took oath
-
నేడు ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణ స్వీకారం
సాక్షి,అమరావతి: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు చాంబర్లో ప్రమాణస్వీకారం చేస్తారు. అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. -
లోక్‌సభ: వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరికొందరు రేపు(మంగళవారం) ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఇంగ్లీషులో పీవీ మిథున్ రెడ్డి, తెలుగులో గురుమూర్తి , హిందీలో డాక్టర్ గుమ్మ తనూజరాణి ఎంపీలుగా ప్రమాణం చేశారు.కాగా, బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ప్రత్యేక హోదాపై గళం విప్పుతా..: గురుమూర్తి, తిరుపతి ఎంపీవైఎస్ జగన్ ఆశీస్సులు, తిరుపతి ప్రజల మద్దతుతో రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉంది. పులికాటు సరస్సు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తీసుకురావడం నా ప్రాధాన్యత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉన్నా టీడీపీ అడగకపోవడం బాధాకరం. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో గళం విప్పుతా.. ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం వైద్య సదుపాయాలు కోసం కృషి చేస్తా: గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీనాకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు. అరకు పార్లమెంట్లో వైద్య సదుపాయాలు, రోడ్లు మెరుగుపరచడానికి కృషి చేస్తా. వైఎస్సార్సీపీ కండువాతో ప్రమాణ స్వీకారం చేశా. నేను పార్టీ మారి ప్రసక్తే లేదు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ తోనే కలిసి ప్రయాణం చేస్తాం. -
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణస్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళవారం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
AP: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు గురువారం ప్రమాణం చేశారు. ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. -
టీటీడీ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం
సాక్షి, తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా వైద్యనాథన్ కృష్ణమూర్తి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద 7.10 గంటలకు ఆయన చేత ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో కృష్ణమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆయనకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.