Tenth class exams results
-
విద్యాశాఖ ప్రకటన.. ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఈ నెల 4న ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించిన అంశాలివే.. -
రేపే పదో తరగతి ఫలితాలు
- 12వ తేదీకి బదులు 11నే విడుదల - ప్రకటించనున్న డిప్యూటీ సీఎం కడియం - 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్! సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేయనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ముందుగా 12వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి ఆ రోజున అందుబాటులో ఉండని కారణంగా 11నే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.64 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాశారు. మరోవైపు వివిధ పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణామండలి సన్నాహాలు చేస్తోంది. గత నెల 21న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. టెన్త్ ఫలితాల విడుదల మేరకు పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రూపొందించాలని అధికారులు భావించారు. బుధవారం టెన్త్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా యంత్రాంగం సమాయత్తమవుతోంది. సాంకేతిక విద్య కమిషనర్ ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న పాలిసెట్ కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
పదిలో మెరుగు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు జిల్లాను ఒకింత ముందు వరుసలోకి చేర్చాయి. గత ఏడాది 12వ స్థానానికి పరిమితమైన జిల్లా ఈసారి 6వ స్థానానికి ఎగబాకింది. తెలంగాణ జిల్లాల్లో 3వ స్థానాన్ని చేజిక్కించుకుంది. జిల్లావ్యాప్తంగా 48,426 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 45,112మంది (93.16శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 23,427 మందికిగాను 22024 మంది (94.01శాతం) పాస్ కాగా బాలురు 24,999 మందికిగాను 23088 (92.36శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈసారి జిల్లాలో రికార్డుస్థాయిలో 102 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్ అవరేజ్ (జీపీఏ) సాధించారు. వీరిలో అత్యధికులు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులే. మెరుగైన ఫలితాలు సాధించారు పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో 6వ స్థానం, తెలంగాణలో 3వ స్థానం దక్కించుకున్నాం. ఇవి ప్రామాణికమైన ఫలితాలుగా భావిస్తున్నాం. భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలబడేందుకు ప్రయత్నిస్తాం. - ఎస్.విశ్వనాథరావు, డీఈఓ నల్లగొండ