Tehasildar
-
AP: సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు..
సాక్షి, అమరావతి: ఏపీలో పలు సబ్‌రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ 14400 కాల్ సెంటర్, యాప్‌కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చెపట్టింది. బద్వేల్, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, తుని, నర్సాపురం, కందుకూరు, మేడికొండూరు, గుంటూరు, జలమూరు ఎమ్మార్వో ఆఫీసు, శ్రీకాకుళంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. -
యువ రైతులకు దొరకని కన్యలు
సాక్షి, బెంగళూరు: రైతు అనే కారణంతో ఎక్కడా పెళ్లి చేసుకునేందుకు వధువు దొరకడం లేదని యువ రైతులు తహసీల్దార్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసిన ఘటన ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా హొసళ్లి గ్రామంలో జరిగింది. రైతు దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతుకే పెళ్లి చేసుకోవడానికి కన్యలు దొరకని పరిస్థితి దాపురించిందని యువ రైతులు తహసీల్దార్ ఎదుట వాపోయారు. రైతుల ఇంటిలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఎండకు వానకు శ్రమించాల్సి వస్తుందని, పైగా వ్యవసాయం జూదంలా మారిందని రైతులకు తమ ఆడపిల్లలను ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో యువ రైతులు ఆడపిల్లలు దొరక్క ఎంతో ఆవేదన చెందుతున్నారని వారు తహసీల్దార్ గ్రామ బస వేళ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రంపై ఇప్పడు అందరి దృష్టి మళ్లింది. హొసళ్లి గ్రామంలో జరిగిన తహసీల్దార్ గ్రామ బస కార్యక్రమంలో యువ రైతులు దేశానికి అన్నం పెట్టడానికి రైతులు కావాలి, అలాంటి యువ రైతులకు కన్యను ఇవ్వడానికి జనం నిరాసక్తి చూపుతున్నారని, ఉద్యోగం ఉంటే పిల్లను ఇస్తామంటున్నారన్నారు. అలాంటప్పుడు రైతు పిల్లలు రైతులు కావాలా, వద్దా? అని నిలదీశారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి జనజాగృతి కార్యక్రమం చేపట్టాలని కుందగోళ తహసీల్దార్ అశోక్ శిగ్గాంవి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు. చదవండి: (Hyderabad-Constable: ఈశ్వర్ లీలలు ఎన్నెన్నో..!) -
వామ్మో ఖైరతా‘బాధ’.. నేనక్కడ పనిచేయను నాయనో!
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఖైరతాబాద్.. హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉండాలి..అందరికీ అందుబాటులో ఉండాలి..అందరికీ పనులు చేసిపెట్టాలి.. అయితే నిబంధనలు అనేవి ఉంటాయి కదా.. అధికారులు వాటినే ఫాలో అవుతారు.. అవి నాయకులకు పట్టవు కదా..ఇవి కొందరికి నచ్చకపోవచ్చు..దీంతో తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత బదిలీ అస్త్రం వారిపై ప్రయోగించడం జరిగిపోవడం మామూలే.. ఇదీ ఖైరతాబాద్ మండలంలో నిత్యం జరుగుతున్న తంతు. ► ఖైరతాబాద్ మండలంలో తహసీల్దార్లు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండానే బదిలీ అవుతున్నారు. వివిధ కారణాలతో బదిలీ అవుతుండటంతో మండల పరిధిలో పాలన అధ్వానంగా మారుతోంది. ► బదిలీల వెనుక కొందరి ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మండల పరిధిలో సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లు వస్తాయి. అ మండలాన్ని ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్ యూసూఫ్‌గూడ విలేజ్ల పేరుతో విభజించి పాలన అందిస్తున్నారు. ► 2011 నుంచి రికార్డులు తీసుకుంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది.కొందరైతే నెల రోజులకే బదిలీ అయ్యారు. ► ఇటీవల బదిలీ అయిన జుబేద అనే తహసిల్దార్ ఆ పదవిలో పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయారు. అంతకుముందు పని చేసిన తహసిల్దార్ హసీనా ఏడాది గడువు పూర్తి చేసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయ్యారు. ► దీంతో రెండు, మూడు నెలలకు, అయిదారు నెలలకు ఒకసారి తహసిల్దార్లు బదిలీలు ఎందుకు అవుతున్నారో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు కూడా తెలిసింది. పని ఒత్తిడి కూడా కారణమా..! ఖైరతాబాద్ మండల పరిధిలో ప్రముఖుల ఘాట్లు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డుతో పాటు ఎన్టీఆర్ మార్గ్, ఇతరత్రా వీవీఐపీ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల సందర్భంగా తహసీల్దార్లు నాలుగైదు రోజుల పాటు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పౌరుల సమస్యలతో పాటు అటు వీవీఐపీల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల ఓ తహసిల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆమె చేసిన నిర్వాకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లుగా తెలిసింది. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ బదిలీలు.. ► 2011 జనవరి 3న పి.లీల ఖైరతాబాద్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి అదే ఏడాది మే 28న బదిలీ అయ్యారు. ఆమె ఆ పదవిలో నాలుగు నెలలు కూడా ఉండలేదు. ► జె. శ్రీనివాస్ 2011 మే 29న బాధ్యతలు స్వీకరించగా రెండు నెలలు గడవకుండానే అదే ఏడాది జూలై 6వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. కృష్ణ జూలై 7న బాధ్యతలు స్వీకరించి 2012 జూలై 24న బదిలీ అయ్యారు. ► జె.శ్రీనివాస్ జూలై 25న బాధ్యతలు స్వీకరించి కేవలం ఒక్క రోజులోనే అంటే జూలై 26న బదిలీ అయ్యారు. ► వి. అనురాధ జూలై 27న బాధ్యతలు స్వీకరించగా 2013 జూన్ 6న బదిలీ అయ్యారు. ► సునీత 2013 జూన్ 7న బాధ్యతలు స్వీకరించి 20 రోజులు తిరగకముందే అదే ఏడాది 25వ తేదీన బదిలీ అయ్యారు. ►కె. వేణుగోపాల్‌రెడ్డి 2013 జూన్ 26న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరక్కుండానే ఆగస్టు 31న బదిలీ అయ్యారు. ► వంశీకృష్ణ 2013 సెప్టెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు తిరగకుండానే 2014 ఫిబ్రవరి 11వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. శ్రీనివాసరావు 2014 ఫిబ్రవరి 10వ తేదీన బాధ్యతలు స్వీకరించగా నాలుగు నెలలు తిరగకుండానే అదే ఏడాది జూన్ 3వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 2014 జూన్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించగా 2015 సెప్టెంబర్ 10న బదిలీ అయ్యారు. ఈయన ఒక్కరే ఏడాది కాలం పూర్తి చేసుకున్న తహసిల్దార్. ► టి.సైదులు 2015 సెప్టెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్ళ పాటు సేవలు అందించి 2018 ఆగస్టు 17వ తేదీన బదిలీ అయ్యారు. ► కె. జానకి 2018 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరగకుండానే 2018 అక్టోబర్ 16న బదిలీ అయ్యారు. ► పి. కృష్ణకుమారి 2018 అక్టోబర్ 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే 2019 జూన్ 16న బదిలీ అయ్యారు. ► హసీన 2019 జూన్ 19న బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుముందే 2020 నవంబర్ 3న బదిలీ అయ్యారు. ► జుబేదా 2020 నవంబర్ 4న బాధ్యతలు స్వీకరించి 2021 ఆగస్టు 1వ తేదీన బదిలీ అయ్యారు. ఆమె తొమ్మిది నెలలు మాత్రమే విధుల్లో ఉన్నారు. ► ప్రస్తుత అన్వర్ ఖైరతాబాద్ మండల తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. -
నిర్లక్ష్యానికి ఓటేశారు!
- ముందుకు సాగని ఓటర్ల ఆధార్‌తో అనుసంధానం - 30 రోజుల్లో 6.86శాతం మాత్రమే - పట్టనట్లు వ్యవహరిస్తున్న తహశీల్దార్లు, ఈఆర్ఓలు - మొత్తం ఓటర్లు 30,88,307 మంది - ఆధార్ సీడింగ్ చేసింది 26255 మాత్రమే - జిల్లాలో దాదాపు 3 లక్షల వరకు బోగస్ ఓటర్లు - నేడు ఆధార్ సీడింగ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయడంలో సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. గతనెల 1వ తేదీ నుంచి ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం మొదలైంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30,88,307 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి నుంచి ఎపిక్ కార్డుల నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది. దాదాపు నెల రోజులుగా ఆధార్ సీడింగ్ కార్యక్రమం జరుగుతున్నా ఇంత వరకు కేవలం 26255 (6.86శాతం) ఓటర్లను మాత్రమే ఆధార్ తో అనుసంధానం చేశారు. బీఎల్ఓలు 447785 మంది ఓటర్ల ఆధార్ నెంబర్లను వెరిఫై చేసినా సీడింగ్ మాత్రం నామమాత్రంగా ఉంది. మే నెల 15లోగా ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం పూర్తి చేయాల్సి ఉన్నా అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని మొత్తం ఓటర్లలో బోగస్ ఓటర్లు దాదాపు 3 లక్షల ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఒక వ్యక్తికి ఆధార్ నెంబర్ ఒక్కటే ఉంటుంది. ఆధార్ నెంబర్ ఒక్క ఎపిక్ కార్డుకే లింకప్ అవుతుంది. ఇందువల్ల ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేస్తే బోగస్ ఓటర్లు బయటపడే అవకాశం ఉన్నా... ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. మంత్రాలయం, కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, డోన్, పాణ్యం,ఆలూరు నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ మరింత దయనీయంగా ఉంది. కంప్యూటర్లు, ఆపరేటర్ల కొరతతో పురోగతి లేదనే అభిపాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో పురోగతి లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈఓ ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఆధార్ సీడింగ్ ఇలా చేసుకోవచ్చు ఓటర్లు సెల్ఫ్ సీడింగ్ చేసుకోవచ్చు. ఎపిక్ నెంబర్, ఆధార్ నెంబర్లను ఎస్ఎంఎస్ చేయవచ్చు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఈ నెంబర్లు చెప్పవచ్చు. ఎవరికి వారు వివిధ మార్గాల్లో సీడింగ్ చేసుకున్నా చివరికి వీటిని బీఎల్ఓలు విధిగా ధృవీకరించాల్సి ఉంది. జ్ట్టిఞ//164.100.132.184్ఛఞజీఛి పోర్టర్లో ప్రతి ఓటరు తమ ఎపిక్ కార్డు నెంబర్‌ను ఆధార్ సంఖ్యతో స్వయంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ అడ్రస్ ద్వారా పోర్టర్‌ను ఓపెన్ చేసి సెల్ఫ్ సీడింగ్‌కు ఎదురుగా ఉన్న ‘క్లిక్ హియర్ టు ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీ నెంబర్ క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటరు యొక్క వివరాలు చూపబడతాయి. వివరాలు సరైనచో సీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి.