three hours
-
మూడు గంటల్లో.. 14.93 కుండపోత
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని వర్షం హడలెత్తించింది. పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ కావటంతో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన అతిభారీ వర్షంతో నగరంలో పలు కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. గుడిమల్కాపూర్‌లో 3 గం టల వ్యవధిలో 14.93 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. శివరాంపల్లిలో 14.05, మోండాలో 13.95, రెడ్‌హిల్స్‌లో 13.53 విజయనగర్‌కాలనీలో 13.2, తిరుమలగిరిలో 12.48, ముషీరాబాద్‌లో 11.98, శ్రీనగర్‌కాలనీలో 11.73 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరమంతటా సగటున 8.97 సెం.మీ. వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు నీటముని గాయి. కార్వాన్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో శుక్రవారం మధ్యాహ్నం దాకా సాధారణ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడిమల్కాపూర్, నానల్‌నగర్, టోలిచౌకి ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది. కార్వాన్, గోల్కొండ డివిజన్లలోడ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. మల్కాజిగిరిలో అవే అవస్థలు మల్కాజిగిరి, ఉప్పల్‌లో పలు కాలనీలు జలమయం కావటం, నాలాలు ఉప్పొంగటంతో జనాలు అవస్థల పాలయ్యారు. మల్కాజిగిరిలో బండచెరువు పరిసరాల్లోని కాలనీలు వరదనీటిలో మునిగిపోవటంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నాచారం హెచ్ఎంటీ నాలా ఉధృతంగా ప్రవహించటంతో ఉప్పల్– చిలుకానగర్, ఉప్పల్ –స్వరూప్‌నగర్‌లో రాకపోకలు మధ్యాహ్నం వరకూ నిలిచిపోయాయి. ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని కాలనీల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మల్కాజిగిరి వర్షమే రికార్డ్ నగరంలో ఇప్పటివరకు మల్కాజిగిరిలోనే రికార్డు వర్షం కురిసింది. 2017 సెప్టెంబర్ 14న మల్కాజిగిరిలో కురిసిన 20.15 సెం.మీ. వర్షపాతమే ఇప్పటివరకు అత్యధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం పేర్కొంది. కూలిన గోల్కొండ సెంట్రీ గది గోల్కొండ: భారీ వర్షాలకు చారిత్రక గోల్కొండ కోట మోతీ దర్వాజాను ఆనుకొని ఉన్న సెంట్రీ గది కూలింది. కోట నిర్మించిన అనంతరం నయాఖిల్లా నిర్మాణ సమయంలో మోతీదర్వా జా వద్ద ఈ గదిని నిర్మించారు. దర్వాజా వద్ద కాపలా ఉండే సైనికులు దీనిని రెస్ట్‌రూంగా ఉపయోగించేవారు. ఈ గదిలో ఫిరంగిగుండ్లు, విషసర్పాలు, తేళ్లను కూడా ఉంచేవారు. శత్రువులు కోటపైకి దండెత్తినప్పుడు దర్వాజా బయట కందకాలలో విషసర్పాలు, తేళ్లను వదిలేవారు. శత్రువులు కందకాల నుంచి ఈదుకుంటూ లోపలికి రాకుండా ఈ విధంగా చేసేవారు. కాగా, కూలే సమయంలో గదిలో ఒక ఎద్దు, 3 ఆవులు ఉన్నాయి. కూలిన తర్వాత రెండు ఆవులు, ఎద్దును బయటకు తీశారని కోట పరిరక్షణాధికారి ఎ.భానుప్రకాష్ వర్మ తెలిపారు. -
పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న
గాంధారి: ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. వరుస వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధారిలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. అఖిల పక్ష నేతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పంట నష్టం వివరాలు సేకరించడం లేదని ఆరోపించారు. నష్టపోయిన పంటలపై ప్రభుత్వం సర్వే చేయించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సభ్యుడు రాంకిషన్‌రావు, ఏవో యాదగిరి ఎంత నచ్చచెప్పినా రైతులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రాస్తారోకో చేశారు. తన రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం వర్షార్పణం అయిందని నేరల్‌తండాకు చెందిన మంజూరియా వాపోయారు. ప్రభుత్వం చెప్పడం వల్లే పత్తికి బదులు సోయా సాగు చేశామని, ఇప్పుడు పంట మొత్తం నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గాంధారికి చెందిన సాయిలు కోరారు. ఏవో యాదగిరి అక్కడకు చేరుకొని పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. సర్వే నెంబర్ల వారీగా పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక పంపిస్తామన్నారు. రైతులు పట్టా పాసుబుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు ఇవ్వాలని కోరారు. -
మూడు గంటల్లో 85 కోట్లు మాయం
టోక్యో: జపాన్ లో అంతర్జాతీయ నేరగాళ్ల భారీ చోరి ఉదంతం అక్కడి అధికారులకు చెమటలు పట్టించింది. నకీలీ ఏటీఎం కార్డులను ఉపయోగించి కోట్ల రూపాయల సొమ్మును క్షణాల్లో కాజేశారు. రాజధాని నగరం టోక్యో సహా మరో 16 ప్రధాన జిల్లాల్లోని ఏటీఎం లను లూఠీ చేసిన దొంగలు సుమారు 85కోట్ల 60 (12.7 మిలియన్ డాలర్ల) లక్షలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం 5 గంటలకు మొదలైన ఈ దందా ఎనిమిదిగంటల కల్లా అంటే కేవలం మూడే మూడుగంటల్లో తమ ప్లాన్ అమలు చేశారు. మే 15 ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఖాతాల వివరాలను తస్కరించి 1600 నకిలీ క్రెడిట్ కార్డులతో ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసిన దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఒకే రోజున ఇంత భారీ ఎత్తున దొంగతనం జరగడం అక్కడి అధికారుల్లో అలజడి రేపింది. అంతర్జాతీయ నేరస్థులు సుమారు 100 మంది ఈ చోరీలో పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. నేరానికి పాల్పడిన అనంతరం వీరు దేశం నుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై జపాన్ ఇంటర్ పోల్ విచారణ చేపట్టింది. మరోవైపు ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టాలని సౌత్ ఆఫ్రికా అధికారులను కోరింది. ఖాతాల వివరాలు, కార్డులు దొంగలకు ఎలా చేరాయో దర్యాప్తు చేయాలని కోరింది.