ఈ నెల మూడో వారంలో టెన్త్ ఫలితాలు!
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వీలైతే 20వ తేదీలోగానే వీటిని వెల్లడించాలని భావిస్తోంది. రెండో వారంలో (11, 12 తేదీల్లో) ఫలితాలను వెల్లడించాలని భావించినా పనులన్నీ పూర్తి కాకపోవడంతో మూడో వారంలో వెల్లడించాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో ఈసారి కొత్త విధానంలో ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకే రాత పరీక్షలు నిర్వహించడం, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉండటంతో ఆ రెండింటిని కలిపి గ్రేడ్ రూపొందించాలి. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడి మూడో వారానికి వాయిదా పడింది.