Tirumala srivari devotees
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
తిరుమల: భక్తులకు శ్రీవారి ధన ప్రసాదం
తిరుమల: భక్తులు శ్రీవారికి సమర్పిస్తోన్న చిల్లర నాణేలను తిరిగి భక్తులకే ధన ప్రసాదంగా అందించే వినూత్న ప్రయోగాన్ని టీటీడీ చేపట్టింది. ప్రస్తుతం కరెంట్ బుకింగ్‌లో రూ.500 గదులు పొందే భక్తులు కాషన్ డిపాజిట్‌గా రూ.500 అదనంగా చెల్లిస్తున్నారు. గదులు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు భక్తులకు ఆ మొత్తాన్ని టీటీడీ తిరిగి చెల్లిస్తుంది. ఈ కాషన్ డిపాజిట్‌ను ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధానాన్ని బుధవారం నుంచి టీటీడీ చేపట్టింది. ధన ప్రసాదంలో పసుపు, కుంకుమతోపాటు నాణేల ప్యాకెట్‌ను భక్తులకు అందజేస్తోంది. భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్ డిపాజిట్‌ను తిరిగి ఇస్తోంది. ప్రస్తుతం రూ.2.5 కోట్ల మేరకు నాణేలు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. వాటిని ధన ప్రసాదం రూపేణా భక్తులకు టీటీడీ అందిస్తోంది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం : టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ పీఆర్వో బుధవారం తెలిపారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ హోటల్‌ను, బెంగళూరులోని ఒక సంస్థకు కేటాయించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు నిరాధారమైన చౌకబారు ఆరోపణలు చేశారని చెప్పారు. అన్నమయ్య భవన్ హోటల్‌తో పాటు తిరుమలలోని అన్ని హోటళ్ల నుంచి బకాయిలను రాబట్టడానికి టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పారు. అసత్య వార్తలు ప్రచురించే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇవీ చదవండి: Andhra Pradesh: సిరి ధాన్యాలపై గురి మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం -
నేడు శ్రీవారి దర్శనం నిలిపివేత
తిరుమల: సూర్యగ్రహణం కారణంగా ఆదివారం (నేడు) తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది. కాగా, ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు. -
శ్రీవారి బంగారం బ్యాంకుల్లో భద్రం
ఎస్బీఐలో 1,800 కిలోలు డిపాజిట్ చేసిన టీటీడీ ఏడాదికి 12 కిలోల బంగారం వడ్డీగా చెల్లించనున్న బ్యాంకు టీటీడీ మొత్తం బంగారం డిపాజిట్లు 4,335 కిలోలు తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారాన్ని బ్యాంకుల్లో నిక్షిప్తం చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తెలిపారు. ఈ డిపాజిట్లపై ఒక శాతం వడ్డీని బంగారం రూపంలో చెల్లించేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు వివరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో 1,800 కిలోల బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తూ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఈవో గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ... ఎస్బీఐలో గోల్డ్ డిపాజిట్ స్కీం కింద ఐదేళ్ల కాలపరిమితికి 1,800 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఏడాదికి ఒక శాతం వడ్డీని బంగారు రూపంలో ఇచ్చేందుకు బ్యాంక్ అంగీకరించిందన్నారు. టీటీడీ డిపాజిట్ చేసిన స్వర్ణాభరణాలను ఎస్బీఐ ముంబైలోని మింట్‌కు తరలించి కరిగించి 0.9995 స్వచ్ఛత గల బంగారాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుందని చెప్పారు. ఇందుకయ్యే రవాణా, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, కరిగించి శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చులను వారే(ఎస్బీఐ) భరిస్తారన్నారు. ఈ డిపాజిట్లపై సంవత్సరానికి 12 కిలోల బంగారాన్ని వడ్డీ కింద బ్యాంక్ చెల్లిస్తుందని, ఆ బంగారాన్ని తిరిగి అదే బ్యాంక్‌లో డిపాజిట్ చే స్తామని చెప్పారు. టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో 4,335 కిలోల బంగారు డిపాజిట్లు కలిగి ఉందని తెలిపారు. వీటిపై సంవత్సరానికి 70 కిలోల బంగారం వడ్డీ రూపంలో అందుతున్నట్లు చెప్పారు. ఆ మేరకు 2010 నుంచి చేసిన డిపాజిట్లపై ఇప్పటివరకు 85 కిలోల వడ్డీ బంగారం అందినట్లు వివరించారు.