Telangana mother statue
-
ప్రజలు కోరుకునే విధంగా తెల్లంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక, డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. 👉ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా వరకు మళ్లీ మంచి రోజులు లేనందున ఈరోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు. కరీంనగర్లో ఇచ్చిన హామీని సోనియా సఫలం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను జేఎన్టీయూ ఫైనాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేత నిర్మిస్తున్నాం. తెలంగాణ కోరుకుంటున్న విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం స్థాపన ఉంటుంది.గత పాలకులే తెలంగాణ ఇచ్చినట్టు పాలించారు. పాత విధానాలకు మా ప్రభుత్వం విరుద్ధం. పదేళ్లుగా సీఎంగా ఉన్న వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు. మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్న వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు. విగ్రహానికి అయ్యే కోటి రూపాయలను కూడా కేటాయించలేదు. ఇక్కడ ఎందరివో విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణం అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటే. రాజీవ్ విగ్రహ ఏర్పాటును కూడా వివాదం చేశారు. మేధావుల సూచన మేరకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. 👉మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి పరిణామం. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి విషయం. సోనియా గాంధీ లేకపోతే ఇంకో 50 ఏళ్లు అయినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీతో సీఎం రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు. గత పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు అని ఘాటు విమర్శలు చేశారు.👉ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘పదేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రజలు కోరుకున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎన్నో విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ లోపల పెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్‌కు మరో షాక్.. టీపీసీసీ చీఫ్ నిర్ణయానికి చెక్‌పెట్టిన సీనియర్లు!
TPCC Chief Revanth Reddy.. తెలంగాణలో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డుచెబుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంలో సైతం రేవంత్‌కు సీనియర్లు షాకిచ్చారు. దీంతో, రేవంత్ చేసేదేమీ లేక వెనక్కి తగ్గారు. ఏం జరిగిందే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కి సీనియర్లు మళ్లీ చెక్ పెట్టారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, కొత్తజెండాపై సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కాగా, ఈ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో విస్తృతస్థాయి సమావేశాలో ఆమోదం పొందినప్పటికీ కొంత మంది సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో, సీనియర్లను గౌరవిస్తూ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై సస్పెన్స్ నెలకొంది. కాగా, సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహం, పార్టీ జెండాను రూపొందించారు. దీంతో, ఆయన నిర్ణయాన్ని సీనియర్లు వ్యతిరేకించారు. రేవంత్.. కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా చూస్తున్నారని గుస్సా అయ్యారు. తమకు చెప్పకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ సీనియర్లు విగ్రహం విషయంలో వ్యతిరేకత తెలపడంతో విగ్రహం ఆవిష్కరణ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో, సెప్టెంబర్ 17న గాంధీభవన్‌లో కేవలం జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయనున్నట్టు సమాచారం. -
అమెరికాకు తెలంగాణ తల్లి విగ్రహం!
ప్రముఖ కొరియర్ సంస్థ గరుడవేగ కొత్త సవాల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (T.A.T.A) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ కోసం 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు స్తూపాల నమూనాలను తమ కొరియర్ సంస్థ ద్వారా పంపేందుకు రంగం సిద్ధం చేసింది. కష్టసాధ్యమైన పనిలో భాగమైనందుకు గరుడవేగ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ లోని ఇతర దేశాలతోకలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను అందిస్తోంది గరుడవేగ సంస్థ (GarudaVega - ships all over the world). ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఒరిస్సా, చంఢీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగ సేవలు అందిస్తోంది. గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా మీరు అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి పార్శిల్/కొరియర్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా సేవలు అందుతాయి. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం ఉన్నది. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అన్ని షిప్మెంట్ సర్వీసులకు మీరు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. "ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా. మా సేవలు వినియోగించుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము-గరుడవేగ, గరుడబజార్’’ (అడ్వెర్టోరియల్) -
తెలంగాణ తల్లి విగ్రహం తొలగించేందుకు యత్నం
పాల్వంచ: పట్టణంలో అంబేడ్కర్ సెంటర్లోని తె లంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తుండటంతో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అంబేడ్కర్ సెం టర్లో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. శుక్రవారం దీనిని అక్కడ పనిచేసే వ్యక్తులు కొందరు తొలగించేం దుకు డ్రిల్ మిషన్‌ను తెచ్చి పనులు ప్రారంభించా రు. సమాచారం అందుకున్న టీఆర్ఎస్ నాయకు లు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, సయ్యద్ రషీద్ తదితరులు అక్కడి చేరుకుని అడ్డుకున్నారు. పదేళ్ల కిందట తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహా న్ని తొలగించడం సరైంది కాదన్నారు. తొలగించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో పట్టణ ఎస్ఐ ముత్యం రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నాయకులు తంగేటి రాము, పెద్ది బాబు, ఉబ్బన శ్రీను, గిరి పాల్గొన్నారు. -
తెలంగాణ తల్లి ముసుగువీడేదెన్నడో ?
► ప్రారంభానికి నోచుకోని తెలంగాణ తల్లి విగ్రహం.. ► అధికారపార్టీ నేతలే పట్టించుకోని వైనం ఓదెల: మండలంలోని శానగొండలో తెలంగాణ తల్లివిగ్రహం ప్రారంభోత్సవానికి ముహుర్తం కుదరడం లేదు. ఆరునెలలుగా ఇప్పుడో అప్పుడో ప్రారంభం చేస్తారని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఊరూర తెలంగాణ త ల్లీ విగ్రహలు ఏర్పా టుచేసిన అధికార పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆరునెలలుగా తెలంగాణ తల్లి ముసుగులోనే ఉండటంతో ఇంకెప్పుడు విముక్తి లభిస్తుందని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇదేగ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి విజ్జిగిరి శంకరయ్య స్వచ్చంధంగా తెలంగాణతల్లి విగ్రహన్ని స్వంతఖర్చులతో ఎర్పాటుచేశారు. గ్రామపంచాయతీ ముందు ప్రధానరోడ్డుకు ప్రక్కనగల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరునెలలుగా విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో నానుతూ.. ఆదరణకు నోచుకొవటంలేదు. విగ్రహదాత శంకరయ్య మాత్రం విగ్రహన్ని ఆవిష్కరించాలని అధికార పార్టీ నాయకులతో గోడు వెల్లబోసుకుంటున్నాడు. గ్రామంలో రెండు వర్గాల మధ్య సయోద్య కుదరకనే ముసుగు వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానరోడ్డు పక్కన విగ్రహం ముసుగులో ఉండడంతో ప్రయాణికులు ఎప్పుడు ముసుగు తొలగిస్తారో అని ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కవితలు ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణతల్లి విగ్రహన్ని ప్రారంభించాలని తెలంగాణ వాదులు,గ్రామస్తులు కోరుతున్నారు.