Terrorists target
-
BSF: కశ్మీర్‌కు చొరబాట్ల ముప్పు
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు. -
ఉత్తరప్రదేశ్,జమ్మూకశ్మీర్,ఢిల్లీకి ఉగ్రముప్పు
-
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
ఉగ్రవేటకు బ్లాక్ క్యాట్ కమెండోలు
శ్రీనగర్/ న్యూఢిల్లీ/ ముంబై: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమెండోల సేవల్ని వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పుందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 24 మంది ఎస్ఎస్జీ కమెండోల బృందాన్ని కశ్మీర్‌కు పంపిందని తెలిపారు. వీరు త్వరలోనే భద్రతాబలగాలతో కలసి ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొంటారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి ఎన్ఎస్జీ కమెండోల సంఖ్యను 100కు పెంచే అవకాశముందని వెల్లడించారు. ఉగ్రవాదులు ప్రజల్ని బందీలుగా చేసుకుంటే లేదా విమానాల హైజాకింగ్‌కు పాల్పడితే వెంటనే ఘటనాస్థలికి చేరుకునేందుకు వీలుగా ప్రస్తుతం కమెండోలను శ్రీనగర్ విమానాశ్రయంలో మోహరించామన్నారు. ఎన్ఎస్జీ కమెండోల వద్ద ఉన్న గోడల్ని స్కానింగ్చేసే రాడార్లు, స్నైపర్ తుపాకులు, ఇంటి మూలల్లో నక్కిన ఉగ్రవాదుల్ని కాల్చగలిగే తుపాకులతో ఉగ్ర ఆపరేషన్లలో బలగాల ప్రాణనష్టం గణనీయంగా తగ్గుతుందన్నారు. అలాగే యాత్రకు వాడే వాహనాల గమనాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ స్టిక్కర్లను అమర్చనున్నట్లు పేర్కొన్నారు. 10–15 డ్రోన్లను వినియోగించడంతో పాటు ఎమర్జెన్సీ నంబర్ 1364ను యాత్రికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వేర్పాటువాదుల అరెస్ట్ జమ్మూకశ్మీర్‌లో సీనియర్ జర్నలిస్ట్ షుజాత్ బుఖారితో పాటు ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు కశ్మీరీల మృతికి నిరససగా వేర్పాటువాదులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్‌ను గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను కోఠిబాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాజ్ ఉమర్ ఫారుఖ్‌ను ఆయన స్వగృహంలో నిర్బంధించారు. అతివాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఇప్పటికే గృహనిర్బంధంలో ఉన్నారు. సీఎం మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి ఇటీవల బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా, వేర్పాటువాదుల పిలుపుతో కశ్మీర్ లోయలో మార్కెట్లు, దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శుక్రవారం అన్ని రాజకీయ పక్షాలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. గవర్నర్ పాలన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, కశ్మీరీలను మరింత అణచేందుకే జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారని పాకిస్తాన్ విమర్శించింది. -
తీవ్రవాదుల టార్గెట్ ‘మోదీ’
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ బహిరంగ సభ విచ్చిన్నం లక్ష్యం గానే గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో బాం బులు అమర్చినట్టు తీవ్రవాదుల వద్ద జరిపిన విచారణలో వెలుగు చూసింది. ఈ మేరకు పట్టుబడిన తీవ్రవాదుల వద్ద బెంగళూరులో తీవ్ర విచారణ సాగుతోంది. మరి కొన్ని రోజుల్లో వీరిని చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఏడాది మే ఒకటో తేదీ పేలుడు జరిగిం ది. బెంగళూరు నుంచి వచ్చిన గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పేలుళ్ల కేసును ఓ సవాల్‌గా తీసుకున్న సీబీసీఐడీ విచారణను నెలల తరబడి సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో రెండు రోజుల క్రితం ముగ్గురు తీవ్రవాదులు పట్టుబడడం, వారికి ఈ కేసుకు సంబంధం ఉన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో చెన్నై నుంచి సీబీసీఐడీ డీఎస్పీలు విజయరాఘవన్, ఆనందకుమార్ బెంగళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక పోలీసులతో కలసి విచారణలో నిమగ్నం అయ్యారు. ఆ తీవ్రవాదులు పట్టుబడ్డ ధర్వార్ నగర్ పరిసరాల్లో విచారణ జరుపుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయి తే, ఆ ముగ్గురు తీవ్రవాదులు అన్న సమాచారంతో ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. మోదీ టార్గెట్ ఆ తీవ్రవాదుల చెప్పిన వివరాల మేరకు ఆ పేలుళ్లు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేష న్ను టార్గెట్ చేయలేదన్న విషయం స్పష్ట అవుతోంది. ఇదే విషయాన్ని ఘటన జరిగిన సందర్భంలో అప్పటి డీజీపీ రామానుజం సైతం వ్యాఖ్యానించారు. రైలు ఆలస్యంగా రావడం వల్లే ఇక్కడ పేలిందని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ వైపుగా రైలు పరుగులు తీస్తున్న సమయంలో పేలుడు జరిగి ఉండేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా తీవ్ర వాదులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్యటనలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు సభకు ఏర్పాట్లు చేసి ఉన్న దృష్ట్యా, ఆ సభ విచ్చిన్నం లక్ష్యంగా ఈ పేలుడుకు వ్యూహ రచన జరిగినట్టు గతంలో వ్యక్తమైన అనుమానాలు తాజా విచారణలో నిజమయ్యూయి. మోదీని టార్గెట్ చేసి గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో టైమర్లను అమర్చిన ఈ ముగ్గురు తీవ్ర వాదులు నిషేదిత ‘సిమి’కి చెందిన వాళ్లుగా తేల్చారు. సిమి కార్యకలాపాలు చాప కింద నీరు లా రాష్ట్రంలో సాగుతుండడం ఇటీవల వెలుగు చూసిన దృష్ట్యా, ఈ కేసుకు సహకరించిన వాళ్లెవ్వరైనా ఇక్కడ నక్కి ఉన్నారా..? అన్న అనుమానాలు మొదలయ్యూయి. ఆ ముగ్గురినీ త్వరితగతిన తమ కస్టడీకి తీసుకునే చర్యల్ని సీబీసీఐడీ డీఎస్పీలు వేగవంతం చేశారు. మరి కొన్ని రోజుల్లో వారిని చెన్నై తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.