విద్యుదాఘాతంతో రైతు మృతి
ఖానాపూర్ (వరంగల్): వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటకు చెందిన తేజావత్ వెంకన్న (50) రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు దగ్గర ఫీజును సరిచేస్తున్న క్రమంలో షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వెంకన్నకు భార్య అచ్చి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.