Tender Rules
-
అంచనాల్లోనే వంచన!
సాక్షి, కర్నూలు సిటీ : ఇటీవలి ఎన్నికల ముందు వరకు టీడీపీ నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి ఏ కోశానా ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు దక్కించుకుని రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. తెలుగు గంగ లైనింగ్ పనుల విషయంలోనూ ఇదే తరహా దోపిడీకి ఎత్తుగడ వేశారు. అమాంతం పెరిగిన అంచనాలు తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువ ప్రారంభం నుంచి 18.20 కి.మీ. వరకు లైనింగ్, 18.20 కి.మీ నుంచి 42.566 కి.మీ. వరకు గతంలో లైనింగ్ చేయని పనుల పూర్తి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు రిజర్వాయర్ వరకు 7.380 కి.మీ మేర లైనింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2014 ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు మాత్రమే. అయితే.. 2018 మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో రూ.180.48 కోట్లుగా అప్పటి ప్రభుత్వం ఖరారు చేసింది. అంతటితో వ్యవహారం ఆగలేదు. స్వయాన అప్పటి సీఎం చంద్రబాబు ఇంజినీర్లపై ఒత్తిడి చేసి మరీ అంచనాలను రూ.280.27 కోట్లకు పెంచేలా చేశారు. ఈ మేరకు 2018 జూన్ 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను ఏకంగా రూ.99.79 కోట్లు పెంచారంటే గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీకి ఏ స్థాయిలో గేట్లు ఎత్తిందో అర్థం చేసుకోవచ్చు. అంచనాల పెంపునకు జల వనరుల శాఖ ఇంజినీర్లు కొందరు అభ్యంతరం చెప్పినా ఆనాడు చంద్రబాబు ఏ మాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. రూ.7 కోట్లతో అయ్యే పనులకు రూ.12.16 కోట్లు తెలుగుగంగ ప్రధాన కాలువకు 18.20 కి.మీ. వరకు మాత్రమే కొత్తగా లైనింగ్ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాత 18.20 కి.మీ. నుంచి 42.566 కి.మీ. మధ్యలో కేవలం 800–900 మీటర్లు, బీసీఆర్ నుంచి లింక్ చానల్(వెలుగు రిజర్వాయర్ వరకు ఉన్న కాలువ)లో 650 మీటర్లు మాత్రమే లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. మొత్తం 19.650 కి.మీ. పొడవు మాత్రమే లైనింగ్ చేయాలి. వాస్తవానికి కి.మీ. లైనింగ్ పనులకు రూ.7 కోట్లకు మించి ఖర్చు కాదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఏకంగా రూ.12.16 కోట్లు కేటాయించింది. దీంతో పాటు కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, లేబర్ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో రూ.36.29 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తమ్మీద సుమారు రూ.100 కోట్ల అదనపు దోపిడీకి ‘అధికారిక’ అనుమతి ఇచ్చింది. సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా.. చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా తెలుగుగంగ లైనింగ్ టెండర్ల వ్యవహారం సాగింది. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టస్ తప్పుడు పత్రాలు దాఖలు చేసింది. ఈ విషయం బహిర్గతం కావడంతో వివాదాస్పదంగా మారింది. అయితే.. రిత్విక్కే టెండర్ దక్కేలా మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలని చంద్రబాబు సూచించిన మేరకు ఇంజనీర్లు 2018 జూలైలో ఓపెన్ టెండర్ పిలిచారు. వాస్తవానికి టెండర్ నిబంధనల్లో ‘పేపర్’ అనే యంత్రంతో కాలువ లైనింగ్ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్ దాఖలు అర్హులని పేర్కొనాలి. కానీ పేపర్‌తో పాటు ‘షార్ట్ క్రీటింగ్’ విధానంలో పనులు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన కూడా పెట్టి సీఎం రమేష్ కంపెనీకి దక్కేలా చేశారు. ఆ కంపెనీతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అంటే ఈ ఏడాది మార్చి 7వ తేదీన అగ్రిమెంట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచినా ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో ఇంజినీర్లు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. పనులు మొదలు పెట్టకపోవడంతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టెండర్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
ఆసియా బ్యాంకు అప్పుతో ఆరగింపు సేవ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలే ‘దారి’ దోపిడీ కొనసాగుతుంది. రూ.వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం పనుల టెండర్లను ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, అంచనా వ్యయాలు పెంచేసి, భారీ ఎత్తున కమీషన్లు కొల్లగొడుతున్నారు. కేవలం రూ.50 లక్షల విలువైన పనికి కూడా రూ.40 కోట్ల విలువైన రోడ్ల పనులు చేసిన అనుభవం ఉండాలంటూ టెండర్ నిబంధనలు విధించడం వెనుక లోగుట్టు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పిలిచే టెండర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 5 శాతానికి మించి(ఎక్సెస్) ధరను కోట్ చేసే అవకాశం కాంట్రాక్టర్‌కు ఉండదు. ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం ఈ నిబంధనను పక్కనపెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎంతైనా అధికంగా కోట్ చేసుకోవచ్చంటూ అస్మదీయ కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చేశారు. రాష్ట్ర ఖజానాపై రూ.వందల కోట్ల అదనపు భారం మోపుతున్నారు. 15 నుంచి 30 శాతం ఎక్సెస్‌కు టెండర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.4,234 కోట్ల అప్పు తీసుకొస్తోంది. తొలుత రూ.3,575 కోట్ల విలువైన రహదారుల నిర్మాణం పనులకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన పనులకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎంతైనా ఎక్సెస్ కోట్ చేయొచ్చంటూ వెసులుబాటు కల్పించడంతో కాంట్రాక్టర్లు పండగ చేసుకున్నారు. 15 నుంచి 30 శాతం అధిక ధరలను కోట్ చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.500 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సొమ్మంతా చివరకు ఎవరి జేబుల్లోకి చేరుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజీల మాయ ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు పిలవాల్సి ఉండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం 200–300 పనులను కలిపి ఒక ప్యాకేజీగా మార్చేశారు. మొత్తం 2,440 పనులను 50 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.360 కోట్లతో 493 కిలోమీటర్ల మేర 315 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తం 315 పనులను 4 ప్యాకేజీలుగా వర్గీకరించారు. విజయనగరం జిల్లాలో 156 పనులను 4 ప్యాకేజీలుగా, విశాఖ జిల్లాలో 73 పనులను 3 ప్యాకేజీలుగా, తూర్పు గోదావరి జిల్లాలో 109 పనులను 3 ప్యాకేజీలుగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 పనులను 3 ప్యాకేజీలుగా, కృష్ణా జిల్లాలో 58 పనులు 2 ప్యాకేజీలుగా, గుంటూరు జిల్లాలో 71 పనులు 2 ప్యాకేజీలుగా, ప్రకాశం జిల్లాలో 203 పనులను 4 ప్యాకేజీలుగా, నెల్లూరు జిల్లాలో 196 పనులను 3 ప్యాకేజీలుగా, చిత్తూరు జిల్లాలో 585 పనులను 8 ప్యాకేజీలుగా, వైఎస్సార్ జిల్లాలో 144 పనులను 3 ప్యాకేజీలుగా, కర్నూలు జిల్లాలో 139 పనులను 5 ప్యాకేజీలుగా, అనంతపురం జిల్లాలో 334 పనులను 6 ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను పది రోజుల క్రితం అధికారులు తెరిచారు. ఇందులో 18 ప్యాకేజీలకు మాత్రమే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారని, 24 ప్యాకేజీలకు సింగిల్ టెండర్లు, 8 ప్యాకేజీలకు అసలు టెండర్లు దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఒక్క ప్యాకేజీ మాత్రమే గరిష్టంగా ఐదు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తంగా 47 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా కేవలం టెక్నికల్ బిడ్లను మాత్రమే తెరిచారు. ప్రైస్ బిడ్లను తెరవాల్సి ఉంది. ముందే బహిర్గతం చేసిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందే ఈ దోపిడీ తంతును ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసియా బ్యాంకు అప్పు ఆరగింపునకే’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినా అదంతా అబద్ధమని ప్రభుత్వ పెద్దలు బుకాయించారు. అధికారులతో ఖండన ప్రకటనలు ఇప్పించారు. ఈ పనులను ప్యాకేజీలుగా కాకుండా ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు నిర్వహించాలని కాంట్రాక్టర్లు కోరినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. రూ.63 లక్షల పనిలో రూ.20 లక్షల కమీషన్లు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుపల్లి మండలం నారాయణపురం గ్రామం నుంచి అక్కడికి సమీపంలో ఆర్అండ్బీ రహదారి వరకు 600 మీటర్ల పొడవున రూ.63 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధారణంగా ఈ పని చేయడానికి పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్టరుగా నమోదు చేసుకున్న వారందరికీ అర ్హత ఉంటుంది. కానీ, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే కాంట్రాక్టర్‌కు ఒక ఏడాదిలో రూ.40 కోట్ల విలువైన పని చేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దాంతో కేవలం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకే ఈ పని చేసేందుకు అర్హత దక్కింది. ఈ రోడ్డు నిర్మాణం పనికి అర్హత సాధించిన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని 30 శాతం దాకా అధిక ధరను కోట్ చేశారు. అంటే రూ.63 లక్షల అంచనా వ్యయాన్ని రూ.80 లక్షల నుంచి 85 లక్షల దాకా పెంచేయనున్నారు. పెంచేసిన అంచనా వ్యయం రూ.20 లక్షలు ముఖ్యనేత, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లుగా దక్కనున్నాయి. -
రెండు విడతలుగా వాటర్‌గ్రిడ్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొలుత కృష్ణా బేసిన్‌కు ప్రాధాన్యం 11 సెగ్మెంట్లకు వ్యాప్కోస్ లైన్ క్లియర్ వారంలోగా తొలి విడత టెండర్లు రూ.15,633 కోట్లతో 4 జిల్లాల్లో పైప్లైన్లు టెండర్ నిబంధనలకు సీఎం ఆమోదం హైదరాబాద్: ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)ను రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 11 సెగ్మెంట్లలో పైపులైన్ల నిర్మాణం చేపట్టనుంది. రెండో విడతలో గోదావరి బేసిన్ నుంచి నీటిని సరఫరా చేసే జిల్లాల్లో పనులు మొదలుపెట్టనుంది. రెండో విడత ప్యాకేజీలను 22 సెగ్మెంట్లుగా విభజించింది. తొలి దశకు సంబంధించిన ప్రాజెక్టు అంచనాలను వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పూర్తి చేసింది. సెగ్మెంట్లవారీగా ప్రాజెక్టు అంచనాలను పరిశీలించిన వ్యాప్కోస్ ప్రతినిధులు తాము రూపొందించిన నివేదికలను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వారంలోగా పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అది రూపొందించిన నిబంధనలకు సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదం తెలిపారు. తొలి దశలోని నాలుగు జిల్లాల్లో రూ.15,633 కోట్లతో పైప్లైన్ల ఏర్పాటుకు వచ్చే బుధవారంలోగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. తర్వాత మరో 15 రోజుల్లోగా రెండో విడత పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. టెండ ర్లు పిలిచేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను 26 ప్యాకేజీలుగా విభజించింది. వాటి అంచనాలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పైప్‌లైన్ ఏర్పాటులో కీలకమైన భూ సేకరణ ప్రక్రియను ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ చట్టం ద్వారా పూర్తిచేయాలని భావిస్తోంది. మొత్తం 33 సెగ్మెంట్లలో సుమారు 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకవసరమైన సుమారు 6,000 ఎకరాల పైప్లైన్ల మార్గంలో 2,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి వస్తుందని అంచనా. పైప్‌లైన్ వెళ్తున్నందున పంట నష్టం పరిహారాన్నే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్‌కు భారీగా పైపులు అవసరమైనందున సరఫరా సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లు పెట్టాలన్న నిబంధనను సడలించి దాన్ని కాంట్రాక్టర్ల ఇష్టానికే వదిలేసింది. రైట్ ఆఫ్ వే చట్టమంటే... గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమలకు మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం ప్రభుత్వం రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం పైప్లైన్లకు సేకరించిన భూమిలో చెట్లు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ ్వకూడదు. సాధారణ సాగుకు మాత్రం ఆంక్షలుండవు. పైప్లైన్లకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే జైలుశిక్ష విధిస్తారు.