Tenor
-
టెనార్ డి స్పెసిఫికేషన్స్ ఇవే..
సాక్షి, ముంబై: టెనార్ (10. ఆర్) కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. టెనార్ డి పేరుతో ఈ కొత్త డివైస్‌ను బడ్జెట్‌ధరలో విడుదల చేసింది. ముఖ్యంగా చైనామొబైల్ దిగ్గజం షావోమికి పోటీగా హువాక్ఇన్ టెక్నాలజీ దీన్ని ప్రకటించింది. టెనార్ బ్రాండ్‌లో టెనార్ ఓ, టెనార్ జీఅందుబాటులోకి తెస్తున్న ఈ మూడవ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. రెడ్ మి 5ఏ పోలికలతో దీన్ని రూపొందించింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కేవలం 0.2 సెకన్లలో అన్‌లాక్ అవుతుందని కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లలో (2జీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు వరుసగా రూ .3,999, రూ .4,999 గా ఉండనున్నాయి. కాగా జనవరి 6,2018నుంచి విక్రయానికి లభ్యం. టెనార్ డి ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా, 4000 బ్యాటరీ -
అమెజాన్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, బెంగళూరు: ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ప్రవేశించిన అమెజాన్ కొత్త సంవత్సరంలో మరో సరికొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. టెనార్ బ్రాండ్ నేమ్ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ను చేయనుంది. టెనార్ ఇ , టెనార్ జీ పేరుతో రెండు డివైస్‌లను విడుదల చేసిన అమెజాన్ వచ్చే జనవరిలో ఈ తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తన ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ కొద్ది రోజుల ముందు అమెజాన్ వీటిని లాంచ్ చేసిన సంగతి విదితమే. ఎంపిక, ధరలను అర్థం చేసుకోవటానికి , సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడంలో విక్రేతలు, వినియోగదారుల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంలో కస్టమర్లు అభిప్రాయాలను గౌరవిస్తామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు.దీన్ని క్రాఫ్టెడ్ ఫర్ అమెజాన్‌గా కంపెనీ పిలుస్తోంది. మరోవైపు స్మార్ట్ఫోన్లకు సంబంధించి ఇండియాలో ప్రైవేట్ లేబుల్ మార్కెట్ కొత్త పరిణామమని నిపుణుల భావన. స్మార్ట్‌ఫోన్ టాబ్లెట్ మార్కెట్లో 8.5-9 బిలియన్ డాలర్ల వార్షిక రన్ రేటు పెరగనుందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ సీఈవో అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
‘గుర్తింపు’లోనూ నిర్లక్ష్యమే!
ధర్మవరం : కౌలు అధీకృత చట్టం ప్రకారం 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 63 మండలాల్లోని 1003 గ్రామ పంచాయతీల పరి«ధిలో గ్రామ సభలు నిర్వహించి, 29,383 మంది కౌలు రైతులను గుర్తించాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు లక్ష్యం విధించింది. అయితే ఇప్పటి దాకా 2,264 మందిని మాత్రమే గుర్తించారు. లక్ష్యంలో కనీసం 10 శాతం కూడా పూర్తి చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల ఆరంభంలో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి కార్యక్రమాన్ని మమ అనిపించారు. వివరాల వెల్లడికి ససేమిరా.. తమ భూమిని కౌలుకు ఇచ్చేందుకు, తమ భూమి వివరాలు ఇతరులకు వెల్లడించేందుకు రైతులు ఒప్పుకోవడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, లిటిగెంట్ వ్యవహారాల నేప«థ్యంలో భూములను కౌలుకు ఇచ్చేందుకు అంగీకరించడం లేదంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, వాతావరణ బీమా, ఇతరత్రా సబ్సిడీలు అన్నీ కౌలు రైతులకు దక్కితే తమకు నష్టం వాటిల్లుతుందని భావించిన రైతులు కౌలు పట్లు విముఖత చూపుతున్నారు. ఇంట్లో వారే కౌలు రైతులు కౌలు రైతులను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది కొత్త ఎత్తుగడ వేశారు. ఇంట్లో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రిపేరిట ఉన్న భూమిని కొడుకులిద్దరికీ కౌలుకు ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇలా అన్న పేరిట ఉన్న భూమిలో కొంత తమ్మునికి, తల్లి పేరిట ఉన్న భూమిని తనయులకు ఇచ్చినట్లు గుర్తింపుకార్డులు ఇచ్చి తాము కూడా గుర్తించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్క కౌలు రైతును కూడా గుర్తించని మండలాలు సగానికి పైగా ఉన్నాయి. ఒక్క ధర్మవరం మండలంలో మాత్రం 250 దాకా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు. సహకరించని బ్యాంకర్లు ఇదిలా ఉండగా కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వరుసగా పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో కౌలురైతు కార్డు పొందిన వారికి ఎన్నో నిబంధనలు పెట్టి రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు కార్డు పొందేందుకు రైతులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు.