్నాయి. రాష్ట్రాల ఆందోళనల్ని పరిష్కరిస్తాం: జైట్లీ వస్తు, సేవా పన్ను అమలుతో పన్ను ఎగవేత తగ్గుతుందని, దేశమంతా ఒకే పన్ను అమలుతో వ్యాపార నిర్వహణ సులభవుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మార్పులు చేసిన జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ..‘వస్తు రవాణా, సేవల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీఎస్టీ దోహదపడుతుంది. రాష్ట్రాల ఆందోళనల్ని కేంద్ర పరిష్కరిస్తుంది’ అని తెలిపారు. ‘పన్ను రేటును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు పన్ను అధికార పరిధి విషయంలో ఉమ్మడిగా సాగుతాయి. ఉమ్మడి పరిధికి లోబడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. కేంద్ర , రాష్ట్రాలకు సరాసరి పన్ను ఆదాయం పెరుగుతుంది. జీఎస్టీ బిల్లును రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాక, మరో మూడు చట్టాలు సీజీఎస్టీ(కేంద్ర), ఐజీఎస్టీ(అంతరాష్ట్ర), ఎస్జీఎస్టీ(రాష్ట్ర)ల్ని జీఎస్టీ కౌన్సిల్ రూపొందిస్తుంది. సీజీఎస్టీ, ఐజీఎస్టీల్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉండగా, రాష్ట్రాలు ఎస్జీఎస్టీని ఆమోదిస్తాయి. అదే సమయంలో జీఎస్టీ అమలు కోసం విధివిధానాల్ని రూపొందించే పనిని జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తుంది’ అని జైట్లీ చెప్పారు. జీఎస్టీ బిల్లు 2011లో రాష్ట్రాలకు పరిహారాన్ని పేర్కొనలేదని, పరిహారాన్ని మూడేళ్ల పాటు మొత్తం ఇచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రాథమికంగా ప్రతిపాదించడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించిందని జైట్లీ గుర్తుచేశారు. ‘ఏకాభిప్రాయంతో కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుదని 2011 బిల్లులో పేర్కొన్నా... ఏకాభిప్రాయం అంటే ఏమిటో అందులో చెప్పలేదు. స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు నాల్గింట మూడొంతుల మెజార్టీతో కౌన్సిల్ ప్రతి నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించాం. రాష్ట్రాలు మూడింట రెండొంతుల ఓటింగ్ హక్కుల్ని, కేంద్రం మూడింట ఒక వంతు ఓటుహక్కును కలిగి ఉంటుంది’ అని అన్నారు. -
లోక్‌సభలోనూ జీఎస్టీ బిల్లుకు జేజేలు!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. లోక్‌సభలో మొత్తం 429 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవలే రాజ్యసభ కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఒకేవిధంగా పన్నుశాతం ఉంటుంది. దేశమంతా ఒకే మార్కెట్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతోపాట దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. -
ఇక పన్ను సంస్కరణలపై దృష్టి...
చకచకా విధాన నిర్ణయాలు * ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆవిష్కరించిన జైట్లీ న్యూఢిల్లీ: పన్ను సంస్కరణలు, సత్వర నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి ఈ అంశాలు దోహదపడతాయని కూడా అన్నారు. ఫిబ్రవరి 28న లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పన్నుల శాఖ అధికారులకు రాష్ట్రపతి ప్రశంసాపూర్వక జ్ఞాపికలను ఆర్థికమంత్రి అందజేశారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు... * పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు గౌరవప్రదంగా వ్యవహరించాలి. అయితే పన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులను, ఎగవేతలను మాత్రం వదిలేయకూడదు. * పాలసీ నిర్ణయాల్లో స్థిరత్వ సాధనకు కృషి చేస్తాం. ఈ బాటలో పన్నులు, పాలనా వ్యవస్థల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తాం. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు (ప్రభుత్వానికి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం- చేసే వ్యయానికి మధ్య వ్యత్యాసం) 4.1% మించి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటాం. * గత వారం రోజులుగా నేను గమనించిన ముఖ్యమైన అంశమేమిటంటే... ఇతర పలుదేశాలతో పోల్చితే భారత్ పలు స్థూల ఆర్థిక అంశాల్లో చక్కటి పురోగతి సాధిస్తోంది. * దేశ విదేశీ మారక నిల్వలు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పరిస్థితి ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. * అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పోల్చితే మన దేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. * డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట ధోరణిలో కొనసాగుతోంది. ఈ విషయంలో పలు ప్రపంచ దేశాలను చూసినా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. తయారీ రంగం కీలకం: డీఐపీపీ ఉపాధి కల్పన, వృద్ధి స్పీడ్‌కు తయారీ రంగం కీలకమని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక శాఖ (డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి కల్పన సవాలును ఎదుర్కొనడంలో రోజుకు 33,000 ఉపాధి అవకాశాల సృష్టి జరగాల్సి ఉందని, ఇదొక సవాలని అన్నారు. ఈ బాటలో దేశానికి ప్రస్తుతం వేలకొద్ది ఫ్లిప్‌కార్ట్‌లు, స్నాప్డీల్స్, అంతే స్థాయిలో యువ పారిశ్రామిక వేత్తల అవసరం ఉందని అన్నారు.