Test all-rounder
-
స్వదేశంలోనే షకీబ్ వీడ్కోలు
ఢాకా: సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు సొంతగడ్డపై వీడ్కోలు పలకాలనుకున్న బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కోరిక నెరవేరనుంది. ఇటీవల భారత్‌తో రెండో టెస్టు సందర్భంగా స్వదేశంలో చివరి మ్యాచ్ ఆడి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని షకీబ్ ప్రకటించాడు. అయితే బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై అనుమానాలు రేకెత్తగా... ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో షెడ్యూల్ ప్రకారం సిరీస్ జరగనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 21 నుంచి మొదలయ్యే తొలి టెస్టు కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బుధవారం జట్టును ప్రకటించింది. అందులో సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌లో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్న షకీబ్... చివరి మ్యాచ్ కోసం స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు గతంలోనే వెల్లడించగా... భద్రత కల్పంచలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. షకీబ్ రాజకీయ వైఖరి వెల్లడిస్తే భద్రత కలి ్పస్తామని... తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా సలహాదారుడిగా పనిచేస్తున్న ఆసిఫ్ మహమూద్ ప్రకటించగా... స్వదేశంలో హింస తలెత్తిన సమయంలో నోరు మెదపకుండా ఉన్నందుకు షకీబ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ‘అల్లర్లలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతున్నా. హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదు. అయినవాళ్లను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. మీ మనోభావాలను గౌరవిస్తూ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. త్వరలో స్వదేశంలో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలుస్తూ... నేను బాగా ఆడినప్పుడు కేరింతలు కొట్టి, బాగా ఆడనప్పుడు కళ్ల నీళ్లు పెట్టుకున్న అందరి ముందు ఆఖరి ఆట ఆడాలనుకుంటున్నా. మీ ప్రేమాభిమానులు కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని షకీబ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. దీంతో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం షకీబ్‌కు భద్రత కల్పించేందుకు ముందుకు రాగా... తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బోర్డు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్... వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు. తాజాగా భారత్‌లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన బంగ్లాదేశ్... సఫారీలపై సత్తా చాటాలని చూస్తోంది. టీమిండియాతో ఆడిన జట్టు నుంచి ఖాలెద్ అహ్మద్‌ను తప్పించడం తప్ప మిగిలిన జట్టులో మార్పులు చేయలేదు. తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ షంటో (కెపె్టన్), షాద్మన్ ఇస్లామ్, మహ్ముదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, జాకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్, తస్కీన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
అదరగొట్టిన జడేజా.. టెస్టుల్లో మరోసారి నెంబర్‌వన్‌గా
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(357 పాయింట్లు) ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో విశేషంగా రాణించిన జడేజా మార్చి 9న విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్ విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచాడు. దాదాపు వారం పాటు నెంబర్‌వన్‌గా ఉన్న జడేజా విండీస్ ఆల్‌రౌండర్ హోల్డర్‌కు మరోసారి కోల్పోయాడు. తాజాగా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచిన జడేజా, హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(341 పాయింట్లు) ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న బాబర్ మూడు స్థానాలు ఎగబాకి 799 పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఆరు స్థానాలు ఎగబాకి వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కరాచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 160.. రెండో ఇన్నింగ్స్‌లో 44 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న లబుషేన్, రూట్, స్మిత్, విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో స్థానం.. బుమ్రా 830 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. చదవండి: Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్ కెప్టెన్.. యాక్షన్ తీసుకోవాల్సిందే! క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. 🔹 Babar Azam enters top five of batting list 🔹 Pat Cummins makes gains in all-rounders’ chart Both Pakistan and Australia skippers move up in the weekly update of the @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details ➡ https://t.co/nLJOeoGJVr pic.twitter.com/WYBZhDyN3A — ICC (@ICC) March 23, 2022 -
అశ్విన్‌కు నెంబర్‌వన్ ర్యాంక్
దుబాయ్: ఐసీసీ ర్యాంకింగ్స్ ఆలౌరౌండర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్ (40, 46 నాటౌట్) బ్యాట్ రాణించడంతో ర్యాంక్ మెరుగుపడింది. తాజా జాబితాలో అశ్విన్ 372 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫిలాండర్ (365)ను వెనక్కినెట్టి నెంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.