
మూసివేసిన శ్రీవారి ఆలయం
తిరుమల: సూర్యగ్రహణం కారణంగా ఆదివారం (నేడు) తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది. కాగా, ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment