Tork Kratos: దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు అనేక కంపెనీలు తమ వాహనలను ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. 2017లో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన పూణేకు చెందిన టోర్క్ మోటార్స్. ఇప్పుడు తన మొదటి మోడల్ బైక్‌ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్దం అయ్యింది.
టోర్క్ మోటార్స్ టోర్క్ క్రాటోస్ బైక్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే ఇప్పటి వరకు బయటకి వచ్చాయి. ఈ బైక్ చూడాటానికి అచ్చం పెట్రోల్ బైక్ మాదిరిగానే ఉంది. దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో ఉండి పల్సర్ ఎన్ఎస్ 200 తరహాలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. టార్క్ మోటార్ సైకిల్స్ నుంచి త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ “టోర్క్ క్రాటోస్'లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్, నేవిగేషన్ ఫీచర్లతో పాటు క్లౌడ్ కనెక్టివిటీ కూడా ఉంది.
ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. మంచి బ్యాకప్ కెపాసిటీ ఉన్న బ్యాటరీతో పాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటర్ కూడా దీని సొంతం. ఈ బైక్ ఆక్సియల్ ఫ్లక్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ బైక్ స్పెషాలిటీ. దీని ధర రూ. 1.25 లక్షలుగా ఉండవచ్చు. జనవరి 26న వర్చువల్ ఈవెంట్ ద్వారా మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం అధికారిక బుకింగ్స్ కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఈ బైక్ బ్యాటరీ ఒక గంటలో 0-80 శాతం ఛార్జ్ కానుంది. ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న రివోల్ట్ బైక్, త్వరలో రానున్న అల్ట్రావయొలెట్ ఎఫ్77కు పోటీగా రానుంది.
(చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్..!)
Comments
Please login to add a commentAdd a comment