శంషాబాద్‌లో 800 కేజీల గంజాయి పట్టివేత..వెలుగులోకి సంచలన విషయాలు | 800 Kg Ganja Seized By Cyberabad Police, More Details Inside | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో 800 కేజీల గంజాయి పట్టివేత..వెలుగులోకి సంచలన విషయాలు

Published Sun, Aug 4 2024 10:18 AM | Last Updated on Sun, Aug 4 2024 7:38 PM

800 kg ganja Seized  by Cyberabad police

సాక్షి,హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కెమికల్‌ డ్రమ్ములతో వెళ్తున్న కంటైనర్‌పై సైబరాబాద్‌ పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు కంటెర్‌ను ఆపి సోదాలు నిర్వహించారు.

 ఈ సోదాల్లో 800 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఒడిశా నుంచి మహరాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. నాణ్యమైన శీలావతి రకం గంజాయిని ముంబై పోర్టు ద్వారా విదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. 

కాగా, గంజాయి స్మగ్లింప్‌పై  సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ..

👉శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద భారీ గా గంజాయి పట్టుకున్నాం

👉శంషాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్తగా ఆపరేషన్ నిర్వహించి గంజాయి పట్టుకున్నాం.

👉కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు 800 కిలోలు గంజాయి సీజ్ చేశాము.

👉పట్టుబడ్డ గంజాయి విలువ రెండు కోట్ల ఎనబై లక్షల వరకు ఉంటుంది

👉ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నారు

👉అరకుకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్ లో  కీలక నిందితుడు

👉బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమిషన్ ఏజెంట్గా వ్యవహరిస్తూ ట్రాన్స్‌ పోర్టర్‌గా ఉంటున్నాడు

👉గంజాయి ట్రాన్స్‌పోర్ట్‌ చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్‌పోర్ట్‌కు మూడు లక్షలు తీసుకుంటాడు

👉మహారాష్ట్ర కు చెందిన రిసీవర్ మారుతి పటేల్ పరారీలో ఉన్నాడు అతన్ని త్వరలోనే పట్టుకుంటాం

👉మహారాష్ట్రలో మారుతి గంజాయి రిసీవ్ చేసుకున్న తర్వాత మహారాష్ట్ర తో పాటు కర్ణాటకలో డ్రగ్‌ పెడ్లర్‌లకు సప్లై చేస్తాడు

👉ఈ కేసులో సంజీవరెడ్డి బీదర్‌కు చెందిన వ్యక్తి డ్రైవర్ కం ట్రాన్స్‌పోర్ట్‌గా ఉన్నాడు

👉సంజీవ్ విట్టల్ రెడ్డి ఈనెల 31న ఫుడ్ ఐటమ్స్ లోడ్ తీసుకుని వైజాగ్ డీమార్ట్ కు వెళ్ళాడు

👉అక్కడనుండి వస్తూ వస్తూ రాము సహకారంతో తన కంటైనర్ లో గంజాయి తీసుకుని వచ్చాడు

👉నిందితులు అంతా కలిసి ఎంతకాలంగా గంజాయి సప్లై చేస్తున్నారు విచారిస్తున్నాం

👉ప్రధాన నిందితుడు రాముతో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు

👉పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కంటైనర్‌ ముందు నిందితులు కారులో ఎస్కార్ట్ గా వచ్చారు

👉కంటైనర్ కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి ఎక్కడైనా పోలీసుల తనిఖీలు ఉంటే అప్రమత్తం చేస్తారు

👉పోలీసుల నిఘానుండే తప్పించుకోవడానికి టోల్గేట్ వద్దకు కంటైనర్ రాగానే వాహనం నంబర్ ప్లేట్ మారుస్తారు

👉నిందితులపై అనుమానంతో 15 నుండి 25 రోజులు వరకు ఈ కేసు పై వర్కౌట్ చేశాం  

👉నిందితులు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి  పటాన్‌ చెరువు వద్ద మరొక వెహికల్ లో గంజాయిని మారుస్తారు

👉మార్చిన ఆ వెహికల్‌లో గంజాయిని మహారాష్ట్రకు తీసుకువెళ్తారు

👉విట్టల్ రెడ్డి పరవాడ సెజ్ లో సాల్వెంట్ డ్రమ్ములను కంటైనర్ లోడ్ చేసుకున్నాడు

👉కంటైనర్ ముందు భాగంలో సాల్వెంట్ డ్రమ్స్ పెట్టి వెనకాల భాగంలో గంజాయి ఉంచారు

👉కెమికల్స్ డ్రమ్ములను కూడా  జీఎస్టీ వేబిలు లేకుండా తరలిస్తున్నారు

👉ఆ కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా విచారణ చేస్తాం

👉మొత్తం ఏడుగురు నిందితులు గంజాయి సప్లై లో భాగంగా ఉన్నారు..ఇందులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం

👉మిగతా ముగ్గురు నిందితులను పరారీలో ఉన్నారు..వారిని వీలైనంత త్వరగా పట్టుకుంటాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement