thief arrest
-
శంషాబాద్‌లో 800 కేజీల గంజాయి పట్టివేత..వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కెమికల్ డ్రమ్ములతో వెళ్తున్న కంటైనర్‌పై సైబరాబాద్ పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు కంటెర్ను ఆపి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 800 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఒడిశా నుంచి మహరాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. నాణ్యమైన శీలావతి రకం గంజాయిని ముంబై పోర్టు ద్వారా విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. కాగా, గంజాయి స్మగ్లింప్పై సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ..👉శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద భారీ గా గంజాయి పట్టుకున్నాం👉శంషాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్తగా ఆపరేషన్ నిర్వహించి గంజాయి పట్టుకున్నాం.👉కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు 800 కిలోలు గంజాయి సీజ్ చేశాము.👉పట్టుబడ్డ గంజాయి విలువ రెండు కోట్ల ఎనబై లక్షల వరకు ఉంటుంది👉ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నారు👉అరకుకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్ లో కీలక నిందితుడు👉బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ట్రాన్స్ పోర్టర్‌గా ఉంటున్నాడు👉గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్పోర్ట్కు మూడు లక్షలు తీసుకుంటాడు👉మహారాష్ట్ర కు చెందిన రిసీవర్ మారుతి పటేల్ పరారీలో ఉన్నాడు అతన్ని త్వరలోనే పట్టుకుంటాం👉మహారాష్ట్రలో మారుతి గంజాయి రిసీవ్ చేసుకున్న తర్వాత మహారాష్ట్ర తో పాటు కర్ణాటకలో డ్రగ్ పెడ్లర్లకు సప్లై చేస్తాడు👉ఈ కేసులో సంజీవరెడ్డి బీదర్‌కు చెందిన వ్యక్తి డ్రైవర్ కం ట్రాన్స్‌పోర్ట్‌గా ఉన్నాడు👉సంజీవ్ విట్టల్ రెడ్డి ఈనెల 31న ఫుడ్ ఐటమ్స్ లోడ్ తీసుకుని వైజాగ్ డీమార్ట్ కు వెళ్ళాడు👉అక్కడనుండి వస్తూ వస్తూ రాము సహకారంతో తన కంటైనర్ లో గంజాయి తీసుకుని వచ్చాడు👉నిందితులు అంతా కలిసి ఎంతకాలంగా గంజాయి సప్లై చేస్తున్నారు విచారిస్తున్నాం👉ప్రధాన నిందితుడు రాముతో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు👉పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కంటైనర్ ముందు నిందితులు కారులో ఎస్కార్ట్ గా వచ్చారు👉కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు👉పోలీసుల నిఘానుండే తప్పించుకోవడానికి టోల్గేట్ వద్దకు కంటైనర్ రాగానే వాహనం నంబర్ ప్లేట్ మారుస్తారు👉నిందితులపై అనుమానంతో 15 నుండి 25 రోజులు వరకు ఈ కేసు పై వర్కౌట్ చేశాం 👉నిందితులు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి పటాన్ చెరువు వద్ద మరొక వెహికల్ లో గంజాయిని మారుస్తారు👉మార్చిన ఆ వెహికల్లో గంజాయిని మహారాష్ట్రకు తీసుకువెళ్తారు👉విట్టల్ రెడ్డి పరవాడ సెజ్ లో సాల్వెంట్ డ్రమ్ములను కంటైనర్ లోడ్ చేసుకున్నాడు👉కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు👉కెమికల్స్ డ్రమ్ములను కూడా జీఎస్టీ వేబిలు లేకుండా తరలిస్తున్నారు👉ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా విచారణ చేస్తాం👉మొత్తం ఏడుగురు నిందితులు గంజాయి సప్లై లో భాగంగా ఉన్నారు..ఇందులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం👉మిగతా ముగ్గురు నిందితులను పరారీలో ఉన్నారు..వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటాం -
అసలు నువ్వు పోలీసువేనా..? నాకెందుకో డౌటు..!
ఆదిలాబాద్: పోలీసు డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఓ కేటుగాడు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆదివారం అర్ధరాత్రి సెల్‌ఫోన్ దొంగతనం చేసి, పక్కనే ఉన్న దాబాలో కౌంటర్ వద్దకు వెళ్లాడు. డబ్బుల కోసం వెతుకుతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన ఎల్సని రాజు అని గుర్తించారు. ఇరిగేషన్ శాఖలో లస్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇతను కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కరీంనగర్లో స్వామిజీ వేషధారణలో సెల్‌ఫోన్ చోరీ చేసి, నేనే చేశానని రైల్వే పోలీసులకు లొంగిపోయాడని వివరించారు. కేసు నమోదు చేసుకుని రాజును రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. ఇవి చదవండి: హోలీ పండుగ మిగిల్చిన విషాదం! -
హ్యాట్సాఫ్.. ఏపీ పోలీసులు
సింగరాయకొండ : ఏపీ–తమిళనాడు సరిహద్దులోని ఆ ఊరు నేర సామ్రాజ్యానికి అడ్డా.. అది పోలీసులు కూడా ఛేదించలేకపోయిన ఘరానా దొంగల గడ్డ.. అలాంటి చోటుకు మన ఏపీ పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో ప్రాణాలకు తెగించి వెళ్లారు. వెళ్లడమే కాదు.. పద్మవ్యూహంలాంటి ఆ చోర సామ్రాజ్యం నుంచి కరడుగట్టిన ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. ఇది పసిగట్టిన అక్కడి దొంగల ముఠా సభ్యులు పోలీసులను వెంబడించారు. ఈ ఛేజింగ్‌లో మన పోలీసుల చాకచక్యంతో పైచేయి సాధించి ముగ్గురు నేరస్తుల్ని పట్టుకొచ్చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించిన ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండలో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు ఘరానా దొంగలను తమిళనాడులోని మింజూరులో ప్రకాశం జిల్లా పోలీసులు వలపన్ని సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 11న ప్రకాశం జిల్లా ఒంగోలు టీచర్స్ కాలనీకి చెందిన పోతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంట్లో 60 సవర్ల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ నెల 12వ తేదీన సింగరాయకొండ పరిధిలోని మూలగుంటపాడులో ముమ్మడిశెట్టి చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. ఎస్పీ మల్లికాగర్గ్ ఆదేశాల మేరకు డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సింగరాయకొండ సీఐ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలు ఆధారంగా ఒంగోలు టీచర్స్ కాలనీ, సింగరాయకొండలో చోరీలకు పాల్పడిన ముఠా ఒకటేనని నిర్థారణకు వచ్చారు. ఇదే ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ గతంలో దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు. నేర సామ్రాజ్యంలోకి వెళ్లి మరీ అరెస్ట్? ఈ ముఠా తమిళనాడులోని మింజూరు ప్రాంతానికి చెందినదని గుర్తించిన పోలీసు బృందాలు నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పథకం పన్నారు. మింజూరు ప్రాంతం నేర సామ్రాజ్యానికి అడ్డా కావడం.. గతంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు పోలీసులపై విరుచుకుపడటం వంటి పరిస్థితులు తలెత్తాయి. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి తమవల్ల కాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలోని పోలీస్ టీమ్ దొంగలను అదుపులోకి తీసుకునేందుకు రెండు కార్లలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. మింజూరు స్టేషన్ మహిళా ఎస్సై సహకారంతో దొంగల కోసం రోజంతా అక్కడ మాటు వేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపైనే దాడికి యత్నం చోరీ సొత్తును రికవరీ చేసే క్రమంలో ఆంధ్రా నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగల ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులపై మూకుమ్మడి దాడికి యత్నించినట్టు సమాచారం. అప్పటికే కొంత సొత్తును రికవరీ చేసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని వెంటనే తాము వచ్చిన వాహనాల్లోనే తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో దొంగల ముఠాకు చెందిన వ్యక్తులు మరో రెండు కార్లులో పోలీసుల్ని వెంబడించినట్టు తెలిసింది. ఆ తరువాత పోలీసుల వాహనాలు హైవేపైకి రావడంతో ముఠా తరఫు వ్యక్తులు వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
173 కేసుల్లో నిందితులు.. పోలీసులు పక్కా స్కెచ్.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 కిలోల కాపర్ కాయిల్స్, టాటా ఇండికా కారు, బజాజ్ పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధి సీసీఎస్ క్రైం డీసీపీ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో నెల రోజుల పాటు శ్రమించి మూడు నాలుగు కమిషనరేట్‌లో పరిధిలో 173 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏడు మంది దొంగల గ్యాగ్ ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధానంగా ఈ ముఠా దొంగలించిన సొత్తు చిన్నది కావచ్చు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా నష్టం చేకురుస్తుందని డీసీపీ తెలిపారు. ఏడుగురు నిందితులు చేసిన దొంగతనాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60, సైబరాబాద్ పరిధిలో 7, వికారాబాద్‌లో 68,సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 22 మొత్తం ఈ ముఠా 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసినట్టు సీపీ వివరించారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. ప్రధాన నిందితుడు సహదేవ్ హిజ్రా, అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్, రాహుల్ రాజ్ బార్, రాంచందర్, కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్, తులుగు రమణ రెడ్డి, రాంజానీ జయశ్రీలను అరెస్ట్ చేయగా, రాహుల్ రాజ్ బార్, రాంచందర్ కుర్వ చిన్న నర్సింహులు, ఉట్టల మహేష్ పరారీలో ఉనట్లు సీపీ తెలిపారు. నెల రోజులు కష్టపడి కేసును చేధించిన అధికారులను సీపీ అభినందించారు. -
నగరంలోని సైకిళ్లన్నీ మాయం.. కారణం తెలిసి పోలీసులే షాక్!
చండీగఢ్: హరియాణాలోని పంచకుల జిల్లా కేంద్రంలో కొద్ది రోజులుగా సైకిళ్లు మాయమవుతున్నాయి. ఒక్కసారిగా సైకిళ్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు పెరగటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసు ఛేదించారు. అయితే.. పోలీసులే విస్తుపోయే సంఘటన ఎదురైంది. నగరంలోని సైకిళ్లన్నింటిని ఒకే వ్యక్తి ఎత్తుకెళ్లటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచకుల జిల్లాలోని మంజ్రి గ్రామంలో రవి కుమార్(32) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. పంచకుల జిల్లా మొత్తం తిరుగుతూ సైకిళ్లు ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నాడు. ఇటీవలే సెప్టెంబర్ 14న సెక్టార్ 26లో సుమారు రూ.15,000 విలువ చేసే సైకిల్‌ను మాయం చేశాడు. సెక్టార్స్ 2,4,7,9,10,11,12,12A,20, 21,25లలో సైకిళ్లు చోరీకి గురయ్యాయనే ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల తర్వాత రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. నిఘా కెమెరాల ఆధారంగా మొత్తం 62 సైకిళ్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ‘సీసీటీవీ ఫుటేజ్, సైబర్ టెక్నాలజీ ఆధారంగా పంచకుల జిల్లా మొత్తం ఒకే వ్యక్తి సైకిళ్లు దొంగతనం చేసినట్లు తేలింది. ఈ సైకిళ్లు గరిష్ఠంగా రూ.20,000 వరకు ధర ఉన్నాయి.’ అని పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన సైకిళ్లను అత్యంత తక్కువ ధరకు రూ.2,000లకే అమ్మటం.. వచ్చిన డబ్బును మత్తుపదార్థాలు కొనుగోలు చేసేందుకు వినియోగించటం చేస్తున్నాడు. ‘2021లో లుథియానా నుంచి చండీగఢ్‌లోని రాయ్‌పుర్ ఖుర్ద్‌కు మకాం మార్చాడు రవి. జిరాక్‌పుర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేవాడు. తన ఉద్యోగం పోయిన క్రమంలో మత్తుకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత పంచకులకు మారి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తున్నాడు.’ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపాడు. ఇదీ చదవండి: భర్తను చితకబాది.. భార్యను లాక్కెళ్లి ఆరుగురు గ్యాంగ్ రేప్! -
ఢిల్లీలో ‘రాబిన్ హుడ్’ తరహా దొంగతనాలు.. ముఠా నాయకుడి అరెస్ట్!
న్యూఢిల్లీ: ధనవంతులను దోచుకుంటూ.. అందులో కాస్త పేదలకు పంచిపెడుతోన్న ‘రాబిన్ హుడ్’ తరహా ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు సోమవారం తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 25 మంది సభ్యులు ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వసీం అక్రం (27) అలియాస్ లంబూ, అతని ముఠా.. దేశ రాజధానిలోని ధనవంతుల ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది. డబ్బులు, బంగారు ఆభరణాలు కాజేసింది. అందులో కొంత మొత్తాన్ని పేదలకు పంచిపెట్టింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. ఈ కారణంగానే అతనికి చాలా మంది అనుచరులు ఏర్పడ్డారని.. పోలీసుల కదలికలపట్ల ముందే సమాచారం అందిస్తూ.. తప్పించుకునేందుకు వీలుగా సహకరించేవారని తెలిపారు. దొంగతనాలకు అలవాటు పడిన వసీం అక్రం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రహస్య స్థావరాలను తరచూ మార్చేవాడని పోలీసులు చెప్పారు. దొంగతనాలు, హత్యాయత్నం, అత్యాచారం తదితర 160 కేసులు అతనిపై ఉన్నాయని తెలిపారు. గత 4 నెలలుగా అతని కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందం.. ఎట్టకేలకు పట్టుకుందని తెలిపారు. ‘ఇన్స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో వేసిన ఉచ్చులో వసీం చిక్కాడు’ అని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మూడు బుల్లెట్లతో కూడిన సింగిల్ షాట్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: మలద్వారంలో గ్లాస్‌తో 10 రోజులుగా నరకం.. వైద్యులు ఏం చేశారంటే? -
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏటీఎం చోరీకి యత్నం.. కటకటాలపాలైన యువకుడు
సాక్షి,న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 2:15గంటల సమయంలో వీరు ఏటీఎంకు గ్యాస్ కట్టర్ సాయంతో కన్నం వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయారని, గ్యాస్ కట్టర్, సిలిండర్ అక్కడే వదిలి వెళ్లారని వివరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫూటేజీ పరిశీలించి ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను రాజస్థాన్ దౌసా జిల్లాకు చెందిన కమల్(27), ప్రవీణ్(20)గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏటీఎం చోరీకి సూత్రధారి తానే అని కమల్ విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు డబ్బు కావాలని, అందుకే తన కజిన్ ప్రవీణ్‌తో కలిసి చోరీకి పథకం పన్నినట్లు కమల్ చెప్పాడని తెలిపారు. చదవండి: యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో.. -
పేరు గంటా రాముడు.. ఎక్స్ఎల్ బైక్ కనపడితే ఖతం
కర్నూలు (బొమ్మలసత్రం) : కేవలం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎక్స్ఎల్ బైక్‌లను మాత్రమే కాజేసే ఓ దొంగను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మరే ఇతర బైకు కనిపించినా ఈ దొంగ వాటి వైపు కన్నెత్తి చూడడు. ఎందుకంటే ఆ దొంగకు కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని మాత్రమే నడుపుతాడు. సరే దొంగిలించిన వాహనాన్ని ఎవరికైనా తక్కువ ధర విక్రయిస్తాడా అంటే అదీ లేదు. తాను దొంగిలించిన 14 బైకులను ఒక ఇంట్లో ఉంచి వాటిని చూస్తూ ఆనందించేవాడు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 54 ఏళ్ల గంటా రాముడు చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. రాముడు టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ మాత్రమే నడిపేవాడు. ఎక్కడ టీవీఎస్ ఎక్స్ఎల్ బైకు కనిపించినా తన దృష్టి బైక్‌మీదే ఉంచేవాడు. తన ఇంటి నిండా టీవీఎస్ బైకులతో నింపాలన్న చిలిపి కోరిక రాముడు దొంగతనాలకు బానిసయ్యేలా చేసింది. ఈ క్రమంలో నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తనకు నచ్చిన బైకు వద్ద వెళ్లి, ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగిలించి వాహనంపై పరారయ్యేవాడు. ఇదే క్రమంలో నంద్యాల గాంధీచౌక్ సెంటర్లో ఒక దుకాణం ముందు నిలిపిన బైకును రాముడు గత నెలలో చోరీ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రాముడు బైక్ ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాముడు సొంత గ్రామమైన కొణిదెల గ్రామానికి వెళ్లి విచారించారు. తాను ఏకంగా 14 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకుని వాటిని ఓ పాడుబడిన మిద్దెలో దాచినట్లు చెప్పాడు. పోలీసులు బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్న ఏఎస్సై క్రిష్ణారెడ్డి, హుస్సేన్ సిబ్బంది మద్దిలేటి, మస్తాన్, సుధాకర్‌లను డీఎస్పీ రామాంజినాయక్, సీఐ ఓబులేసులు అభినందించారు. -
పార్టీకి పిలిచిన సహోద్యోగి.. ఆమె తన లవర్‌తో వచ్చాక అతను..
సాక్షి ప్రతినిధి, చెన్నై : స్నేహితురాలు రంజాన్ విందుకు ఆహ్వానిస్తే బిర్యానీతో సహా నగలు భోంచేసిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై సాలగ్రామం అరుణాచలం రోడ్డులోని ఒక అపార్టుమెంట్లో నివసించే దాక్షాయణి (34) ప్రముఖ బంగారునగల దుకాణంలో పనిచేస్తోంది. అదే దుకాణంలో మేనేజర్‌గా పనిచేసే తారా అనే మహిళను రంజాన్ విందుకు దాక్షాయణి ఆహ్వానించింది. తార తన బాయ్‌ఫ్రెండ్ మహమ్మద్ అబూబకర్ (27)తో కలిసి ఈనెల 3వ తేదీన విందుకు వెళ్లింది. ఇద్దరూ కలిసి వేడివేడి బిర్యానీ ఆరగించి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తరువాత దాక్షాయణి తాను బయటకు వెళ్లేందుకు బీరువా తెరిచి చూడగా రూ.1.45 లక్షల విలువైన మూడు బంగారు గొలుసులు, వజ్రాల దండ కనిపించలేదు. అయితే, తార, అబూబకర్ మినహా వేరెవ్వరూ ఇంటికి రాకపోవడంతో దాక్షాయణి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అబూబకర్‌ను విచారించగా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి పొట్టభాగాన్ని స్కాన్ చేయగా నగలు కనపడ్డాయి. రంజాన్ వేళ మద్యం తాగేందుకు డబ్బు లేకపోవడంతో చోరీకి పాల్పడ్డానని చెప్పాడు. బిర్యానీ తయారీలో దాక్షాయణి బిజీగా ఉన్న సమయంలో బీరువా తెరిచి నగలు దొంగలించానని, బిర్యానీ మధ్యలో నగలు పెట్టి మింగేశానని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. అతడికి వెంటనే ఎనిమా ఇచ్చి నగలను బయటకు తీసి దాక్షాయణికి అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేయగా ఫిర్యాది వేడుకోవడంతో హెచ్చరించి వదిలిపెట్టారు. -
కుక్కను కరిచాడు!
ఫెయిర్‌ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
ఇన్స్టాగ్రామ్ ఆధారంగా దారి దోపిడీ దొంగ అరెస్టు
పెదకాకాని: జాతీయ రహదారిపై దారిదోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. పెదకాకాని పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన నామాల సతీష్ అతని తండ్రి రామకృష్ణారావులు నవంబరు 18న తెనాలి మండలం కొలకలూరి గ్రామంలో మేనత్త ఇంట జరుగుతున్న కార్తీకవ్రతం కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో ఇరువురూ స్కూటీపై బయలు దేరారు. తక్కెళ్ళపాడు మానస సరోవరం సమీపంలో హైవే ఎక్కేందుకు స్పీడ్ బ్రేకర్లు దాటుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన యర్రంశెట్టి శివకోటేశ్వరరావు, షేక్ షరీఫ్‌లు వారి పల్సర్ బైక్‌తో స్కూటీని ఢీ కొట్టారు. స్కూటీపై ఉన్న వారు కింద పడి దెబ్బలు తగలడంతో వారిని బెదిరించి రామకృష్ణారావు వద్ద ఉన్న రూ. 4000 రూపాయలు నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారీ అయ్యారు. ఈ సమయంలో సతీష్ బైక్ నంబరు గుర్తించడంతో పాటు నిందితుణ్ణి పరిశీలించాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సతీష్‌ను విదేశాలకు పంపించే ప్రయత్నంలో పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే విరమించుకున్నారు. ఇన్స్టాగ్రామ్ చూడడం అలవాటు ఉన్న సతీష్‌కు ప్రెండ్ రిక్వెస్ట్‌లో నిందితుణ్ణి గుర్తించాడు. తండ్రికి చూపించడంతో అతనేనని ధృవీకరించాడు. ఈనెల 10వ తేదీన పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన వివరించాడు. బాధితుడు సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన నిందితుడు యర్రంశెట్టి శివకోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని అతను ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు షరీఫ్ పరారీలో ఉన్నాడు. హైవేలపై చీరీలకు పాల్పడుతున్న నిందితుడు శివకోటేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని సీఐ బి సురేష్‌బాబు తెలిపారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ రాజేంద్ర, కానిస్టేబుళ్లు టి శ్యాంసన్, యానాదిలను అభినందించారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
సినీ ఫక్కీలో దొంగల అరెస్ట్
-
రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నకిలీ ధృవపత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రూ.కోటికిపైగా రుణాలు పొంది బురిడి కొట్టించాడు.. అడ్డదారులు తొక్కి ఆర్థికంగా చితికిపోయి భిక్షాటన చేసే స్థితి చేరుకు న్నాడు.. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు.. అయితే 15 ఏళ్ల తర్వాత ఆ నిందితుడిని కరీంనగర్ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా నిందితుడు కుందన శ్రీనివాస్ రావు అలియాస్ శశాంకరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీనివాస్‌రావు 1991లో ఇంజనీరింగ్ పూర్తిచేసి పైవ్రేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. 2006 నుంచి విలాసవంత మైన జీవితానికి అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించాడు. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోటికి పైగా రుణాలు పొందాడు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇలాగే మోసా లుచేశాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వరంగల్, హైదరాబాద్, గుంటూరు, హన్మకొండ, కరీంనగర్ టూటౌన్లో కలిపి మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. అలిపిరి మెట్లపై భిక్షాటన.. 2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ కొంత కాలం, తిరుపతిలో కొంతకాలం హోటళ్లలో పనిచేశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో జీవితం దుర్భరంగా మారింది. చివరికి అలిపిరి మెట్ల మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబంతో సం బంధాలు కోల్పోయిన శ్రీనివాస్‌రావు కనిపించడం లేదని బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచే స్తున్న అతని తమ్ముడు శ్రీధర్ 2018లో వరంగల్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులకు తిరుపతిలో భిక్షా టన చేస్తున్న శ్రీనివాసరావును నిజామాబాద్ నుంచి వచ్చిన కొందరు గమనించి సమాచారాన్ని అతని సోదరుడు శ్రీధర్‌కు అందించారు. అతను తన అన్నను బెంగుళూర్ తీసుకెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. ఫోన్‌కాల్స్ ఆధారంగా.. కరీంనగర్ పోలీసులు ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా శ్రీనివాసరావు ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ రావును గాలించేందుకు టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ పర్యవేక్షణలో ఏఎస్ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ, రమేశ్, సంపత్తో ఓ బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందానికి చెందిన పోలీసులు శ్రీనివాస రావుకు గతంలో జామీను ఇచ్చిన వారిని, తెలి సిన వారిని ఆరా తీశారు. శ్రీనివాసరావు కుటుం బసభ్యుల ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. అలా బెంగుళూర్లో ఉన్నట్లు నిర్ధారించుకొని ఆచూకీ కనుగొన్నారు. జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి మురళితో కూడిన బృందం 2 రోజులు బెంగళూర్‌లో గాలించి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కరీంనగర్‌కు తరలించారు. గతంలోని వారెంట్లతోపాటు నకిలీ పాన్‌కార్డు, ఆధార్ కార్డులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులను సీపీ అభినందించి రివార్డులు అందించారు. -
దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. గతేడాది సెప్టెంబరులో ప్రతిమలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. గోప్యంగా విచారణ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్.. వెస్ట్‌జోన్ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆలయంలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అలాగే, ఆ సమయంలో దేవాలయ అభివృద్ధి పనుల కోసం పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులను పోలీసులు విచారించారు. చోరీ జరిగిన సమయంలో పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు, ఫోన్ కాల్‌డేటాతోపాటు టవర్ లోకేషన్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా చోరీ జరిగిన సమయంలో దుర్గగుడి సమీపంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పంపి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి గోప్యంగా విచారిస్తున్నారు. విచారణలో తానే అపహరించినట్లు సాయిబాబా అంగీకరించాడని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ వెండి ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించాడని, వాటిని సదరు వ్యాపారి కరిగించినట్లు తెలిసిందని, ఆ వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయిబాబాపై ఇప్పటివరకు 100కు పైగా కేసులున్నాయని.. వీటిలో అత్యధిక కేసులు ఆలయాలకు సంబంధించినవేనని వివరించారు. దొంగ దొరికింది ఇలా.. ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి నిందితుడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి రావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చోరీ తీరును తెలుసుకునే క్రమంలో నిందితుడు సాయిబాబాను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ చేయనున్నారు. కొండపైకి ఎప్పుడు చేరాడు? ఏ సమయంలో చోరీకి పాల్పడ్డాడు? తర్వాత వాటిని తీసుకుని ఏ మార్గంలో బయటపడ్డాడు? ఎక్కడ వాటిని దాచాడు? ఎవరికి విక్రయించాడు? ఇతరులు ఎవరైనా సహకరించారా? అనే అంశాలపై నిందితుడిని విచారణ చేయనున్నామని ఆ అధికారి వివరించారు. -
అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు
సాక్షి, విశాఖపట్నం: పెళ్లికి వచ్చిన అతిథిలా రిసార్ట్స్‌లోకి ప్రవేశించాడు. అంతా కలయతిరిగాడు. విందు భోజనం ఆరగించాడు. ఆపై పెళ్లి కుమార్తె నగలతో చాలా దర్జాగా ఓలా క్యాబ్‌లో ఉడాయించాడు. 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు(29)ను నగరపోలీసులు పట్టుకున్నారు. అతనినుంచి రూ. 26.5 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిప్రియ రిసార్ట్స్‌లో గత నెల 24న ఓ వివాహ వేడుకలో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఆ వివరాలను నగర పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ మనీష్‌కుమార్ సిన్హా బుధవారం మీడియాకు వెల్లడించారు. చదవండి: స్వామీజీల మాయాజాలం.. లబోదిబోమంటున్న రైతులు తెల్లారితే పెళ్లి.. ఓ తహసీల్దార్ కుమారునికి, మునగపాక మండలం సినసపల్లి తోటాడకు చెందిన టీచర్ కుమార్తెకు గత నెల 24న ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం నిశ్చయించారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు గదిలో ఉంచిన 53 తులాల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైంది. వధువు తల్లిదండ్రులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్యాడ్‌తో తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. దొంగిలించిన అభరణాలు ఆభరణాలు తాకట్టు పెట్టి జల్సాలు విజయవాడకు చెందిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు చిన్నప్పటి నుంచి బెంజ్ సర్కిల్లోని అనాథ ఆశ్రమంలో పెరిగాడు. గతంలో విజయవాడ సమీపంలో 7 కేసుల్లో నిందితుడు. విజయవాడ నుంచి విశాఖకు వచ్చి సిరిపురంలోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేశాడు. అది మానేసి విశాఖలో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. 10 కేసుల్లో నిందితుడు. మూడేళ్ల పాటు జైలులో కూడా ఉన్నాడు. జైలు నుంచి ఇటీవల విడుదలైన గంగాధర్ గత నెల 24న రాత్రి సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేశాడు. వధువు ఆభరణాలపై కన్నేశాడు. ఆమెకు కేటాయించిన 301 గదికి వెనక వైపు తక్కువ ఎత్తులో కిటీకీలుండడం, ఆ గదికి వెనుక వైపున వెలుతురు అంతగా లేకపోవడంతో.. చోరీకి స్కెచ్ వేశాడు. అక్కడి నుంచి బ్యాగ్ పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ఓలా క్యాబ్ బుక్ చేసుకుని శ్రీకాకుళం వెళ్లిపోయాడు. సోంపేటలోని మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో 6 తులాలు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో తిరిగి విశాఖకు వచ్చి జల్సాలు చేస్తున్నాడు. సీసీ కెమెరాలతో దొరికిన దొంగ జాడ రిసార్ట్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగ జాడను పోలీసులు కనిపెట్టారు. నగరంలో జల్సాలు చేస్తున్న గంగాధర్‌ను మంగళవారం మధ్యాహ్నం పూర్ణామార్కెట్‌లో అరెస్ట్ చేశారు. తాకట్టు పెట్టిన ఆరు తులాలతో సహా మొత్తం 53 తులాల బంగారు ఆభరణాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి ఈ సందర్భంగా సీపీ మనీష్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ నగరంలోని రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో రాత్రి గస్తీ పెంచామన్నారు. 333 మంది పోలీసులతో వార్డు రక్షక దళాలను నియమించినట్టు చెప్పారు. అనంతరం కేసును ఛేదించిన పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. డీసీపీ క్రైం సురేష్‌బాబు, ఏడీసీపీ క్రైం వేణుగోపాలనాయడు, ఏసీపీ (క్రైం)శ్రావణ్‌కుమార్, సీఐలు అవతార్, రామచంద్రరావు, సీహెచ్.సూరినాయడు, ఎస్ఐలు జి.అప్పారావు, పి.శివ, కె.మధుసూదనరావు, సోమేశ్వరరావు, ఏఎస్ఐలు శ్రీనివాసరాజు, రాజు, శేఖర్, పి.చిన్నరాజు, సిబ్బంది లక్ష్మణ్, ఎం.శేకర్, కె.వి శ్రీధర్, ఎ.దిలీప్, సోమశేఖర్‌లను అభినందించారు. చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులకు వధువు, ఆమె తండ్రి రామ కోటేశ్వరారవు ధన్యవాదాలు తెలిపారు. నగలు పోయినప్పటి నుంచి మాకు కంటి నిండా నిద్ర కరవైందని వారు తెలిపారు. 28 రోజుల్లో దొంగను పట్టుకుని ఆభరణాలు అప్పగించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా, డీసీపీ(క్రైం) సురేష్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. -
48 గంటల్లోనే పట్టేశారు..
ఏలూరు టౌన్: ఇంట్లో బంగారు ఆభరణాలను అపహరించిన దొంగను పోలీసులు రెండు రోజుల్లోనే అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్ సీఐ అనసూరి శ్రీనివాసరావు, పెదపాడు ఎస్ఐ జ్యోతిబసు ఉన్నారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన ఉదయ భాస్కర్‌రెడ్డి, నాగకళ్యాణి భార్యభర్తలు. వీరిద్దరూ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యక్తిగత పనులపై ఈనెల 25న ఇంటికి తాళాలు వేసి వీరు వేరే గ్రామానికి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్ళి చూసుకోగా ఇంట్లో ఉండాల్సిన 13కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పెదపాడు ఎస్ఐ జ్యోతిబసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నల్లజర్ల గ్రామానికి చెందిన ఎస్కే రహీమ్ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం 48 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. నిందితుడ్ని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ జ్యోతిబసు, హెచ్‌సీ సువర్ణరాజు, కానిస్టేబుల్ ప్రదీప్, వెంకటేశ్వరరావు, నరేష్‌లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'
-
'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు చోరీ చేస్తున్న బీహార్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. కోటి విలువైన నగలు, ఒక టీవీఎస్ అపాచీ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 9న పెద్ద మొత్తంలో డైమండ్, బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బంజారాహిల్స్ పీఎస్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కేసును ఒక సవాలుగా తీసుకొని చేధించినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితులందరూ బీహార్ రాష్ట్రంలోని మధుబని ప్రాంతానికి చెందినవారని, వీరి గ్యాంగ్‌కు రామషిష్ ముఖియా నేతృత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడే ముందు నెల రోజుల ముందే రెక్కీ నిర్వహించి వంట మనుషులుగా చేరుతామని వచ్చి వారిని నమ్మించి ఆ తర్వాత పెద్ద మొత్తంలో చోరీలకు పాల్పడుతారని వెల్లడించారు. ఇదే విధంగా గత డిసెంబర్లో బాధితుని ఇంట్లో వంట మనుషులుగా చేరి వారందరూ ఫంక్షన్‌కు వెళ్లగానే రూ 1.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్ నగలను చోరీ చేశారని సీపీ తెలిపారు. గతంలోనూ రామషిష్ ముఖియాపై బీహార్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు తెలిసిందని వెల్లడించారు. A1 రామాషిష్ ముఖియా, A2 భగవత్ ముఖియా,A3 రాహుల్ ముఖియా, A4 పీతాంబర్ మండల్, A5 బోలా ముఖియా, A6 హరిష్ చంద్ర ముఖియాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని, చోరీలు చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడరని తెలిపారు. కాగా వీరు చోరీకి పాల్పడిన తర్వాత బీహార్‌కు వెళ్లారని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నెలరోజుల పాటు బీహార్‌లో గాలించి నిందితులను పట్టుకున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే చోరీ చేసిన డైమండ్ నగలను సిమెంట్‌తో కప్పి వేసి బంగారాన్ని మాత్రం ఓ దుకాణంలో అమ్మివేసినట్లు నిందితులు తెలిపారని శ్రీనివాస్ పేర్కొన్నారు. -
గ్వాలియర్ టు.. సిద్దిపేట
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న జిల్లా పోలీసులు అంతర్ జిల్లానే కాదు.. అంతర్ రాష్ట్ర దొంగల గుట్టురట్టు చేశారు. సిద్దిపేటలో నేరం చేసిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన టైర్ల దొంగలుగా గుర్తించారు. వీరిని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు, సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) తదితర సాధనాలే నేరస్తులను పట్టుకునేందుకు కీలకంగా మారాయి. సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తాటిపాముల రమేశ్ సెప్టెంబర్ 21న ఆ గ్రామ శివారులో లారీని ఉంచి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. ఈ విషయాన్ని కోహెడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బస్వాపూర్ నుంచి లారీని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి ఆ లారీకి ఉన్న 14 టైర్లు, డెక్స్, బ్యాటరీ, ఇతర సామగ్రిని తేసుకెళ్లారు. మొత్తం రూ.10 లక్షల విలువగల వస్తువులను దొంగిలించారు. సిగ్నల్ ఆధారంగా గుర్తింపు లారీ అపహరణపై ఫిర్యాదు అందుకున్న సిద్దిపేట స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముందుగా లారీ నిలిపిన స్థాలాన్ని పరిశీలించారు. ముందుగా డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. కానీ ఆధారాలు లభించలేదు. ఆ రాత్రి బస్వాపూర్ నుంచి సిద్దిపేట వరకు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దీంతో ఆ లారీ సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు రాజీవ్ రహదారి వెంబడి వెళ్లినట్లు గుర్తించారు. అలాగే ముందుకు వెళ్లిన పోలీసులకు టైర్లు, బ్యాటరీ, ఇతర వస్తువులు లేకుండా రాళ్లపై ఉంచిన లారీ గుర్తించారు. లారీ ఆపిన బస్వాపూర్, లారీ టైర్లు తీసిన ఇబ్రహీంనగర్ పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి ఎవరెవరు, ఎక్కడికి మాట్లాడిన డైటా సేకరించారు. సీసీ ఫుటేజీలో లారీ దొంగలను చూసిన పోలీసులు దొంగలు మన రాష్ట్రానికి చెందిన వారు కాదని గుర్తించారు. దీంతో ఫోన్‌కాల్స్‌పై దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోన్ కాల్స్ ముందుగా గుర్తించారు. వారిలో పాత నేరస్తుల ఫోన్ నంబర్‌తో సరిచూశారు. నంబర్లు సరిపోలడంతో దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించారు. వారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో జిల్లా నుంచి నలుగురు పోలీసుల బృందం గ్వాలియర్‌కు వెళ్లి నేరస్తుల ఆచూకీ తెలుసుకున్నారు. అక్కడి పోలీసుల సహకారంతో లారీ దొంగతనంతో సంబంధం ఉన్న ఆరుగురిని పట్టుకొని విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నేరస్తులను రిమాండ్‌కు పంపించారు. నూతన పరిజ్ఞానంతో సులభం నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగుల సహకారంతో నేరస్తులను పట్టుకోవడం సులభతరం అవుతోంది. జిల్లాలోని 420 గ్రామాలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. టెలికమ్యూనికేషన్ రంగం ద్వారా పలు విషయాలను సేకరించాం. వేలి ముద్రల సేకరణ ఇతర అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొంటున్నాం. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. –జోయల్ డేవిస్, పోలీస్ కమిషనర్ సాంకేతిక పరిజ్ఞానం కేసులు రికవరీ సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు రూ. 65లక్షలు వేలి ముద్రల ద్వారా 33 కేసులు రూ. 40లక్షలు ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు రూ. 3.70లక్షలు ఛేదించిన కేసుల వివరాలు సీసీ కెమెరాల ద్వారా 85 కేసులు వేలి ముద్రల ద్వారా 33 కేసులు ఎఫ్ఆర్ఎస్ సిస్టం 10 కేసులు -
‘డిక్కీ’ దొంగ ఆటకట్టు
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వచ్చేవారి వాహనాల నుంచి చాకచక్యంగా నగదు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న వ్యక్తిని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ క్రైం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు తమ బైక్‌లను పార్కు సమీపంలో పార్కింగ్ చేస్తుంటారు. వీరిలో కొందరు యాక్టీవా బైక్‌ల సీట్ల కింద తమ పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులను భద్రపరిచి లోపలికి వెళ్తుంటారు. దీనిని అదునుగా తీసుకుని గత కొంత కాలంగా అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ స్క్రూడ్రైవర్‌తో సీటు తొలగిస్తూ అందులో ఉన్న వస్తువులు తస్కరిస్తున్నాడు. గత నెల రోజుల్లో ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. గురువారం ధరంకరం రోడ్డుకు చెందిన రఘు అనే వ్యక్తి తన బైక్‌ను పార్కింగ్ చేసి లోపలికి వెళ్లగా దీనిని గుర్తిం,ఇన సత్యనారాయణ డిక్కీలో నుంచి రూ. 4,800 నగదు తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా పార్కు ముందు డ్యూటీలో ఉన్న ఇంటర్‌సెప్టర్ వెహికిల్ కానిస్టేబుళ్లు ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్ యాదవ్, హోంగార్డు రాజేశ్వర్‌జీ అతడిని గుర్తించారు. దీనిని పసిగట్టిన సత్యనారాయణ పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా సందులోకి పరిగెత్తుతుండగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులకు అప్పగించారు. గత కొంత కాలంగా పార్కింగ్ చేసిన వాహనాల్లోంచి సెల్ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చీటీల పేరుతో మోసం చేసిన జంట అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని నర్సాపురంలో చిట్‌ఫండ్ పేరుతో సుమారు రూ. 6 కోట్లు టోకరా వేసి పరారైన కంచన రమేష్, దివ్య దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహరంలో మొదటి నుంచి వారికి సహకారం అందిస్తున్న సమీప బంధవు సూరత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్ ఫండ్‌తో పాటు అధిక వడ్డీ ముసుగులో జిల్లాకి చెందిన పలువురిని మోసానికి గురి చేశారు. అంతేకాకుండా తమ స్నేహితులు, సన్నిహితుల నుంచి బంగారం తీసుకుని చివరికి వారికి కూడా కుచ్చు టోపీ పెట్టారు. అయితే తిరిగి నగలు, నగదు అడిగే సరికి ఆ జంట మొఖం చాటేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య 60 మంది పైనే ఉంటుందని డీఎస్పీ నాగేశ్వర రావు మీడియాకు వెల్లడించారు. -
దొంగ పోలీసు అరెస్ట్
నూజివీడు : పోలీస్ ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుని దాన్ని ధరించి ఎస్ఐని అని చెప్పుకుంటూ తిరగడమే కాకుండా, బండిపై వెనుక, ముందు భాగంలో ‘పోలీస్’ అని రాసుకుని తిరుగుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు సీఐ మేదర రామ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కొత్తపేట ముస్లిం బజారుకు చెందిన షేక్ సలీంమాలిక్ (26) డిగ్రీ చదువుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో పోలీసు డ్రెస్ కుట్టించుకుని దాన్ని ధరించి వీధులలో తిరుగుతుండటమే కాకుండా తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. ఈ నేపథ్యంలో స్థానిక ట్రిపుల్ ఐటీ వద్ద మధ్యాహ్న సమయంలో పట్టణ ఎస్ఐ రంజిత్‌కుమార్ వాహనాలను చెక్ చేస్తుండగా అనుమానం వచ్చి ఆపి ఎక్కడ ఎస్ఐగా పని చేస్తున్నారని ప్రశ్నించారు. సలీంమాలిక్ తడబడుతూ సమాధానం సరిగా చెప్పలేదు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ పోలీస్ అని తేలింది. దీంతో ఎస్ఐ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ, రూరల్ ఎస్ఐలు రంజిత్‌కుమార్, చిరంజీవి పాల్గొన్నారు. -
30 ఏళ్లుగా తప్పించుకుంటున్న దొంగ అరెస్ట్
పిడుగురాళ్లటౌన్: 30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను ఆపి దోపిడీలు చేస్తుండేవారు. అప్పుడే మల్లికార్జునరెడ్డిపై కేసు నమోదైంది. అప్పటినుంచి అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే క్రమంలో ఈ దొంగ కేసు బయటపడింది. ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలని సీఐ నిర్ణయించుకుని ఓ బృందాన్ని పాత ఫొటో ఇచ్చి కర్నూలుకు పంపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కర్నూలులో దోపిడీదొంగ మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేసి పిడుగురాళ్లకు తీసుకువచ్చారు. ఈ విషయం సత్తెనపల్లి డీఎస్పీకి తెలియడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసును ఛేదించినందుకు సీఐ హనుమంతరావును, ఎస్ఐ హరిబాబును, పోలీసు బృందాన్ని అభినందించారు. -
ఏసోబు చేయిపడితే...
సాక్షి, సిటీబ్యూరో: ఏపీలోని ప్రకాశం జిల్లాలో పుట్టాడు... బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు... కొన్నాళ్ల పాటు మేస్త్రీగా పనిచేశాడు... దుర్వ్యసనాల కారణంగా దొంగగా మారాడు... ఎలాంటి తాళమైనా పగులకొట్టి చోరీలకు పాల్పడే ఘరానా చోరుడు ఏసోబు నేపథ్యమిది. రెండున్నరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్ మొహియుద్దీన్‌తో కలిసి బుధవారం తన కార్యాలయంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు బానిసై.. ప్రకాశం జిల్లా కల్లూరివారిపాలెం ప్రాంతానికి చెందిన ఎం.ఏసు అలియాస్ ఏసోబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అయితే మద్యం, పేకాట, వ్యభిచారం వంటి వ్యసనాలతో పాటు స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడానికి బానిసగా మారడంతో మేస్త్రీ పనితో వచ్చే ఆదాయం చాలలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. 1996లో బంజారాహిల్స్ పరిధిలో తొలినేరం చేసి పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఏడాది రెండు కేసులకు సంబంధించి గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఏసోబు కొన్నేళ్ల పాటు కామారెడ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో మేస్త్రీ పని చేసుకుని బతికాడు. ఆ ఆదాయంతో సంతృప్తి చెందని అతను 2015లో మళ్లీ సిటీకి మాకాం మార్చి భోజగుట్టలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండున్నరేళ్లలో 21 నేరాలు... పాత పంథా ప్రారంభించిన ఏసోబు తాళం వేసున్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకునేవాడు. గోడ దూకడం, తాళం పగుల కొట్టడం, కిటికీ గ్రిల్స్ తొలగించడం ద్వారా ఇంట్లోకి ప్రవేశించే వాడు. ఎలాంటి బీరువా/అల్మారా అయినా తాళం తేలిగ్గా పగులకొట్టే వాడు. దీనికోసం ఇతగాడు కొన్ని ఉపకరణాలను సైతం తయారు చేసుకున్నాడు. అందులో ఉన్నదంతా ఊడ్చుకెళ్లేవాడు. గోల్కొండ, నార్సింగి, రాయదుర్గం ఠాణాల పరిధిలోని షేక్‌పేట, వైఎస్సార్ కాలనీ, మణికొండల్లో 21 నేరాలు చేశాడు. రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి తస్కరించాడు. నార్సింగిలో దొరికిన వేలిముద్రలు... షేక్‌పేటలోని సయ్యద్ హసన్ షరీఫ్ ఇంట్లో ఆగస్టు 24న చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో అనుమానితుడి వేలిముద్రలను సేకరించారు. వీటిని చుట్టుపక్కల ఉన్న పోలీసుస్టేషన్ల రికార్డుల్లో ఉన్న వాటితో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే 2015లో నార్సింగ్ పరిధిలోని ఓ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో లభించిన వాటితో సరిపోలాయి. దీని ఆధారంగా ఏసోబు నిందితుడిగా గుర్తించారు. రెండున్నరేళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని పట్టుకోవడానికి గోల్కొండ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్, ఎస్సై పి.వాసుదేవ్‌ల నేతృత్వంలో బృందం ఏర్పాటైంది. ముమ్మరంగా గాలించిన పోలీసులు బుధవారం గుడిమల్కాపూర్‌లో అతడిని అరెస్టు చేశారు. ఇతడిచ్చిన సమాచారంతో 60.5 తులాల బంగారం, 2.83 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఏసోబు నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి సిఫార్సు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
భువనగిరి :స్నేహితులతో కలిసి ఆవారాగా తిరిగే ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సరదాలను తీర్చుకునేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు..చిల్లర దొంగతనాల నుంచి అంతర్రాష్ట్ర స్థాయికి ఎదిగాడు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డాడు. వాంటెండ్ క్రిమినల్‌గా మారి, చివరకు పోలీసులకు చిక్కాడు. భువనగిరి రూరల్ సీఐ జువ్వాజి నరేందర్‌గౌడ్ శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డితో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం సర్వాయ్పాడు పాతబంజర్ గ్రామానికి చెందిన పోడియం మాధవరావు స్వగ్రామంలోనే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మొదటి దొంగతనం స్వగ్రామంలోని కిరాణ దుకాణంలో చేసి పోలీసులకు చిక్కాడు.18 నెలల శిక్ష అనుభవించిన అనంతరం గత ఏడాది జూలై 4వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. బయటికి వచ్చిన మాధవరావు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 24 కేసుల్లో 10 లక్షలకు పైగా సొత్తును అపహరించాడు. ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేయడమే గాకుండా తన స్నేహితుడు బాలకృష్ణ ఇండికా కారుకనుగోలు చేసేందుకు రూ.లక్ష అప్పు ఇచ్చాడు. అన్ని చోరీలు ఒంటరిగానే... మాధవరావు ఒంటరిగానే దొంగతనాలు చేసేవాడు. ఎవరి సహాయం తీసుకోడు. తన స్నేహితుడు కారులో ఉదయం చోరీ చేసే దుకాణాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా వచ్చి గడ్డపారతో దుకాణాల షట్టర్లు పైకిలేపి చోరీలు చేసేవాడు. చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ ఏడు జిల్లాల పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన భువనగిరి మండలం రాయగిరిలో మెయిన్‌రోడ్డుపై గల వెంకటేశ్వర, నాగార్జున వైన్స్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి ఓ చోట విఫలమయ్యాడు. అయితే వెంకటేశ్వర వైన్స్ గల్లాపెట్టెనుంచి 2లక్షల రూపాయలు అపహరించుకుపోయాడు. అలాగే గత సంవత్సరం 2013 సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి భువనగిరి పట్టణంలోని సనా మెడికల్ దుకాణంలో రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు. పట్టుబడ్డాడు ఇలా.. నల్లగొండ జిల్లా బీబీనగర్ టోల్గేట్ సమీపంలో శనివారం పోలీస్‌లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న మాధవరావును పోలీసులు తనిఖీ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయపెట్టాడు. వెంటనే నివా సం ఉంటున్న హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌కు వెళ్లి అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు రూ.3.28 లక్షల నగదు, పల్సర్ మోటార్‌సైకిల్, ఒక తులం బంగారు గొలు సు, అకాయ్టీవి, హోంథియేటర్, 4 సెల్ఫోన్లు, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన సొత్తుతో కారు కొన్న బాలకృష్ణ, చోరీలకు పాల్పడిన మాధవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో భువనగిరి రూరల్ ఎస్ఐ భిక్షపతి, ఏఎస్ఐ బాసు, కానిస్టేబుల్ సిరాజ్, రాజు, సిబ్బంది మధు, నర్సింగ్, మహేందర్‌లు సహకరించారని చెప్పారు.