భూమి ఆక్రమణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
భూమి ఆక్రమణపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎండికే నాయకుడు, తిరుపరాంకురం ఎమ్మెల్యే ఏ.కే.టీ.రాజాను అరెస్ట్ చేసినట్లు తమిళనాడు పోలీసులు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అయనపై భూమి అక్రమణ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జ్యూడిషియల్ కస్టడికి తరలించినట్లు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం... చెట్టిపట్టిలోని 50 ఏకరాల భూమి తనకు బహుమతిగా వచ్చిందని, ఆ భూమిని తన కుమారుడు అక్రమించాడని రాజా తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. అయితే తమ ఎమ్మెల్యే రాజాను వెంటనే విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుస్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు వారిని చెదరగొట్టి మద్దతుదారులను అక్కడ నుంచి పంపివేశారు.