- ముందుకు సాగని ఓటర్ల ఆధార్‌తో అనుసంధానం
- 30 రోజుల్లో 6.86శాతం మాత్రమే
- పట్టనట్లు వ్యవహరిస్తున్న తహశీల్దార్లు, ఈఆర్‌ఓలు
- మొత్తం ఓటర్లు 30,88,307 మంది
- ఆధార్ సీడింగ్ చేసింది 26255 మాత్రమే
- జిల్లాలో దాదాపు 3 లక్షల వరకు బోగస్ ఓటర్లు
- నేడు ఆధార్ సీడింగ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయడంలో సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. గతనెల 1వ తేదీ నుంచి ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం మొదలైంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30,88,307 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి నుంచి ఎపిక్ కార్డుల నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది. దాదాపు నెల రోజులుగా ఆధార్ సీడింగ్ కార్యక్రమం జరుగుతున్నా ఇంత వరకు కేవలం 26255 (6.86శాతం) ఓటర్లను మాత్రమే ఆధార్ తో అనుసంధానం చేశారు. బీఎల్‌ఓలు 447785 మంది ఓటర్ల ఆధార్ నెంబర్లను వెరిఫై చేసినా సీడింగ్ మాత్రం నామమాత్రంగా ఉంది.
మే నెల 15లోగా ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం పూర్తి చేయాల్సి ఉన్నా అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని మొత్తం ఓటర్లలో బోగస్ ఓటర్లు దాదాపు 3 లక్షల ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఒక వ్యక్తికి ఆధార్ నెంబర్ ఒక్కటే ఉంటుంది. ఆధార్ నెంబర్ ఒక్క ఎపిక్ కార్డుకే లింకప్ అవుతుంది. ఇందువల్ల ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేస్తే బోగస్ ఓటర్లు బయటపడే అవకాశం ఉన్నా... ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. మంత్రాలయం, కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, డోన్, పాణ్యం,ఆలూరు నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ మరింత దయనీయంగా ఉంది. కంప్యూటర్లు, ఆపరేటర్ల కొరతతో పురోగతి లేదనే అభిపాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో పురోగతి లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈఓ ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు.
ఆధార్ సీడింగ్ ఇలా చేసుకోవచ్చు
ఓటర్లు సెల్ఫ్ సీడింగ్ చేసుకోవచ్చు. ఎపిక్ నెంబర్, ఆధార్ నెంబర్లను ఎస్‌ఎంఎస్ చేయవచ్చు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఈ నెంబర్లు చెప్పవచ్చు. ఎవరికి వారు వివిధ మార్గాల్లో సీడింగ్ చేసుకున్నా చివరికి వీటిని బీఎల్‌ఓలు విధిగా ధృవీకరించాల్సి ఉంది.
జ్ట్టిఞ//164.100.132.184్ఛఞజీఛి పోర్టర్‌లో ప్రతి ఓటరు తమ ఎపిక్ కార్డు నెంబర్‌ను ఆధార్ సంఖ్యతో స్వయంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ అడ్రస్ ద్వారా పోర్టర్‌ను ఓపెన్ చేసి సెల్ఫ్ సీడింగ్‌కు ఎదురుగా ఉన్న ‘క్లిక్ హియర్ టు ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీ నెంబర్ క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటరు యొక్క వివరాలు చూపబడతాయి. వివరాలు సరైనచో సీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి.
నిర్లక్ష్యానికి ఓటేశారు!
Published Sun, May 3 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement
Advertisement