Tork Motors
-
స్టైలిష్ డిజైన్‌తో టార్క్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ - క్రాటోస్ ఎక్స్‌ని ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఈ-మోటార్‌సైకిల్ క్రా టోస్ ఆర్(kratos R) పేరిట తీసుకొచ్చింది. వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని టార్క్ కంపెనీ ప్రకటించింది. 2023 రెండో త్రైమాసికంలోఈ మోటార్ సైకిల్ బుకింగ్‌లు ప్రారంభం. మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి ఉన్నామని TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు. బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీతో స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు. తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అత్యుత్తమ పవర్‌ట్రెయిన్, టార్క్‌ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్‌లో డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చని టార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాటోస్ ఆర్‌లో రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది. అలాగే ఈ మోటార్ సైకిల్ జెట్ బ్లాక్, వైట్.రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది -
అదిరిపోయిన ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!
దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు అనేక దిగ్గజ కంపెనీలతో సహ స్టార్టప్ కంపెనీలు కూడా వాహనాలను ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు పోటీ పడుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేస్తే, ఇప్పుడు ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పూణేకు చెందిన టోర్క్ మోటార్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ టోర్క్ క్రాటోస్ బైక్‌ను రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ధర కంపెనీ టోర్క్ క్రాటోస్ బైక్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్ చేసింది. ఒకటి టోర్క్ క్రాటోస్ కాగా, మరొకటి టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్. టోర్క్ క్రాటోస్ బైక్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర రూ.1,02,500 అయితే, టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ ధర రూ.1,17,500గా ఉంది. వీటి ధరలు ఆ రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీ బట్టి మారుతూ ఉంటాయి. ఈ బైక్ చూడాటానికి అచ్చం స్పోర్ట్స్ బైక్ మాదిరిగానే ఉంది. దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. టోర్క్ మోటార్ సైకిల్స్ నుంచి వచ్చిన క్రాటోస్ ఆర్ బైక్‌లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్, నేవిగేషన్ ఫీచర్లతో పాటు క్లౌడ్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో కొత్త ఆక్సియల్ ఫ్లక్స్ మోటార్ ఉండటంతో పాటు ఐపీ67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఎలక్ట్రిక్ బైక్ పరంగా ఇది అత్యధిక పీక్ పవర్ ఉత్పత్తి చేయడంతో పాటు అధిక రేంజ్ కూడా అందిస్తుంది. టోర్క్ క్రాటోస్ బ్యాటరీ ప్యాక్ ట్యాంక్ కింద ఉన్నప్పటికీ 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. రేంజ్ ఈ క్రాటోస్ బైక్ మోటార్ గరిష్టంగా 12 బిహెచ్పి పవర్ అవుట్ పుట్, 38 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టోర్క్ మోటార్స్ ఈ బైక్ 3.5 సెకండ్లలో సున్నా నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ గరిష్ట వేగం 105 కిలోమీటర్లు. దీని బ్యాటరీ ప్యాక్‌లో 4 కెడబ్ల్యుహెచ్ లియాన్ 21700 సెల్ ఉంటుంది. టోర్క్ క్రాటోస్ రెండు వేరియంట్స్ కూడా 180 కిలోమీటర్ల/సింగిల్ ఛార్జ్(ఐడిసి) సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ 120 కిలోమీటర్లు/ సింగిల్ ఛార్జ్ కు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ బైక్ మొదటి ఫేజ్‌లో కేవలం 6 నగరాల్లో మాత్రమే లభిస్తుంది. సెకండ్ ఫేజ్‌లో 100 నగరాల్లో లాంచ్ చేయనున్నారు. -
రిపబ్లిక్ డే రోజున మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..!
Tork Kratos: దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు అనేక కంపెనీలు తమ వాహనలను ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. 2017లో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన పూణేకు చెందిన టోర్క్ మోటార్స్. ఇప్పుడు తన మొదటి మోడల్ బైక్‌ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్దం అయ్యింది. టోర్క్ మోటార్స్ టోర్క్ క్రాటోస్ బైక్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే ఇప్పటి వరకు బయటకి వచ్చాయి. ఈ బైక్ చూడాటానికి అచ్చం పెట్రోల్ బైక్ మాదిరిగానే ఉంది. దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో ఉండి పల్సర్ ఎన్ఎస్ 200 తరహాలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. టార్క్ మోటార్ సైకిల్స్ నుంచి త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ “టోర్క్ క్రాటోస్'లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్, నేవిగేషన్ ఫీచర్లతో పాటు క్లౌడ్ కనెక్టివిటీ కూడా ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మంచి బ్యాకప్ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటర్ కూడా దీని సొంతం. ఈ బైక్ ఆక్సియల్ ఫ్లక్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ బైక్ స్పెషాలిటీ. దీని ధర రూ. 1.25 లక్షలుగా ఉండవచ్చు. జనవరి 26న వర్చువల్ ఈవెంట్ ద్వారా మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం అధికారిక బుకింగ్స్ కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఈ బైక్ బ్యాటరీ ఒక గంటలో 0-80 శాతం ఛార్జ్ కానుంది. ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రివోల్ట్ బైక్, త్వరలో రానున్న అల్ట్రావయొలెట్ ఎఫ్77కు పోటీగా రానుంది. (చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!) -
టార్క్ మోటార్స్ నుంచిఎలక్ట్రిక్ బైక్ ‘టీ6ఎక్స్’
ధర రూ.1.25 లక్షలు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ తయారీ కంపెనీ ‘టార్క్ మోటార్స్’ తాజాగా తన తొలి మోడల్ ‘టీ6ఎక్స్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.25 లక్షలు. లిథియమ్ అయాన్ బ్యాటరీస్తో నడిచే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. అలాగే బైక్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. బైక్ ఫుల్ చార్జ్‌కు రెండు గంటల సమయం, 80 శాతం చార్జ్‌కు ఒక గంట సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ఇక బ్యాటరీ లైఫ్ 80,000-1,00,000 కిలోమీటర్లు వస్తుందని తెలిపింది. లిథియమ్ అయాన్ బ్యాటరీస్ ధర తగ్గడం (గత మూడేళ్లలో 50 శాతం తగ్గింది) తమను బాగా ఆకర్షించిందని, ఆ మేర కు తాజా బైక్‌ను అందుబాటు ధరల్లో మార్కెట్లోకి తీసుకువచ్చామని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 5,000-10,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపింది. ఈ బైక్స్‌ను తొలిగా ఢిల్లీ, పుణే, బెంగళూరు ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో బైక్స్ అనువైన చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.