Technical Technology
-
ఆ జీవకళ వెనుక అసలు రహస్యం
మహానేతల భౌతికకాయాలను భద్రపరచడంలో మాస్కో వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోంది. ఇల్విచ్ ఉల్వనోవ్ వ్లాదిమిర్ లెనిన్ భౌతికకాయాన్ని అనేక కష్టనష్టాలకోర్చి అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి మాస్కోలో భద్రపరిచారు. తొలిసారిగా కమ్యూనిస్టు మహానేత లెనిన్ భౌతికకాయాన్ని ప్రజాసందర్శనార్థం 1924లో లెనిన్ ల్యాబ్‌లో ఉంచారు. లెనిన్ భౌతికకాయాన్ని అత్యంత భద్రంగా జీవత్వం ఉట్టిపడేలా ఉంచడంలో రష్యన్ సాంకేతిక నిపుణుల కృషి గణనీయమైంది. ఆ వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోందని తాజా అధ్యయనం పేర్కొంది. కిమ్ జాంగ్ ఉన్ నాన్న, తాత సహా ఉత్తరకొరియాను పాలించిన ముగ్గురు ప్రముఖుల భౌతికకాయాలను ప్యాంగ్యాంగ్లోని కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ సన్ మాన్యుమెంట్‌లో ఉంచారు. అయితే వీరి భౌతిక కాయాలను సుదీర్ఘకాలం పాడవకుండా ఉంచడానికి మాత్రం లెనిన్ భౌతికకాయాన్ని ఇంతకాలం భద్రపరుస్తున్న రష్యన్ నిపుణుల సాయంతోనే సాధ్యమవుతోందని అధ్యయనకారులు వెల్లడించారు. అందిపుచ్చుకున్న సాంకేతికత.. సోవియట్ యూనియన్ పతనానంతరం రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వియత్నాం, నార్త్ కొరియా అందిపుచ్చుకున్నాయి. తొలిసారి చేసిన ఎంబాల్మింగ్, ఆ తర్వాత ప్రతిసారీ తిరిగి చేసే రీఎంబాల్మింగ్ను కూడా మాస్కో ల్యాబ్‌కు చెందిన నిపుణులే నిర్వహిస్తున్నారని అధ్యయనకారుడు బెర్క్లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ యార్‌చాక్ వెల్లడించారు. రష్యా నిపుణుల దగ్గర ఉత్తరకొరియా, వియత్నాం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా శిక్షణ పొందుతున్నప్పటికీ మొత్తంగా ఎంబాల్మింగ్ రహస్యం మాత్రం వారికి అంతుచిక్కలేదు. విదేశాల నిధులతో... 1990లో సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రభుత్వం ల్యాబ్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో విదేశీసేవల ద్వారా నిధులు సమకూర్చుకున్నారని యార్‌చాక్ పేర్కొన్నారు. భౌతిక కాయాలను ఉంచిన మాన్యుమెంట్‌ను ఏటా 2 నెలల పాటు మూసి ఉంచుతారు. ఈ సమయంలోనే భౌతిక కాయాలను రష్యాకు చెందిన నిపుణులు రీఎంబాల్మింగ్ చేస్తున్నట్లు యార్‌చాక్ వెల్లడించారు. 2016లో లెనిన్ భౌతిక కాయానికి రీఎంబాల్మింగ్ చేసినప్పుడు దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు అయినట్లు మాస్కో వెల్లడించింది. -
సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి
సైలాడ (ఆమదాలవలస రూరల్) : సాంకేతిక పరిజ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని సైలాడ సర్పంచ్ జోగి చంద్రశేఖర్ అన్నారు. దీన్ని యువత గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. సైలాడ, కుమ్మరిపేట, దివంజిపేట గ్రామాల్లో పర్లాకిఖముండిలోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు డిజిటల్ లిటరసి పోగ్రాంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు, చదువుకున్న యువతకు, రైతులు, మహిళలకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యూనివర్సిటీ అవగాహన కల్పిస్తుందని వీటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరుగుతుందని వాటిపై అవగాహన ఉంటే ఇంట్లోనే అన్ని విధాలుగా పథకాల వివరాలు తెలుసుకునేందుకు వీలు పడుతుందని తెలిపారు. -
క్లౌడ్ కంప్యూటింగ్..
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు అందించే విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ‘క్లౌడ్ కంప్యూటింగ్’. దీన్ని ఉపయోగించుకుంటున్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థల సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగం విస్తృత ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్‌గా మారుతుంది. ఫ్రెషర్స్ మొదలు, అత్యున్నత అనుభవజ్ఞుల వరకు వివిధ స్థాయిల్లోని ఐటీ ఉద్యోగులు ‘క్లౌడ్’పై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్‌పై స్పెషల్ ఫోకస్.. ఐటీ సంస్థలు వివిధ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల సహాయంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో డేటా సమకూరుతుంది. దీని నిర్వహణ, స్టోరేజ్.. కంపెనీలకు ఆర్థిక భారంతో కూడుకుంది. దీనికి పరిష్కారంగా వచ్చిన టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్. భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్ పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా క్లౌడ్‌తో సేవలందించొచ్చు. కేవలం డేటా స్టోరేజ్‌కే పరిమితం కాకుండా.. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్‌లను కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తోంది. ఉదాహరణకు సాధారణంగా ప్రతి సంస్థలో ఒక్కో ఉద్యోగికి ఒక సిస్టమ్, అందులో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, డేటా ఉంటుంది. వీటిని కలుపుతూ సర్వర్లు ఉంటాయి. కానీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో డేటా, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు అన్నీ సర్వర్లలోనే ఉంటాయి. ఈ డేటాను యూజర్లు ఏ డివైజ్ నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్‌లో క్లయింట్స్‌కు అవసరమైన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని యూజర్లు ఇంటర్నెట్ ఆధారంగా యాక్సెస్ చేస్తూ డేటా స్టోర్ చేసుకుంటారు. యూజర్లు పొందుపర్చే డేటాను క్లయింట్స్ నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. అవకాశాలు అపారం క్లౌడ్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టాప్ 3 దేశాల్లో భారత్ ఒకటి. 75 లక్షలతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలతో అమెరికా, 22 లక్షలతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో భారీగా క్లౌడ్ ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2020 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ 241 బిలియన్ డాలర్ల మేర విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది. అదే స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగనున్నట్లు జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జాబ్ ప్రొఫైల్స్ సర్టిఫికేషన్ కోర్సులు లేదా ఐటీ కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ లో నైపుణ్యాలు పొందిన వారికి వివిధ జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ అనలిస్ట్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్లౌడ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్.. క్లౌడ్‌లో రాణించాలంటే.. క్లౌడ్ కంప్యూటింగ్‌లో రాణించేందుకు లైనక్స్, జావా, డాట్నెట్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, డేటా మేనేజ్మెంట్, డేటా మైనింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, బిగ్ డేటా, గకఠ్చీట్ఛ తదితర టెక్నాలజీలు ఉపయోగ పడతాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి అకడమిక్ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేనప్పటికీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకొని, సొంతంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తున్నాయి. సీడాక్, ఐఐఐటీ, జేఎన్టీయూ తదితర సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల కరిక్యులంలో క్లౌడ్‌ను చేర్చుతున్నాయి. కొన్ని ఐఐటీలు, ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్లౌడ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. క్లౌడ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, వివిధ సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నాయి. క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్ (సీసీసీ), ఈఎంసీ, వీఎంవేర్ ఇన్స్టిట్యూట్లు సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. -
ప్రజలు - ప్రభుత్వం మధ్య ‘ఆప్లే సర్కార్’
ముంబై: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్షమైన, సన్నిహితమైన సంబంధాలను నెలకొల్పేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారితమైన వేదికను ‘ఆప్లే సర్కార్’ పేరిట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేందుకు ఈ వెబ్సైట్ అవసరమైన పారదర్శకతను అందించగలదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో ఆప్లే సర్కార్‌ను ప్రధాన వెబ్ పోర్టల్‌గా రూపుదిద్దుతామని, సేవాహక్కు చట్టాన్ని కూడా దీనికి అనుసంధానం చేస్తామని తెలిపారు. సేవా హక్కు ముసాయిదా బిల్లును ప్రజల సూచనలు, అభిప్రాయాల కోసం అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్లే సర్కార్ వెబ్‌పోర్టల్ పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక కటాఫ్ తేదీని నిర్ణయిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ చెప్పారు. ఆప్లే సర్కార్ వెబ్‌సైట్‌కు వచ్చిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రాలయలోని ప్రభుత్వ విభాగాల పనితీరు, అవి అందించే సేవలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. ఇక రెండో దశలో జిల్లా, మున్సిపల్, తెహసిల్ స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలను దానిలో చేరుస్తామని అన్నారు. మహారాష్ట్రలో వ్యాపారంపై ప్రపంచ పెట్టుబడిదారుల ఆసక్తి సాక్షి, ముంబై: మన రాష్ట్రంలో సమాచార సాంకేతిక రంగం, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అన్నారు. ఐటీ, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్న 30 సమావేశాల్లో తాను పాల్గొన్నానని తెలిపారు. ఈ రంగాల్లో భాగస్వాములయ్యేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారని, మన రాష్ట్రం వారికి ఏమి ఇవ్వగలదో వివరించానని ఫడ్నవీస్ చెప్పారు. దావోస్ నుంచి సోమవారం ఇక్కడికి తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైనందునే నదుల క్రమబద్ధీకరణ జోన్ (ఆర్‌ఆర్‌జెడ్) విధానాన్ని రద్దు చేశారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఈ విషయంలో తాము కేంద్ర విధానాన్ని అనుసరిస్తామని అన్నారు. -
హుదూద్ పోర్టల్ సిద్ధం: పరకాల
విశాఖపట్నం:సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపానును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను నష్టాలను ఆన్లైన్లో పరిశీలించేందుకు హుదూద్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. www.hudhud.ap.gov.in వెబ్సైట్ ద్వారా తుపానుకు సంబంధించి ప్రజలు తమ సలహా లు, ఫిర్యాదులతో పాటు జరిగిన నష్టాన్ని ఫొటో తీసి పొందుపర్చవచ్చని, తద్వారా పరిహారాన్ని పొందవచ్చని సూచించారు. నష్టం అంచనాలు వేసే బృందాలకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందించినట్లు తెలిపారు. విశాఖలో 300, విజయనగరంలో 100, శ్రీకాకుళానికి 100 ట్యాబ్‌లను ఇచ్చామన్నారు. వీటిలో నష్టం వివరాలను నమోదు చేస్తే పోర్టల్ ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవచ్చన్నారు. సైట్ ద్వారా వివిధ పనుల మరమ్మతు సేవలను కూడా ఉచితంగా పొందవచ్చన్నారు. నిత్యావసరాలను కొంత మంది డీలర్లు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.