Tej Bahadur Yadav wife
-
‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’
న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను అరెస్టు చేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఆయనను వేరే చోటుకు విధుల దృష్ట్యా బదిలీ చేసినట్లు ఢిల్లీ కోర్టుకు వివరించింది. గత మూడు రోజులుగా తన భర్త జాడ తెలియడం లేదని, ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఫిర్యాదు చేసినందుకు ఆయనను అరెస్టు చేసి ఉంటారని అనుమానిస్తూ తేజ్ భార్య షర్మిళ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఎందుకు తేజ్ భార్యను ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. కొత్త బెటాలియన్ క్యాంప్‌లో వీకెండ్లో ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కూడా అధికారులకు కోర్టుకు ఆదేశించింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లోని 88వ బెటాలియన్‌లో తేజ్ బహదూర్ పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. జవాన్లకు పోషకాహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో పెట్టి తేజ్ బహదూర్ యాదవ్ కలవరాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికే అతడి భార్య పలుమార్లు ఆరోపిస్తూ వస్తోంది. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో ‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’ అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు? జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య -
నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య
న్యూఢిల్లీ: తన భర్త ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ భార్య అన్నారు. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని బయటపెట్టిన జవానే తేజ్ బహదూర్ యాదవ్. నాసిరకం ఆహారం విషయాన్ని బయటపెట్టిన కారణంగా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరించారని ఫోన్ లో 29వ బెటాలియన్ జవాన్ తేజ్ బహదూర్ భార్యకు తెలిపారు. తన భర్త కోసం గత రెండు రోజులుగా ఎదురుచూస్తున్నానని, అయితే ఆయన ఇప్పటికీ ఇంటికి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏదో విధంగా వేరొకరి నుంచి మొబైల్ తీసుకుని తనకు కాల్ చేశారని, తాను నిర్బంధంలో ఉన్నానని ( అరెస్ట్ చేశారని) చెప్పాడని వివరించారు. అరెస్ట్ చేసిన తర్వాత భర్త రిటైర్మెంట్ ను రద్దు చేశారని చెప్పారు. జవాన్ల సౌకర్యాలు, ఆహారం, ఇతరత్రా సమస్యలను తేజ్ బహదూర్ తర్వాత సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జీత్‌సింగ్, లాన్స్ నాయక్ యజ్ఞప్రతాప్ సింగ్ కూడా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రయత్నం మొదటగా చేసిన తన భర్తను రిటైర్ అవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని తేజ్ బహదూర్ కు ఏమైతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. బీఎస్ఎఫ్ అధికారులు తేజ్ బహదూర్ భార్య ఆరోపణలపై స్పందించారు. బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదని, వాలంటరీ రిటైర్మెంట్ ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 30న సాయంత్రం జవాన్ రిటైర్మెంట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. (చదవండి: అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?) (చదవండి: ఉరిమిన ‘యూనిఫాం’) -
‘మా ఆయన చెప్పినవన్నీ కరెక్టే’
న్యూఢిల్లీ: తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, ఆయన చేసిన పని కరెక్టేనని బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ భార్య తెలిపారు. బహదూర్ యాదవ్ మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఆయనకు మతిస్థిమితం లేకపోతే సరిహద్దులో ఎలా విధులు నిర్వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. మంచి ఆహారం పెట్టామని అడగడం తప్పుకాదని బహదూర్ యాదవ్ కుమారుడు రోహిత్ అన్నాడు. సైనికుల సరైన ఆహారం అందిచడం లేదని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. జమ్మూకశ్మీర్ 29వ బెటాలియన్ లో జవానుగా పనిచేస్తున్న తేజ్ బహదూర్ యాదవ్ ఇటీవల ఫేస్ బుక్ లో పోస్ట్చేసిన వీడియో దుమారం రేపింది. సరిహద్దులో అత్యంత ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం నుంచి తేజ్ బహదూర్ యాదవ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య వెల్లడించింది. ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు తేజ్ బహదూర్ యాదవ్ పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డి.కె. ఉపాధ్యాయ మంగళవారం తెలిపారు.