Tech Mahindra CEO
-
7 బిలియన్ డాలర్లకు ఆదాయం
బార్సిలోనా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో 7 బిలియన్ డాలర్ల ఆదాయం(రన్ రేటు)ను అందుకోగలమని ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తాజాగా అభిప్రాయపడ్డారు. దీనిలో టెలికం విభాగం నుంచి 3 బిలియన్ డాలర్లు సమకూరగలదని అంచనా వేశారు. టెలికం కంపెనీలకు అందించే 5జీ సొల్యూషన్ల నుంచి ఇప్పటికే బిలియన్ డాలర్ల(రూ. 8,300 కోట్లు) రన్ రేటును సాధించినట్లు వెల్లడించారు. 6.6 బిలియన్ డాలర్ల రన్ రేటును అందుకున్న తాము త్వరలోనే 7 బిలియన్ డాలర్ల(సుమారురూ. 58,000 కోట్లు)కు చేరుకోగలమని తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్న 2023 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా గుర్నానీ ఈ వివరాలు వెల్లడించారు. లాభం డౌన్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. అయితే ఆదాయం మాత్రం 20 శాతం ఎగసి రూ. 13,735 కోట్లకు చేరింది. అమెరికా ప్రాంతాల నుంచే ఆదాయంలో 50 శాతం లభిస్తున్నట్లు కంపెనీ సీఎంఈ బిజినెస్ ప్రెసిడెంట్, నెట్వర్క్ సర్వీసుల సీఈవో మనీష్ వ్యాస్ తెలియజేశారు. యూరప్ నుంచి 30 శాతం, మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 20 శాతం చొప్పున టర్నోవర్ నమోదవుతున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాలలో పెట్టుబడులు చేపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఫైబర్, ఫిక్స్డ్ వైర్లెస్.. తదితర టెలికం సంబంధ అన్ని విభాగాలలోనూ వృద్ధి నమోదుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితికి కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. -
టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు
దావోస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. విద్యారంగంలో పెట్టుబడులు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్ ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు. విశాఖ కేంద్రంగా ఐటీ దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీతో సీఎం సమావేశం అయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్ మహీంద్రా చైర్మన్ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు అదే విధంగా ఆర్టిఫియల్ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు. మరింత మంది ప్రముఖులతో దావోస్‌లో జరుగుతున్న సమావేశాల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సదస్సు రెండో రోజు సీఎం పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అదే విధంగా హీరోమోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ పవన్ ముంజల్‌తోనూ జగన్ సమావేశం కానున్నారు. చివరగా ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. ఇంకా మరింత మంది ప్రముఖులనూ ఆయన కలిసే అవకాశం ఉంది. చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే?
ముంబై: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఈ కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ. త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్ మహీంద్రా ఉద్యోగులకు 10 శాతం వేతనాలు పెంచుతున్నాట్టు ప్రకటించారు. ‘‘సరఫరా వైపు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చాం. సగటున ఒక్కో ఉద్యోగికి వేతన పెంపు 10 శాతం మేర ఉంటుంది’’అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. టెక్ మహీంద్రా లాభం భేష్ ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసికానికి పనితీరు పరంగా అంచనాలకు అందుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.1,506 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం నుంచి) చూసినా నికర లాభం 10 శాతం వృద్ధిని చూపించింది. విశ్లేషకుల అంచనా రూ.1,411 కోట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం వృద్ధితో రూ.12,116 కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)తో పోల్చి చూసినా ఆదాయంలో 5.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి త్రైమాసికంలో ఎస్ఈజెడ్ సంబంధిత కేటాయింపులు తిరిగి రావడం కూడా లాభాల్లో వృద్ధికి సాయపడిన అంశాల్లో ఒకటి. 2021–22 ఏడాదికి ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌గా రూ.15 ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘‘ఆవిష్కరణలపై దృష్టి సారించడం, బలమైన కస్టమర్, భాగస్వామ్య ఎకోసిస్టమ్ ఏర్పాటులో మాకున్న సామర్థ్యాలు పటిష్ట వృద్ధికి దోహదపడినట్టు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. విభాగాల వారీగా.. - ఎంటర్ప్రైజ్ వెర్టికల్ ఆదాయం 5.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కమ్యూనికేషన్ విభాగం స్థిరమైన కరెన్సీ పరంగా 4.8 శాతం వృద్ధి చూపించింది. - బీఎఫ్ఎస్ఐ విభాగం మొత్తం ఆదాయం 15.4 శాతం మేర క్రితం త్రైమాసికంలో ఉంటే, అది మార్చి చివరికి 17.4 శాతానికి విస్తరించింది. - బ్రెడ్ అండ్ బటర్ కమ్యూనికేషన్స్, తయారీ విభాగాల ఆదాయం సీక్వెన్షియల్‌గా క్షీణతను చూశాయి. డీల్స్ జోరు... మార్చి త్రైమాసికంలో బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అతిపెద్ద డీల్‌ను టెక్ మహీంద్రా గెలుచుకుంది. 2021–22 మొత్తం మీద 3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సొంతం చేసుకుంది. యూరోప్‌లో ఒక 5జీ ఆపరేటర్ నుంచి, రిటైల్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి డీల్స్ వచ్చాయి. ‘‘సుస్థిర డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, నూతనతరం టెక్నాలజీపై పెట్టుబడులు కలసి గణనీయమైన వృద్ధికి తోడ్పడడమే కాకుండా.. గత ఏడేళ్లలోనే అతిపెద్ద డీల్ గెలుచుకోవడం సాధ్యపడింది’’అని గుర్నానీ తెలిపారు. కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్, మెటావర్స్ విభాగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని చూపిస్తాయన్నారు. నిర్వహణ మార్జిన్ డౌన్ ఆపరేటింగ్ మార్జిన్ 2021 డిసెంబర్ త్రైమాసికంలో 14.8% ఉంటే, మార్చి త్రైమాసికంలో 13.2 శాతానికి తగ్గిపోయింది. అధిక వేతనాలు, ఉద్యోగులను కాపాడుకునేందుకు చేసిన వ్యయాలు మార్జిన్లపై ప్రభాం చూపించినట్టు కంపెనీ తెలిపింది. 2021–22 సంవత్సరానికి.. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.44,646 కోట్లకు చేరింది. నికర లాభం కూడా 26 శాతం పుంజుకుని రూ.5,566 కోట్లుగా నమోదైంది. చదవండి: సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్ -
టెక్ మహీంద్రా లాభం హైజంప్
ముంబై: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం ఎగసి రూ. 1,081 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 804 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పం గా 2.5 శాతం పుంజుకుని రూ. 9,730 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తిఏడాదికి నికర లాభం 10 శాతం పురోగమించి రూ. 4,428 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 2.7 శాతం వృద్ధితో రూ. 37,855 కోట్లయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం రెండంకెల స్థాయిలో పుంజుకునే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఆగస్ట్ 11న డివిడెండ్... టెక్ మహీంద్రా బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండును సిఫారసు చేసింది. దీనిలో రూ. 15 ప్రత్యేక డివిడెండు కలసి ఉంది. ఆగస్ట్ 11కల్లా డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో కలిపి గతేడాదికి కంపెనీ మొత్తం రూ. 45 డివిడెండును చెల్లించినట్లవుతుంది. క్యూ4లో 847 మంది ఉద్యోగులు వైదొలగడంతో 2021 మార్చికల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 1,21,054కు పరిమితమైంది. ఈ ఏప్రిల్ నుంచీ ఉద్యోగులకు వేతన పెంపును చేపడుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి వెల్లడించారు. గతేడాది మార్జిన్లు 2.6 శాతం బలపడి 18.1 శాతానికి చేరటంతోపాటు.. క్యాష్‌ఫ్లో మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఒక ఆసుపత్రితో ఒప్పందం ద్వారా నోయిడాలోని క్యాంపస్‌లో 50 పడకల కోవిడ్ కేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో గుర్నానీ వెల్లడించారు. బీపీఎస్‌లో పట్టు కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసులందించే యూఎస్ కంపెనీ ఎవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్‌ను సొంతం చేసుకున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ఈ కొనుగోలుతో కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలియజేసింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్(బీపీఎస్) విభాగంలో మరింత సమర్థవంత సేవలందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు ఎన్ఎస్ఈలో 2% ఎగసి రూ. 970 వద్ద ముగిసింది. అత్యున్నత సాంకేతికతలపై ప్రత్యేక దృష్టితో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. దీంతో క్యూ4లో భారీ డీల్స్ దక్కాయి. ఇవి రెట్టింపునకు ఎగసి 100 కోట్ల డాలర్లకు చేరాయి. ఇకపై వృద్ధి బాటలో సాగనున్నాం. ఐటీ సేవలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వచ్చే రెండు త్రైమాసికాలలో 8–10% మేర ఉద్యోగ కల్పన చేపట్టనున్నాం. 5జీ, క్లౌడ్ తదితర విభాగాలలో అధిక వృద్ధికి వీలుంది. – సీపీ గుర్నానీ, టెక్ మహీంద్రా సీఈవో -
ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు
కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో అమలవుతున్న లాక్డౌన్ మే 3వ తేదితో పూర్తి అవుతున్న నేపథ్యంలో అసలు లాక్డౌన్ ఎత్తివేస్తారా లేదా కొనసాగిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది. అయితే మే3 తర్వత లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తే ఐటీ కంపెనీలు తిరిగి తెరుచుకోడానికి సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంపై ప్రభుత్వ ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తూ. కంపెనీలు పునఃప్రారంభించాలని యోచిస్తున్నాయి. అంతేగాక కోవిడ్-19ను అరికట్టడానికి కొత్తగా తమ సొంత నిబంధనలను కూడా తీసుకురాబోతున్నాయి. (లాక్డౌన్ కొనసాగింపునకే మోదీ మొగ్గు..! ) ఇక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి పనిచేయడానికి అనుమతించే క్రమంలో చాలా వరకు సంస్థలు భౌతిక దూరం కొనసాగించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యాలయాలు ఎలా సిద్ధమవుతున్నాయో తెలియజేయడానికి టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గున్నాని ట్విటర్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వీటిలో ఆఫీస్ ముఖద్వారాలు, లిఫ్ట్‌లు, బాత్రూమ్ల వద్ద గీసిన మార్కులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అదే విధంగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా తమ కార్యాలయాల్లో అనుసరిస్తున్న భౌతిక దూర నిబంధనలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి! ) Our offices across @tech_mahindra are getting ready for physical distancing post #Lockdown. Welcome to the new normal.. pic.twitter.com/5V6wZz2OOO — CP Gurnani (@C_P_Gurnani) April 20, 2020 మే 3 తర్వాత లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేసిన తర్వాత బహుళ జాతీయ సంస్థలు మాత్రమే కాకుండా చిన్న ఐటి కంపెనీలు కూడా ఈ చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. టెంపరేచర్ స్క్రీనింగ్ లాంటి సాధారణ జాగ్రత్త చర్యలే కాకండా.. శానిటైజర్లను డెస్క్‌లపై ఉంచడం, ఉద్యోగుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత వంటి ముందు జాగ్రత్త చర్యలపై కసరత్తు చేస్తునఆనయి. కాగా భౌతిక దూరంపై హైదరాబాద్‌లోని కొన్ని ఐటి కంపెనీలు అనుసరిస్తున్న కొత్త నిబంధనలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ యేదుల పేర్కొన్నారు. అవి ► కార్యాలయ ప్రవేశ ద్వారం, యాక్సెస్ కార్డ్ స్క్రీనింగ్ వద్ద రెండు అడుగుల దూరం పాటించడం. ► లిఫ్టులో కేవలం 50శాతం మాత్రమే అనుమతించడం. ► క్యాబ్‌కు ఒక వ్యక్తి మాత్రమే అనుమతించడం....... అయితే లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ప్రభుత్వం జారీచేసే నిబంధనలపై కంపెనీలు ఆధారపడి పనిచేయాల్సి ఉంటుందని కృష్ణ యేదుల పేర్కొన్నారు. (ఆ దేశంలో భారతీయుల మరణాలు ఎక్కువ! ) -
టెక్ మహింద్రా సీఈవోకి భారీ వేతనం
ముంబై: ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టెక్ కంపెలన్నీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ వేతనాల పెంపు వాయిదా వేసిన కంపెనీలో టెక్‌మహింద్రా కూడా ఒకటి. వేతనపెంపుకు ఆశపడే టెక్ మహింద్రా ఉద్యోగులు మరో రెండు నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న సీపీ గుర్నాని వేతన ప్యాకేజీ వివరాలు బహిర్గతమయ్యాయి. గత మూడేళ్లలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలతో పోల్చుకుంటే గుర్నానికే భారీ వేతనాలు అందినట్టు తెలిసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరిస్తున్న గుర్నాని రూ.150.7 కోట్ల పారితోషికాలను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థికసంవత్సరంలో కూడా టాప్-3 కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సీఈవోల కంటే కూడా అత్యధికంగా గుర్నాని, పరిహారాలు పొందినట్టు వీసీసర్కిల్ రిపోర్టు నివేదించింది. పబ్లిక్ కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు పొందే ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను ఇది రిపోర్టు చేస్తుంది. గుర్నాని పారితోషికాల్లో రూ.147.17 కోట్లు స్టాక్ ఆప్షన్ల నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఆయన వేతనం, ప్రావిడెంట్‌కు ఆయన అందించే సహకారం మొత్తం కలిపి కేవలం రూ.2.56కోట్లేనట. కాగ, టీసీఎస్ మాజీ సీఈవో, ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పారితోషికాలు రూ.30.15 కోట్లకు పెరుగగా, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా వేతనం స్వల్పంగా తగ్గి రూ.45.11 కోట్లగా ఉంది. విప్రో చీఫ్‌కు వేతనాలు పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.